Social Icons

Pages

Thursday, June 21, 2018

Competitive Exams Special - Chola dynasty

చోళ సామ్రాజ్యం 
1. నవీన చోళ వంశానికి విజయాలయ వంశం అనే పేరు రావడానికి కారణం?  - ( విజయాలయుడు అనే రాజు స్థాపించడం)

2. చోళుల రాజధాని నగరం?  - (తంజావూరు)

3. పాండ్య సామంతుడు ముత్తయార్ ను ఓడించి తంజావూరును స్వాధీనం చేసుకున్న చోళ రాజు? - (విజయాలయుడు)

4. పల్లవ రాజైన అపరాజిత వర్మను ఓడించిన చోళ రాజు? - (ఆదిత్య చోళుడు)

5. చోళుల సార్వభౌమాధికారాన్ని నిలబెట్టిన చక్రవర్తి? - (రాజరాజు)

6. చోళ చక్రవర్తి రాజరాజుకు సంబంధించినవి? - (అసలు పేరు - ఆరుమోలీ వర్మన్
                                                                                    శివపాద శేఖర, చోళ మార్తాండ బిరుదులు 
                                                                                     సింహళను జయించిన తొలి పాలకుడు)

7. రాజరాజు జయించిన సింహళకు రాజధానిగా నిలిచిన ప్రాంతం? - (పొలనన్నూరువ)

8. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా బలమైన నావికాదళాన్ని కలిగిన చక్రవర్తి? - (రాజరాజ చోళుడు)

9. శ్రీలంకపై విజయంతో రాజరాజు జయించిన మరో విదేశీ రాజ్యం? - (మాల్దీవులు)

10. మొదటి రాజరాజు సహకారంతో వేంగి చాళుక్య రాజ్యానికి ఎవరు పాలకుడయ్యారు? - (శక్తివర్మ)

11. గంగానదిని దాటి రాజపుత్రుడైన మహిపాలుడిని ఓడించి, రాజేంద్ర చోళుడు పొందిన బిరుదు? - (గంగై కొండ)

12. రాజేంద్ర చోళుడు సాధించిన విజయాల్లో విశిష్టమైనది? - (శ్రీవిజయ సామ్రాజ్యం పై గెలుపు)

13. శ్రీవిజయ రాజ్యంపై విజయానికి చిహ్నంగా రాజేంద్రుడు ధరించిన బిరుదు? - (కడారం కొండ)

14. చోళచాళుక్య వంశ తొలి పాలకుడు? - (కులోత్తోంగ చోళుడు)

15. కులోత్తోంగ చోళుడు 72 మంది ప్రతినిధి బృందాన్ని ఏ దేశానికి రాయభారం పంపాడు? - (చైనా)

16. చోళుల కాలంలో రాష్ట్రాలకు గల పేరు? - (మండలాలు)

17. చోళుల కాలంలో పరిపాలన క్రమం?  - (మండలాలు - నాడులు - వలనాడులు - గ్రామాలు)

18. కుర్రం, కొట్టం అనేవి చోళుల పాలనలో  ........ ? - (గ్రామాల సముదాయం)

19. భారతదేశ చరిత్రలో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టిన ఏకైక వంశం? - (చోళులు)

20. చోళుల స్థానిక స్వపరిపాలన విధానాన్ని తెలిపే శాసనం? - (ఉత్తర, మేరూర్ శాసనం)

21. ఊర్, సభ, నగరం అనేవి  చోళుల కాలంలో ......... ? - (గ్రామ సభలు)

22. చోళుల కాలంలో గ్రామసభ సభ్యులకు సంబంధించి వాస్తవం? - (ఊర్ - గ్రామస్తులంతా సభ్యులే, సభ - బ్రాహ్మణులు సభ్యులు, నగరం - వర్తకులు సభ్యులు)

23. చోళుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి? - (వ్యవసాయం)

24. చోళుల కాలంలో భూమి పన్ను శాతం? - (1/4)

25. చోళుల కాలంలో వివిధ పన్నులు, వాటి అంశాలకు సంబంధించినవి? - (నీటివనరులపై పన్ను - వళుక్క పట్టం; సంతలపై పన్ను - అంగడి పట్టం; వర్తకులపై పన్ను - శెట్టిరాయ; స్వర్ణాభరణాల తయారీ పన్ను - పట్టార్ పొట్టాం)

26. పన్నులకు మినహాయింపు ఇచ్చిన చోళ చక్రవర్తి? - (కులోత్తోంగ చోళుడు)

27. ఏ దేశంతో రాయభారం నిర్వహించి, విదేశీ వాణిజ్యం అధికంగా చేశారు? - (చైనా)

28. ఎన్నాయిరం, త్రిభువనం అనేవి చోళుల కాలంలో ప్రసిద్ధి పొందిన........ ? - (విద్యా కేంద్రాలు)

29. చోళుల కాలంలో ఏ భాషను స్వర్ణయుగంగా చరిత్రకారులు అభివర్ణించారు? - (తమిళం)

30. కవి చక్రవర్తిగా పేరుపొంది, తమిళ రామాయణం రాసిన కవి? - (కంబన్)

31. తమిళ కవులు - వాటి గ్రంథాలు : (పెరియ పురాణం - శిక్కిలార్; కళింగ పట్టుపరణి - జయగోండర్; జీవన చింతామణి - తిరువత్తి దేవర్)

32. మొదటి పరాంతకుడి కాలంలో ఋగ్వేదానికి భాష్యం రాసింది? - (వెంకట మాధవుడు)

33. సంస్కృతంలో బ్రహ్మసూత్రలపై రామానుజాచార్యులు రాసిన వ్యాఖ్యాన గ్రంథం? - (శ్రీ భాష్యం)

34. త్రిమతాచార్యులకు సంబంధించినవి: (ద్వైతం - మద్వాచార్యులు; విశిష్టా ద్వైతం - రామానుజుడు; అద్వైతం - శంకరాచార్యులు)

35. చోళులు దేవాలయాల్లో ప్రవేశపెట్టిన నూతన సంప్రదాయ విధానం? - (పంచలోహాలతో విగ్రహాల తయారీ)

36. గంగై కొండ చోళేశ్వరాలయం నిర్మాత? - (రాజేంద్ర చోళుడు)

37. చోళులు నిర్మించిన 4 చేతుల నటరాజస్వామి విగ్రహం ఎక్కడుంది? - (చిదంబరం)

38. చోళుల కాలంలో లలిత కళలకు పేరుగాంచిన ప్రాంతం? - (మధుర)

No comments:

Post a Comment