Social Icons

Pages

Tuesday, November 2, 2021

పోటీపరీక్షల ప్రత్యేకం - పశు సంవర్ధనం

 పశు సంవర్ధనం

చేపల పెంపకం 

1. చేపల మాంసంలో ఉండే మాంసకృత్తులు శాతం? 

జవాబు: 15 - 25 

2. చేప మాంసంలో లభించే ముఖ్యమైన ఆహార పదార్థాలు ?

జవాబు: ప్రొటీనులు

3. చేప మాంసంలో ఉండే విటమిన్లు ? 

జవాబు: ఎ, డి

4. చేప మాంసంలో ఉండే కొవ్వు ఆమ్లాలు ?

జవాబు: అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 

5. ఎక్కువ జీవ ప్రామాణిక విలువ కలిగిన జీవులు ? 

జవాబు: చేపలు

6. మంచినీటి చేపలు? 

జవాబు. శాస్త్రీయ నామం          సామాన్య నామం

1. కట్లకట్ల                                బొచ్చె  

2. లేచియో రోహిట                  రోహు, ఎర్రగండు

 3. సిర్రినస్ మృగేలి             ఎర్రమోసు

 4. ఎనబాస్ సరోవ                    -

 5. సిప్రినస్ కార్పియో              పెద్దబొచ్చె

 6. వాలుగ అట్టు                                వాలుగ

7. టిలాపియ మొసాంబికస్               -

8. చెన్న పంక్టేట                                  మట్టగిడస

7. సముద్రపు చేపలు ? 

జవాబు. శాస్త్రీయ నామం               సామాన్య నామం

1. రాస్ట్రిల్లజర్ కనగుర్తా            కనగుర్త

2. సార్టినెల్లా లాంజిసెప్స్     నూని కావల్లు

 3. హార్పోడాన్ నెహీరియస్     వానమట్ట 

4. హిల్సా హిల్సా                  పొలస

 5. లాక్టేరియస్ లాక్టేరియస్   సుడుము 

6. స్కోలియోడాన్                  సొర 

7. ట్రైక్యూరస్ లెప్ట్యూరస్       సావల్లు, రిబ్బను చేప

 8. జీవావరణంలో మార్పులేకుండా, ఒకే పరిమాణంలో ఉండే, ఒకే రకమైన చేపను అధిక సంఖ్యలో పెంచడాన్ని ఏమంటారు?

జవాబు. మత్స్య సంవర్ధనం

 9. వ్యవసాయదారుల మొదటి పంట ? 

జవాబు. వరి

10. వ్యవసాయ దారుల రెండో పంట ?

జవాబు. చేపల పెంపకం

11. మత్స్య పరిశ్రమలోని దశలు? 

జవాబు. 1. ప్రజననము లేదా గుడ్లు సేకరించుట 

     2. గుడ్లను పొదుగుట - చేపలను పెంచుట

12. చేపలు ఎటువంటి నీటిలో గుడ్లు పెడతాయి ? 

జవాబు. ప్రవహించే నీటిలో

13. చేపలు గుడ్లు పెట్టే కాలం? 

జవాబు. వానాకాలం

 14. వానాకాలం ముందు గుడ్లను పెట్టే పెద్ద చేపలను కుంటల్లోకి వదులుతారు. ఈ చేపలనేమంటారు ? 

జవాబు. బ్రీడర్స్ 

15. అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న చేపలను ఏమంటారు ?

జవాబు. స్పాన్

 16. చేపల పెంపకంలో పెద్ద చేపలను ప్రత్యేకంగా నిర్మించిన గదుల్లో కృత్రిమంగా పెద్ద ఎత్తున గుడ్లను పెట్టేటట్లు చేసే పద్ధతి? 

జవాబు. కృత్రిమ ప్రజననం

17. గుడ్లు పెట్టే మగ, ఆడ చేపలకు ఎక్కించే స్రావం? 

జవాబు. పీయూష గ్రంధి స్రావం

18. చేపలకు పీయూష గ్రంధి స్రావాన్ని ఎక్కించడానికి కారణం? 

జవాబు. ఆడ చేపల్లో అండాలు, మగ చేపల్లో శుక్రకణాల అభివృద్ధికి 

19. మగ చేపల నుంచి విడుదలైన శుక్లాన్ని ఏమంటారు ? 

జవాబు. మిల్ట్

 20. చేపల రకాలను బట్టి నిర్మించే తటాకాలు ?

జవాబు. నర్సరీ, రియరింగ్, స్టాకింగ్ తటాకాలు 

21. తటాకాలు ఏ ఆకారంలో ఉండాలి ?

జవాబు. దీర్ఘచతురస్రాకారం

 22. నర్సరీ తటాకం లోతు ఎంత ఉంటుంది ? 

జవాబు. 1.2 నుంచి 1.5 మీటర్లు 

23. నర్సరీ తటాకం విస్తీర్ణం? 

జవాబు. 0.02 నుంచి 0.08 హెక్టార్లు 

24. నర్సరీ తటాకంలో పెంచే చేప సైజు ఎంత ఉండాలి? 

జవాబు. 5.6 - 30 మి. మీటర్లు 

25. రియరింగ్ కుంట లోతు? 

జవాబు. 2 మీటర్లు

 26. రియరింగ్ కుంట విస్తీర్ణం? 

జవాబు. 0.1 హెక్టారు వరకు

27. రియరింగ్ కుంటలో పెంచే చేప సైజు?

జవాబు. 30 నుంచి 100 మిల్లీ మీటర్లు

 28. స్టాకింగ్ కుంట లోతు? 

జవాబు. 2.5 మీ

 29. స్టాకింగ్ కుంట విస్తీర్ణం?

జవాబు. 20 హెక్టార్లు

30. స్టాకింగ్ కుంటలో చేప సైజు ఎంత ఉండాలి?

జవాబు. 100 మి.మి నుంచి పూర్తి సైజు వరకు

31. చేపల క్షేత్రం ఆర్థిక స్థితి దేనిమీద ఆధారపడి ఉంటుంది?

జవాబు. కుంట నిర్మించే ప్రదేశం మీద 

32. చేపల తటాకం నిర్మాణానికి అనువైన నేల? 

జవాబు. రేగడి నేల

 33. కుంటలను ఏ కాలంలో నిర్మించడం మంచిది ?

జవాబు. వేసవి కాలం

 34. హెక్టారుకు ఎంత స్పాన్ ను నర్సరీ కుంటల్లో పెంచితే మంచిది ?

జవాబు. 1 లేదా 2 మిలియన్లు 

35. ఓ కుంట ఎన్ని చేపలను పోషించగలదో దాన్ని ఏమంటారు ? 

జవాబు. క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ పాండ్ 

36. స్పాన్ కు ఇవ్వవలసిన ఆహారం? 

జవాబు. ఆయిల్ కేక్, వరి తవుడు

36. జీవశాస్త్రీయ పద్ధతి ద్వారా కుంటలోని కలుపు మొక్కలను తొలగించడంలో ఉపయోగపడే చేపలు?

జవాబు. టిలాపియా మోసాంబికా, సిప్రినస్ కార్పియో

 37. ఏ కుంటల్లో చేపలను మార్కెట్లో అమ్మే సైజుకు పెంచుతారు ? 

జవాబు. స్టాకింగ్ కుంటల్లో

37. చేపలకు వేటి వల్ల వ్యాధులు సంక్రమిస్తాయి?

జవాబు. ప్రోటాజోవన్లు, క్రస్టేషియన్లు, టేప్ వర్మ్ లు, బాక్టీరియా, వైరస్ 

38. చేపల వ్యాధులను కలిగించే పరాన్న జీవులకు మాధ్యమిక అతిధేయి? 

జవాబు. నత్త

39. చేపలను రవాణా చేసే ముందు వాటిని ఏ నీటిలో కడగాలి? 

జవాబు. క్లోరిన్ నీటిలో 

40. చేపలను రవాణా చేసేటపపుడు వాటిని ఏ నిష్పత్తిలో ఐస్ డబ్బాల్లో ఉంచాలి ? 

జవాబు. 1:1

41. చేపలను విషపూరితం చేసే బాక్టీరియా? 

జవాబు. క్లాస్ట్రీడియం బొటులినం 

42. కుంటల్లో ఒకే రకం చేపలను పెంచే పద్ధతి ?

జవాబు. మోనోకల్చర్ పద్ధతి

 43. కుంటల్లో ఒకటి కంటే ఎక్కువ చేపల రకాలను పెంచితే దానిని ఏమంటారు? 

జవాబు. పాలికల్చర్ లేదా కంపోజిట్ కల్చర్ 

44. కృత్రిమ ప్రజననలో గుడ్లను పొదగడానికి ప్రత్యేకమైన ఏర్పాటు ? 

జవాబు. ఇంక్యుబేటర్


పట్టు సంవర్ధనం 

1. మల్బరి చెట్లను పెంచడం, గుడ్లను సేకరించడం, గొంగళి పురుగులను పెంచడం, కుకూన్లను ఉత్పత్తి చేసి చివరకు పట్టు దారాలను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు ? 

జవాబు. పట్టు సంవర్ధనం 

2. పట్టు పరిశ్రమలో ముఖ్య కార్యక్రమం?

జవాబు. మల్బరీ చెట్లను పెంచడం 

3. పట్టు పురుగులు వేటిని తింటాయి? 

జవాబు. మల్బరీ ఆకులను 

4. చైనాలో పట్టు పరిశ్రమ ఎప్పుడు ప్రారంభమైంది ? 

జవాబు. క్రీ.పూ.2,600

 5. పట్టు పరిశ్రమలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న దేశాలు ?

జవాబు. జపాను, చైనా 

6. పట్టు పరిశ్రమలో మన దేశం స్థానం? 

జవాబు. మూడు

 7. శస్త్రచికిత్సలో గాయాలు కలిపి కుట్టడానికి, గాలి గుమ్మటాలు, బెలూన్లు తయారు చేయడానికి ఏ దారాలు ఉపయోగిస్తారు ?

జవాబు. పట్టు దారాలు

8. పట్టు పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థ? 

జవాబు. కేంద్రీయ పట్టు పరిశ్రమ సంస్థ 

9. మన దేశంలో సిల్కును ఉత్పత్తి చేసే ముఖ్య రాష్ట్రం ?

జవాబు. కర్ణాటక 

10. మన రాష్ట్రంలో పట్టు ఉత్పత్తి చేసే ముఖ్య కేంద్రాలు ? 

జవాబు. అనంతపురం, విశాఖపట్నం 

11. పట్టు పురుగులో పట్టు ఉత్పత్తి చేసే గ్రంధులు ? 

జవాబు. పట్టు గ్రంధులు 

12. పట్టు పురుగులు ఏ ప్రొడజీవి గొంగళి పురుగులు ? 

జవాబు. 'బోంబెక్స్ మోరి' అనే పట్టు మాత్ 

13. సీతాకోకచిలుక విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దాని రెక్కలు ఎలా ఉంటాయి ?

జవాబు. నిటారుగా

14. రెక్కలు అడ్డంగా ఉంటే అది ఏ జీవి ? 

జవాబు. మాత్ లు  

15. పట్టు పురుగులోని లాలాజల గ్రంధులు ఏ గ్రంధులుగా మార్పు చెందాలి ?

జవాబు. సిల్కు గ్రంధులు

16. పట్టులోని రకాలు? 

జవాబు. మల్బరీ పట్టు, టాసార్, ఈరీ, మూంగా పట్టులు

17. మల్బరీ ఆకుల మీద పట్టు మాత్ ఎన్ని గుడ్లు పెడుతుంది ?

జవాబు. 300 నుంచి 500

18. గొంగళి పురుగులు మల్బరి ఆకులను తిని   మాత్ లుగా మారడానికి ఎంతకాలం పడుతుంది? 

జవాబు. 1 నెల

19. గొంగళిపురుగు కవచంలో రంధ్రం చేసుకుని బయటకు వచ్చి, పాత కవచాన్ని వదిలి కొత్త కవచం ఏర్పాటు చేసుకోవడాన్ని ఏమంటారు? 

జవాబు. నిర్మోచనం

20. పట్టు పురుగు ఎన్నిసార్లు నిర్మోచనం జరుపుతుంది ?

జవాబు. 4 సార్లు

21. పెరగడం పూర్తి అయ్యాక, గొంగళి పురుగు శరీరం చుట్టు పట్టు దారాలతో ఏర్పరచుకునే కోశం?

జవాబు. కుకూన్ 

22. కుకూన్ ఏర్పడే దశ ?

జవాబు. ప్యూపాదశ 

23. పట్టులో ఉండే ప్రొటీన్?

జవాబు. ఫైబ్రోయిన్

 24. కుకూన్ పూర్తయిన తర్వాత 48 గంటల్లో గొంగళి పురుగులు మార్పు చెంది మాత్ గా ఏర్పడటం?

జవాబు. రూపవిక్రియ 

25. కుకూన్లని ఎండబెట్టి వాటి నుంచి పట్టు తీయడం కోసం వాటిని ఎక్కడికి పంపుతారు?

జవాబు. రీలింగ్ యూనిట్లకు 

26. పట్టు పరిశ్రమలో లార్వాలకు వ్యా ధిని కలగజేసే ఏక కణజీవి ? 

జవాబు. పెబ్రయిన్ 

27. టస్సార్ పట్టు ఏ పట్టు పురుగు నుంచి లభిస్తుంది ?

జవాబు. అంధీరియా పాంపియా

 28. ఆటవిక జాతివారు సంప్రదాయ పద్ధతిలో పెంచే పట్టు పురుగులు ? 

జవాబు. టస్సార్ 

29. ఈరీ పట్టు పురుగు శాస్త్రీయ నామం? 

జవాబు. అట్టాకస్ సింధియా

 30. ఈరీ పట్టు పురుగు ఆహారం?

జవాబు. ఆముదం, కసావా, బొప్పాయి, గులార్ ఆకులు 

31. మూంగా పట్టు ఏ పట్టు పురుగు నుంచి లభిస్తుంది ?

జవాబు. థియోఫిలా రెలిజియోసా 

32. ఎక్కువ నాణ్యత కలిగిన పట్టు ? 

జవాబు. మల్బరీ పట్టు

33. యూజీ ఈగ వేటిని సంహరిస్తుంది? 

జవాబు. పట్టుపురుగు


కోళ్ల పెంపకం

1. కోడి ఏ ప్రజాతికి చెందింది?

 జవాబు. గాలస్ ప్రజాతి

 2. గుడ్ల కోసం పెంచే కోళ్లను ఏమంటారు ?

జవాబు. లేయర్స్ 

3. మాంసం కోసం పెంచే కోళ్లను ఏమంటారు ?

జవాబు. బ్రాయిలర్స్

 4. పౌల్ట్రీ పరిశ్రమ కిందకు వచ్చే పక్షులు ? 

జ. కోళ్లు, బాతులు, టర్కీ కోళ్లు 

5. లేయర్ పక్షులు, బాయిలర్ పక్షుల పిల్లలను సరఫరా చేసే వాణిజ్య సంస్థలను ఏమంటారు ? 

జవాబు హేచరీస్

6. కృత్రిమ పద్ధతిలో గుడ్లను వేటిలో పొదుగుతారు ? 

జవాబు. గుడ్ల ఇన్కుబేటర్ 

7. దేశీయ పక్షి రకాలు?

జవాబు. ఆసిల్, చిట్టగాంగ్, ఘాగుస్

8. భారతదేశంలోని విదేశీ పక్షుల రకాలు ?

 జవాబు. మెడిటరేనియన్, అమెరికా, ఇంగ్లిష్ రకాలు 

9. గుడ్లు పెట్టడానికి మేలైన కోడి? 

జవాబు. మెడిటరేనియన్ కోడి.

10. మంచి మాంసాన్ని ఇచ్చే కోళ్లు ?

జవాబు. ఇంగ్లిష్ రకం కోళ్లు

11. అమెరికన్ రకం కోళ్ల గుడ్లు ఏ రంగులో ఉంటాయి ? 

జవాబు. బూడిద

12. కోళ్ల పెంపకంలో ముక్క కొనను కత్తిరించడాన్ని ఏమంటారు ?

జవాబు. డీబీకింగ్

13. బ్రాయిలర్ పక్షులను మాంసం కోసం ఎన్ని వారాలు పెంచుతారు?

జవాబు. 8 - 10 వారాలు

14. ప్రతి బ్రాయిలర్ పక్షి 10 వారాల వయస్సులో 3 కిలోల ఆహారాన్ని తిని, ఎంత వరకు తన శరీరబరువు పెంచుకుంటుంది? 

జవాబు. 2 కిలోలు

15. పక్షి పెరుగుదలలో కొంత ఆహారాన్ని జంతు ప్రొటీన్‌గా మార్చగలిగే శక్తిని ఏమంటారు? 

జవాబు. ఫీడ్ కన్వర్షన్ కెపాసిటి

16. కోళ్ల పరిశ్రమలోని పక్షులు సాధారణంగా గురయ్యే బాక్టీరియా వ్యాధులు ? 

జవాబు. కోళ్ల కలరా, కొరైజాల్, సాల్మానిలోసిస్ 

17. కోళ్లలో సాధారణంగా వ్యాపించే వైరస్ వ్యాధులు? 

జవాబు. కోళ్ల మశూచి, కొక్కెర వ్యా ధి 

18. పక్షుల బాహ్య శరీరంపై వ్యాధులను కలుగజేసే బాహ్య పరాన్న జీవులు ? 

జవాబు. కోళ్లమైట్, ఈగలు, పేనులు

19. పక్షుల శరీరంలో వ్యాధులను కలుగజేసే అంతర పరాన్నజీవులు ? 

జవాబు. ఏలికపాములు, బద్దె పురుగులు, కాక్సిడియోసిస్

20. కోళ్లకు కావాల్సిన మాంసకృతుల శాతం? 

జవాబు. 20

21. కోళ్లకు ఉపయోగించే మందులు ? 

జవాబు. సల్పో మందులు


ఆవు, గేదెల ప్రజననం 

1. పెరుగుదల, శరీరాభివృద్ధికి కావాల్సిన మాంసకృతులు, ప్రొటీనులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు పాలలో ఉంటాయి. కాబట్టి పాలు ? 

జవాబు. సంపూర్ణ ఆహారం

 2. పాశ్యాత్య దేశాల్లో వేటిపాలను ఎక్కువగా వాడతారు ? 

జవాబు. ఆవుపాలు

 3. పాలు పితకడం, వెన్న, నెయ్యి, పెరుగు, జున్ను వంటి పదార్థాలు తయారు చేసే పనులు ? 

జవాబు. డెయిరీ పనులు 

4. వ్యవసాయదారులు అనుబంధ పరిశ్రమగా ఏ పరిశ్రమను నిర్వహిస్తారు ? 

జవాబు. పాడి పరిశ్రమ 

5. పాల ఉత్పత్తిని పెంచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం? 

జవాబు. ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్

 6. దేశీయ పశువులు రోజుకు ఎన్నిలీటర్ల పాలిస్తాయి? 

జవాబు. 1 లేదా 2 లీటర్లు

 7. ఇతర దేశాల్లో ఉండే జెర్సీ(ఇంగ్లండ్), హలిస్టిన్(డెన్మార్క్ ) జాతులు రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తాయి? 

జవాబు. 20 నుంచి 30 లీటర్లు

 8. జెర్సి, హలిస్టీన్ ఎద్దులను తెచ్చి దేశీయ ఆవులతో సంపర్కం జరపగా, పుట్టిన సంకరజాతి ఆవులు రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తాయి?

 జవాబు. 8 నుంచి 20 లీటర్లు

 9. ఒకే జీవికి చెందిన రెండు జాతుల మధ్య జరిగే సంపర్కాన్ని ఏమంటారు? 

జవాబు. సంకర ప్రజననం లేదా బాహ్య ప్రజననం

 10. సంపర్కానికి ఎద్దులు, ఆవులు సరైన శారీరక స్థితిలో ఉండే స్థితి ? 

జవాబు. "ఎద"

11. ఓ ఆవు ఈనడానికి ఎంతకాలం పడుతుంది? 

జవాబు. 2 సంవత్సరాలు

12. ఓ ఆవు తన జీవితకాలంలో ఎన్ని దూడలను కంటుంది? 

జవాబు. 8 నుంచి 10 

18. ఎద్దుల శుక్లాన్ని ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేస్తారు ? 

జవాబు. - 196° సెంటిగ్రేడ్లు

 14. ఎద్దుల శుక్లాన్ని ఏ ద్రావణంలో గడ్డ కట్టించి నిల్వచేస్తారు ?

 జవాబు. నత్రజని ద్రావణం

15. నత్రజని ద్రావణంలో గడ్డ కట్టించి నిల్వ ఉంచిన శుక్రకణాలు చైతన్యవంతంగా ఉండే కాలం? 

జవాబు. 10 నుంచి 12 సంవత్సరాలు 

16. నిల్వ ఉంచిన శుక్లాన్ని గది ఉష్ణోగ్రతకు వేడి చేసి ఆవుల్లో ప్రవేశపెట్టడం ద్వారా గర్భం వచ్చేటట్లు చేయడాన్ని ఏమంటారు? 

జవాబు. కృత్రిమ గర్భధారణ 

17. ఓ ఎద్దు నుంచి లభించే శుక్లంతో ఎన్ని ఆవులను గర్భధారణ చేయవచ్చు ?

జవాబు. 3,000 

18. ఆవు వేడి లేదా ఎదలో ఉన్నప్పుడు అండాన్ని విడుదల చేయడాన్ని ఏమంటారు ? 

జవాబు. అండోత్పత్తి

 19. ఓ ఆవు నుంచి ఎక్కువ అండాలను విడుదల చేయించడానికి ఆవులకు ఎక్కించే హార్మోన్? 

జవాబు. సీరమ్ గొనాడోట్రోపిన్ 

20. సీరం గొనాడోట్రోపిన్ హార్మోన్ ను దేని నుంచి సేకరిస్తారు ?

 జవాబు. గర్భంతో ఉన్న ఆడ గుర్రాల రక్తం నుంచి 

21. ఓ ఆవు నుంచి ఎక్కువ అండాలను విడుదల చేయించడాన్ని ఏమంటారు ? 

జవాబు. సూపర్ ఓవ్వులేషన్

22. ఫలదీకరణం తర్వాత పిండాలను బయటకు తీసి ఇతర ఆవుల్లో ప్రవేశపెడతారు. ఈ ఆవులను ఏమంటారు? 

జవాబు. కారియర్ ఆవులు

23. కారియర్ ఆవుల్లో పిండాలు దూడలుగా ఎదిగే పద్ధతి? 

జవాబు. పిండమార్పిడి పద్ధతి

24. పిండమార్పిడి పద్ధతి వల్ల ఓ ఆవు ఒకే సంవత్సరంలో ఎన్ని దూడలను ఉత్పత్తి చేస్తుంది?

జవాబు. 4 లేదా 5 

25. ప్రస్తుతం కృత్రిమ గర్భధారణ తర్వాత పిండాలను సేకరించి ఏ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టించి నిల్వ ఉంచుతారు? 

జవాబు. -196° సెంటిగ్రేడ్లు

 26. గేదెలో ఆవు పాలకంటే ఏ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి? 

జవాబు. కొవ్వు పదార్థాలు

 27. మనదేశంలో గేదెల జాతులు?

జవాబు. ముర్రా, భద్వారి, జఫ్రాబాడి, సుర్తి, మేష్ణ, నాగ్ పూరి, నీలిరావి 

28. భారత ప్రభుత్వం ఎక్కువ పాలనిచ్చే గేదె జాతిగా దీన్ని గుర్తించింది? 

జవాబు. ముర్రాజాతి

29. ముర్రాజాతి గేదెలు సంవత్సరానికి ఎన్ని లీటర్ల పాలిస్తాయి? 

జవాబు. 1,800 - 2,200 లీటర్లు

No comments:

Post a Comment