Social Icons

Pages

Saturday, January 6, 2018

General Knowledge - Earth - Enclosures

భూమి - ఆవరణాలు 
1. 1492 లో భారతదేశానికి చేరాలని బయలు దేరిన కొలంబస్ ఏ దేశం? - (ఇటలీ)

2. ఐరోపా నుంచి పశ్చిమ దిశగా బయలుదేరిన కొలంబస్ ఏ దీవులకు చేరుకున్నాడు? - (కరేబియన్)

3. భూమి ఎటువైపు భ్రమణం చేస్తుంది? - (పడమర నుంచి తూర్పునకు)

4. ఉత్తర, దక్షిణ ధృవాల ద్వారా భూమి మధ్యగా గీసిన ఊహారేఖను ఏమంటారు? - (అక్షం)

5. 180° తూర్పు, పశ్చిమ రేఖాంశానికి మరోపేరు? - (అంతర్జాతీయ దినరేఖ)

6. - భూమిని సమాన అర్థగోళాలు చేసేది? - (భూమధ్య రేఖ)

7. 'లాటిట్యూడో' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? - (లాటిన్)

8. లాటిట్యూడ్ అంటే అర్థం? - (వెడల్పు)

9. Hemisphere లో Hemi అంటే అర్థం? - (సగభాగం)

10. అక్షాంశాల్లో పొడవు అనే పదానికి సమానపదం ఇచ్చే పదం? - (లాంగిట్యూడ్)

11. యాంటి మెరిడియన్ అంటే? - (180° రేఖాంశం)

12. భూమి ఒకడిగ్రీ మేర కదలడానికి పట్టే సమయం? - (4ని)

13. మధ్యాహ్న రేఖలు అని వేటిని అంటారు? - (రేఖాంశాలు)

14. గ్రీనిచ్ కంటే భారత కాలమానం? - (5. 30 గం. ముందు)

15. సముద్ర ప్రవాహాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహించడాన్ని ఏమంటారు? - (ప్రవాహాలు)

16. సముద్ర ఉపరితల నీటిమట్టం హెచ్చు, తగ్గులను ఏమంటారు? - (తరంగాలు)

17. సముద్రంలో నీటిమట్టం ప్రతి రోజూ పెరగడాన్ని, తగ్గడాన్ని ఏమంటారు? - (పోటు పాటు)

18. 'లితో' అంటే గ్రీకు భాషలో అర్థం? - (రాయి)

19. 'అట్మాస్పియర్' లో అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం? - (నీటిఆవిరి)

20. మధ్యధరా సముద్ర ద్వీప స్తంభం అని ఏ అగ్నిపర్వతాన్ని అంటారు? - (స్ట్రాంబోలి)

21. 'కిలిమంజారో' అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? - (టాంజానియా)

22. భారతదేశంలోని అగ్నిపర్వతం? - (నార్కొండం)

23. సజీవంగా ఉన్న 3/4 వంతు అగ్ని పర్వతాలు ఏ మహాసముద్ర అంచున ఉన్నాయి? - (ఫసిఫిక్)

24. ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల శిలలు బలహీనమై, పగిలిపోయే ప్రక్రియను ఏమంటారు? - (శిలాశైథిల్యం)

25. కొలొరాడో నది ప్రత్యేకత? - (అతిపెద్ద అగాధ ధరిని కలిగి ఉంది)

26. గోదావరి నదిపై బైసన్ గార్జ్  ఎక్కడుంది? - (పాపికొండలు)

27. నదులు V ఆకారం లోయను ఎక్కడ ఏర్పాటు చేస్తాయి? - (పర్వత ప్రాంతాల్లో)

28. ప్రపంచంలో ఎత్తైన జలపాతం? - (ఎంజెల్)

29. ఎంజెల్ జలపాతం ఏ నదిపై ఉంది? - (చురుణ్)

30. భారతదేశంలో ఎత్తైన జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? - (శరావతి)

31. ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను కలిగి ఉన్న నది? - (గంగా)

32. U ఆకారపు లోయలను ఏర్పాటు చేసేవి? - (హిమానీ నదాలు)

33. ట్రోపో ఆవరణం సగటు ఎత్తు ఎన్ని కి. మీ.? - (13)

34. ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? - (భూమధ్య రేఖ)

35. అన్నిటి కంటే పైన ఉండే ఆవరణం? - (ఎక్సో)

36. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? - (స్ట్రాటో)

37. అయానో ఆవరణం అని దేనికి పేరు? - (థర్మో)

38. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గే ఆవరణం? - (ట్రోపో)

39. సమశీతోష్ణ మండలాల్లో వీచే పవనాలు? - (పశ్చిమ పవనాలు)

40. 'మౌసమ్' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? - (అరబిక్)

41. 'చినూడ్' అనే పదానికి అర్థం? - (మంచును తినేది)

42. భారతదేశంలో మే - జూన్ నెలల్లో వీచే పవనాలు? - (లూ)

43. ఆల్ప్స్ పర్వాతాల మీదుగా వీచే ఉష్ణ పవనం? - (ఫోన్)

44. బాగా ఎత్తులో ఉన్న మేఘాలను ఏమని పిలుస్తారు? - (సిర్రస్)

45. ఒరోజెనిక్ వర్షపాతం అని దేనిని అంటారు? - (పర్వతీయ వర్షపాతం)

46. సైక్లోన్ అనే ఇంగ్లీష్ పదానికి మూలమైన గ్రీక్ పదం 'కైక్లోన్' అంటే అర్థం? - (తిరుగుతున్న)

47. అవపాతం ఏ రూపంలో ఉంటుంది? - (వర్షం, మంచు, తుఫాను, వడగండ్లు)

48. గాలి వేగాన్ని కొలిచే పరికరం? - (అనిమో మీటర్)

49. ఆక్స్ భౌ సరస్సులు వేటి ద్వారా ఏర్పడతాయి? - (నదీ ప్రవాహాలు)

50. జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలమైన పొర? - (స్ట్రాటో ఆవరణం)

No comments:

Post a Comment