నదీ వ్యవస్థ
1. "నర్మదా, చంబల్, సబర్మతి, కావేరి" లలో ప్రధాన నది కానిది ఏది? - (చంబల్)
2. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? - (నైలునది)
3. "నైలునది, సింధూ, అమెజాన్, డార్లింగ్" లలో పరస్థానీయ నది కానిది ఏది? - (అమెజాన్)
4. భారతదేశంలో అతి పొడవైన ఉపనది? - (యమున)
5. "నర్మదా, సువర్ణరేఖ, తపతి, శరావతి" లలో భిన్నంగా ఉండేది ఏది? - (సువర్ణరేఖ)
6. సింధూ నది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం? - (థాంచోక్)
7. "ఆస్కిని, ష్యోక్, గిల్లేట్, శతుద్రి" లలో సింధూనది పర్వత ప్రాంత ఉపనది ఏది? - (ష్యోక్, గిల్లేట్)
8. గంగానదిలో నివసించే డాల్ఫీన్స్ జాతి ఏది? - (సు - సు)
9. భారత్ - పాక్ సరిహద్దు ద్వారా ప్రవహించే నది? - (జీలం)
10. చీనాబ్ నది జన్మస్థానమైన "బారాలప్పా" ఏ పర్వత శ్రేణిలో ఉంది? - (జస్కర్)
11. "బియాస్, సట్లెజ్, రావి, జీలం" లలో ఏ నదిని 'ఐరావతి, పరూషిణి' అనే పేర్లతో పిలుస్తారు? - (రావి)
12. సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది? - (షిష్కిలా)
13. భారత్ లో మాత్రమే ప్రవహించే సింధూ ఉపనది? - (బియాస్)
14. మూడు దేశాలు (టిబెట్, పాక్, ఇండియా) ద్వారా ప్రవహించే సింధూ ఉపనది? - (శతుద్రి)
15. మానస సరోవర్ కు దగ్గరగా జన్మించిన నది ఏది? - (సింధూ)
16. భారతదేశంలోని ప్రధాన నదుల ద్వారా ప్రవహించే నీటిశాతం? - (85%)
17. వరద కాలువలు ఎక్కువగా కలిగిన నది? - (సట్లెజ్)
18. అతిపెద్ద అంతర్భుభాగ నది ఏది? - (ఘగ్గర్)
19. దేశంలో అత్యధిక ప్రాజెక్టులను కలిగిన నది ఏది? - (నర్మదా)
20. "దిబ్రుగఢ్" నగరం ఏ నది ఒడ్డున ఉంది? - (బ్రహ్మపుత్ర)
21. గంగానదికి గల మరొక పేరు? - (కర్మనాసా నది)
22. హిమాలయాల్లో పుట్టి గంగానదికి కుడివైపున కలిసే ఏకైక ఉపనది? - (యమునా)
23. భారతదేశం గుండా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతిపెద్ద నది? - (సింధూ)
24. బ్రహ్మపుత్రా నది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం? - (జిథోలా)
25. 1887 కంటే ముందు గంగానదికి ఉపనదిగా ఉండి ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా ప్రవహిస్తున్న నది? - (టీస్టా)
26. భారతదేశములో అత్యధికంగా అక్ భౌ (ఎద్దడుగు) సరస్సులను ఏర్పరిచే నది? - (బ్రహ్మపుత్ర)
27. ఎర్రనది అని ఏ నదిని పిలుస్తారు? - (బ్రహ్మపుత్ర)
28. "శరావతి, వరాహ, మాండవి, బ్రాహ్మిణి" నదుల్లో భిన్నంగా ఉండే నది ఏది? - (బ్రాహ్మిణి నది)
29. "అలకానంద, గోమతి, రావి, రామ్ గంగ" లలో పూర్వవర్తిత నది ఏది? - (అలకానంద)
30. నర్మదానది చెలికత్తె ఏది? - (తపతి)
31. "కావేరి, సోన్ నది, భీమ, కృష్ణా" నదులను వాటి జన్మ స్థానాల ఆధారంగా దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి? - (కావేరి, కృష్ణా, భీమ, సోన్ నది)
32. భారతదేశములో అతిపురాతన నది ఏది? - (గోదావరి)
33. భారతదేశములో అతి నవీన నది ఏది? - (గంగా)
34. విదీర్ణ ధరి గుండా ప్రవహించే నదులు? - (నర్మద, తపతి, దామోదర్)
35. ఐదున్నర దశాబ్దాల తర్వాత 2017 సెప్టెంబర్ 17 న పూర్తయి జాతికి అంకితం చేసిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? - (నర్మదా)
36. ప్రపంచంలో అతిపెద్ద అంతర్భుభాగ నది ఏది? - (ఓల్గా)
37. పుష్కర్ సరస్సు గుండా ప్రయాణించే నది? - (లూని)
38. కపిలాధార, సహస్రధార జలపాతాలు ఏ నదిపై ఉన్నాయి? - (నర్మదా)
39. జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? - (శరావతి)
40. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? - (దామోదర్)
41. గోమతినది ఒడ్డున ఉన్న భారతీయ నగరం? - (లక్నో)
42. ఇండియా నేపాల్ సరిహద్దుల ద్వారా ప్రవహించే నది? - (శారద)
43. క్షీప్రానది ఒడ్డున గల నగరం? - (ఉజ్జయినీ)
44. అలియా బెట్ దీవి ఏ నది ముఖద్వారం వద్ద ఉంది? - (నర్మదా)
45. బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న నదీ పరివాహక ప్రాంతం? - (దామోదర్)
46. సాగరమతి అని ఏ నదిని పిలుస్తారు? - (లూని)
No comments:
Post a Comment