Social Icons

Pages

Tuesday, July 26, 2022

మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు

 మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు 

1. భారతదేశం మొదటగా భూకక్ష్యలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం?

1) ఆర్యభట్ట  2) భాస్కర-1  3) ఇన్‌శాట్ - 1బి   4) భాస్కర - 2   (1)

2. అన్నింటికంటే ప్రకాశంగా కనిపించే గ్రహం?

1) శని  2) భూమి  3) శుక్రుడు  4) బుధుడు   (3)

3. పగలు, రాత్రి ఏర్పడడానికి కారణం?

1) భూ పరిభ్రమణం  2) భూ భ్రమణం  3) ఉల్కాపాతం  4) ఏదీకాదు    (2)

4. సూర్య గ్రహణం ఏ సందర్భంలో ఏర్పడుతుంది?

1) భూమి.. చంద్రుడికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు  

2) చంద్రుడు.. భూమికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు

3) సూర్యుడు భూమి, చంద్రుడి మధ్య వచ్చినప్పుడు      4) అన్నీ         (2)

5. రాశుల్లో అన్నింటికంటే పెద్ద తారాగణం?

1) సెరస్  2) ఇంకారస్  3) హైడ్రా  4) హేలీ   (3)

6. రష్యా సహకారంతో భారతదేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పర్చిన ప్రదేశాలు?

1) తుంబా  2) శ్రీహరికోట  3) ఢిల్లీ  4) 1, 2  (4)

7. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం?

1) శని  2) బృహస్పతి  3) బుధుడు  4) శుక్రుడు  (1)

8. ఇప్పటివరకు గుర్తించిన నక్షత్రాల్లో అతిపెద్దది?

1) సెరస్  2) ఎప్సిలాన్ అరిగ  3) హైడ్రా  4) ఇంకారస్  (2)

9. మొట్టమొదటి స్పేస్ షటిల్?

1) అపోలో  2) స్పుత్నిక్  3) కొలంబియా  4) వస్తోక్   (3)

10. స్కైలాబ్ అనే ప్రయోగాత్మక అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏ దేశం ఏర్పాటు చేసింది?

1) రష్యా   2) అమెరికా  3) ఇండియా  4) సింగపూర్   (2)

11. చంద్రుడు తన చుట్టూ తాను, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు? 

1) 30 రోజులు  2) 29 1/2 రోజులు   3) 92 1/2 రోజులు   4) 29 రోజులు  (2)

12. ధ్రువ నక్షత్రం నావికులకు దేన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది? 

1) గెలాక్సీ  2) గాలి  3) దిక్కు  4) వాతావరణం  (3)

13. ఒక కాంతి సంవత్సరం (కి.మీ.లలో)? 

1) 3 ×104 × 60 × 60 ×24 × 365.25  2) 3 × 102 × 60 × 60 × 24 × 365.25  

3) 3 × 105 × 60 × 60 × 24 × 365.25  4) 3 ×103 × 60 × 60 × 24 × 365.25    (4)

14. నక్షత్రాలు కాంతిని నలుదిశలకు వెదజల్లా లంటే వాటిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత? 

1) 10 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  2) 5 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  

3) 5 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  4) 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  (4)

15. 1994లో విజయవంతంగా ప్రయోగించిన భారతీయ ఉపగ్రహ నౌక? 

1) ఇన్‌శాట్-1బి  2) పీఎస్‌ఎల్‌వీడీ-2  3) భాస్కర-2  4) ఆర్యభట్ట   (2)

16. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం?

1) 149,000,000 కి.మీ.  2) 149,598,500 కి.మీ.  3) 149,593,300 కి.మీ  4) 149,895,500 కి.మీ.  (2)

17. ఏ అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు? 

1) స్కాటర్‌‌న - 5, స్కాటర్‌‌న - 6  2) అపోలో - 11, సోయూజ్-టీ-11  

3) వైకింగ్-1, వైకింగ్-2  4) సోయూజ్ -టీ-11, శాల్యూట్  (3)

18. బుధ గ్రహం పరిభ్రమణ కాలం? 

1) 88 రోజులు  2) 248 రోజులు 3) 365 రోజులు  4) 243 రోజులు   (1)

19. స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేసిన రోజు? 

1) 3-6-1984  2) 3-4-1984  3) 3-4-1985  4) 3-6-1985  (2)

20. భూమధ్య రేఖ వద్ద భూమి వ్యాసం కి.మీ.లలో?

1) 12,576  2) 12,657  3) 12,756  4) 12,765   (3)

21. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో ద్రవ్యరాశిలో రెండో స్థానంలో ఉన్న గ్రహం, ఆత్మభ్రమణ కాలం అన్నింటి కంటే ఎక్కువ ఉన్న గ్రహం వరుసగా? 

1) బృహస్పతి, భూమి  2) బుధుడు, అంగారకుడు  3) శని, శుక్రుడు  4) నెప్ట్యూన్, యురేనస్  (3)

22. స్పేస్ ప్రోబ్‌కు ఉదాహరణ? 

1) పయనీర్  2) ఆర్యభట్ట  3) భాస్కర - 2  4) అట్లాంటిస్  (1)

23. ఏ గ్రహం మీద ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడిన వాతావరణం ఉంది? 

1) కుజుడు   2) బుధుడు  3) బృహస్పతి  4) యురేనస్    (1)    


No comments:

Post a Comment