ప్రత్యుత్పత్తి, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు
1. ఏనుగు గర్భావధి కాలం ఎంత?
ఎ) 330 రోజులు బి) 180 రోజులు సి) 600 రోజులు డి) 270 రోజులు (సి)
2. వీటిలో అతి తక్కువ గర్భావధి కాలం ఉన్న జంతువు ఏది?
ఎ) అపోజమ్ బి) పిల్లి సి) కుక్క డి) మేక (ఎ)
3. వీటిలో ఎక్కువ గర్భావధి కాలం ఉన్న జంతువు ఏది?
ఎ) అపోజమ్ బి) గేదె సి) మానవుడు డి) ఏనుగు (డి)
4. కింది వాటిలో ఉల్భ రహిత జీవి ఏది?
ఎ) క్షీరదం బి) పక్షి సి) చేప డి) పైవన్నీ (సి)
5. గుఱ్ఱం గర్భావధి కాలం ఎంత?
ఎ) 330 రోజులు బి) 600 రోజులు సి) 270 రోజులు డి) 150 రోజులు (ఎ)
6. కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవి ఏది?
ఎ) హైడ్రా బి) ఈస్ట్ సి) బ్యాక్టీరియా డి) హైడ్రా, ఈస్ట్ (డి)
7. ముక్కలవడం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవి ఏది?
ఎ) టినియా సోలియం బి) స్పైరో గైరా సి) బ్యాక్టీరియా డి) ఎ, బి (డి)
8. బ్యాక్టీరియా లో జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారు?
ఎ) ద్విధావిచ్చిత్తి బి) కోరకీభవనం సి) ముక్కలవడం డి) పైవన్నీ (ఎ)
9. రణపాల మొక్కలో శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ భాగం ద్వారా జరుగుతుంది?
ఎ) వేరు బి) 1కాండం సి) పత్రం డి) పైవన్నీ (సి)
10. పిల్లి గర్భావధి కాలం ఎంత?
ఎ) 30 రోజులు బి) 60 రోజులు సి) 21 రోజులు డి) 90 రోజులు (బి)
11. కింది వాటిలో కాండం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుకునే మొక్కలు ఏవి?
1. చెరకు 2. ఉల్లి 3. బంగాళదుంప
ఎ) 2,3 బి) 1,3 సి) 3 డి) 1, 2, 3 (డి)
12. కేంద్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) కటక్ బి) మనీలా సి) సిమ్లా డి) డబ్లిన్ (ఎ)
13. జాతీయ రసాయన ప్రయోగశాల ఎక్కడ ఉంది?
ఎ) పుణె బి) హైదరాబాద్ సి) మైసూర్ డి) న్యూఢిల్లీ (ఎ)
14. కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై బి) హైదరాబాద్ సి) మైసూర్ డి) కటక్ (సి)
15. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్ బి) మైసూర్ సి) న్యూఢిల్లీ డి) ముంబై (ఎ)
16. కుందేలు గర్భావధి కాలం ఎంత?
ఎ) 30 రోజులు బి) 60 రోజులు సి) 21 రోజులు డి) 90 రోజులు (ఎ)
17. ఏ అవయవం పని తీరుని తెలుసుకోవడానికి ECG పరీక్ష చేస్తారు?
ఎ) మెదడు బి) గుండె సి) కాలేయం డి) మూత్రపిండం (బి)
18. ఏ అవయవం పని తీరుని తెలుసుకోవడానికి EEG పరీక్ష చేస్తారు?
ఎ) మెదడు బి) గుండె సి) కాలేయం డి) మూత్రపిండం (ఎ)
19. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) చెన్నై సి) ముంబై డి) హైదరాబాద్ (డి)
20. తోలు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) ముంబై బి) కటక్ సి) చెన్నై డి) హైదరాబాద్ (సి)
21. కుక్క గర్భావధి కాలం ఎన్ని రోజులు?
ఎ) 21 బి) 28 సి) 60 డి) 30 (సి)
22. ఇక్రిశాట్ ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూర్ బి) చెన్నై సి) హైదరాబాద్ డి) ముంబై (సి)
23. జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) రాజమండ్రి బి) హైదరాబాద్ సి) మైసూర్ డి) సోలన్ (ఎ)
24. ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) సెప్టెంబర్ 16 బి) అక్టోబర్ 16 సి) మార్చి 22 డి) నవంబర్ 16 (బి)
25. ఒంటె గర్భావధి కాలం ఎన్ని రోజులు?
ఎ) 400 బి) 600 సి) 150 డి) 280 (ఎ)
26. మేక గర్భావధి కాలం ఎన్ని రోజులు?
ఎ) 150 బి) 60 సి) 330 డి) 280 (ఎ)
27. జాతీయ పాడి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) కర్నాల్ సి) మైసూర్ డి) సొలాన్ (బి)
28. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఏది?
ఎ) మార్చి 7 బి) మే 31 సి) అక్టోబర్ 16 డి) సెప్టెంబర్ 16 (డి)
29. ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది?
ఎ) జైపూర్ బి) డెహ్రాడూన్ సి) గోవా డి) న్యూఢిల్లీ (బి)
30. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు?
ఎ) కురియన్ బి) బోర్లాగ్ సి) స్వామినాథన్ డి) మెండల్ (ఎ)
31. శ్వేతవిప్లవ పితామహుడు ఎవరు?
ఎ) కురియన్ బి) స్వామినాథన్ సి) బోర్లాగ్ డి) అయ్యంగర్ (ఎ)
32. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన మొదటి జంతువు ఏది?
ఎ) ఒంటె పిల్ల బి) గొర్రె పిల్ల సి) పంది పిల్ల డి) ఎలుక పిల్ల (బి)
33. ట్రైకాలజీ అంటే దేని అధ్యయనం?
ఎ) చర్మం బి) చెవి సి) వెంట్రుకలు డి)ముక్కు (సి)
34. ఏ అవయవం గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటారు?
ఎ) కన్ను బి) ముక్కు సి) చెవి డి) చర్మం (బి)
35. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) మనీలా బి) ఢాకా సి) న్యూఢిల్లీ డి) భూటాన్ (ఎ)
36. వృద్దాప్య వ్యాధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) యూజెనిక్స్ బి) యూఫెనిక్స్ సి) జెరంటాలజీ డి) ఓడంటాలజీ (సి)
37. మూత్రపిండాల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) ఫ్లూరాలజీ బి) న్యూరాలజీ సి) నెఫ్రాలజీ డి) రైనాలజీ (సి)
38. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
ఎ) లక్నో బి) కలకత్తా సి) హైదరాబాద్ డి) పుణె (సి)
39. కిందివారిలో జీవ పరిణామ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) మెండల్ బి) డార్విన్ సి) రీటర్ డి) అరిస్టాటిల్ (బి)
40. మానవుని రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
ఎ) విలియం హార్వే బి) కార్ల్ అండ్ స్పినర్ సి) మాల్ఫీజీ డి) విలియం కాఫ్ (ఎ)
41.ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు?
ఎ) రాబర్ట్ కోచ్ బి) ఎడ్వర్డ్ జెన్నర్ సి) విలియం హార్వే డి) జాన్ ఫిలిప్స్ (బి)
42. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
ఎ) రాబర్ట్ హుక్ బి) నల్ సి) జాన్సన్ డి) నల్, రస్కా (డి)
43. వైద్య శాస్త్ర పితామహుడు ఎవరు?
ఎ) ఎడ్వర్డ్ జెన్నర్ బి) హిప్పోక్రటిస్ సి) అరిస్టాటిల్ డి) లావోయిజర్ (బి)
44. కిణ్వనం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
ఎ) జైమాలజీ బి) ఎండోక్రైనాలజీ సి) లిమ్నాలజీ డి) కైనాటాలజీ (ఎ)
45. జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) నాగపూర్ బి) లక్నో సి) హైదరాబాద్ డి) చెన్నై (సి)
46. రేబిస్ కు వేక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
ఎ) అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బి) లూయిస్ పాశ్చర్ సి) ఎడ్వర్డ్ జెన్నర్ డి) రాబర్ట్ కోచ్ (బి)
47. నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది?
ఎ) దుర్గాపూర్ బి) నాగ్ పూర్ సి) డెహ్రాడూన్ డి) కొలకత్తా (బి)
48. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది?
ఎ) పుణె బి) లక్నో సి) చెన్నై డి) కొచ్చి (ఎ)
49. కృత్రిమ జన్యువును తయారుచేసిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) మెండల్ బి) వాట్సన్ సి) హరగోవింద్ ఖొరానా డి) క్రిక్ (సి)
50. కింది వారిలో ఎవరు మలేరియా వ్యాధిపై పరోశోధనలు చేశారు?
ఎ) లూయిస్ పాశ్చర్ బి) సాక్ సి) రోనాల్డ్ రాస్ డి) మీనన్ (సి)
51. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఎక్కడ ఉంది?
ఎ) కొలకత్తా బి) లక్నో సి) హైదరాబాద్ డి) న్యూఢిల్లీ (ఎ)
52. కింది వాటిలో ఏ జీవి అలైంగిక విధానం ద్వారా ఏర్పడుతుంది?
ఎ) ఆడ తేనెటీగ బి) మగ తేనెటీగ సి) వానపాము డి) కప్ప (బి)
53.కణజాలం గురించిన అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) హిస్టాలజీ బి) సెల్ బయాలజీ సి) న్యూరాలజీ డి) ఎంబ్రియాలజీ (ఎ)
No comments:
Post a Comment