Social Icons

Pages

Showing posts with label biology. Show all posts
Showing posts with label biology. Show all posts

Saturday, November 13, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - శక్తిమయ ప్రపంచం

 పోటీ పరీక్షల ప్రత్యేకం - శక్తిమయ ప్రపంచం

1. శక్తిని ఉత్పత్తి చేసే క్రియ ? 

జ. కిరణ జన్య సంయోగ క్రియ 

2. శక్తిని వినియోగించుకునే క్రియ?

 జ. శ్వాసక్రియ

 3. కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియలను కలిపి ఏమంటారు? 

జ. శక్తి ఉత్పాదక క్రియ

 4. వినియోగ క్రియలకు ఉదాహరణ ?

 జ. పెరుగుదల, విసర్జన క్రియ, చలనం, ప్రసరణ క్రియలు 

5. జీవుల్లో శక్తి ఉత్పాదక క్రియలు ఏ సంఖ్యలో ఉంటాయి?

 జ. తక్కువ సంఖ్యలో 

6. ఎక్కువ సంఖ్యలో ఉండే జీవక్రియలు ? 

జ. వినియోగ క్రియలు 

7. ఓ వ్యవస్థలో పనిచేయ గలిగే సామర్థ్యాన్ని ఏమంటారు ?

జ.శక్తి

8. సజీవ వ్యవస్థకు ఉదాహరణలు ?

 జ. కణం, కణజాలం , అంగం, జీవి, ఆవరణ వ్యవస్థ 

9. యాంత్రిక శక్తిని వినియోగించుకునే వ్యవస్థ ? 

జ. నిర్జీవ వ్యవస్థ 

10. హీటరులో విద్యుత్ శక్తి దేనిగా మరుతుంది ?

జ. ఉష్ణశక్తి 

11. కణాలకు అవసరమైన శక్తి దేని నుంచి లభిస్తుంది ? 

జ. ఏటీపీ నుంచి

12. నాడీ ప్రచోదన ప్రసారానికి అవసరమయ్యే శక్తి ?

 జ. విద్యుత్ శక్తి

 13. 1 కేలరీ= ?

 జ. 4.2ఔల్స్

 14. వికిరణ శక్తికి మరో పేరు ?

 జ. కాంతి శక్తి 

15. కాంతి ఏ రూపంలో ఉంటుంది? 

జ. విద్యుదయస్కాంత వికిరణం 

16. విద్యుదయస్కాంత వికిరణంలో ఉండే కాంతి శక్తిని ఏమంటారు ? 

జ. క్వాంటం 

17. మిణుగురు పురుగులు కాంతిని వెలువరచడానికి ఏ శక్తి ఉపయోగపడుతుంది ? 

జ. వికిరణ శక్తి 

18. వివిధ రసాయన పదార్థాల్లో పరమాణువుల మధ్య బంధించి నిలువ ఉండే శక్తి ? 

జ. రసాయన శక్తి 

19. మన శరీరాన్ని వేడిగా ఉంచే శక్తి ? 

జ. ఉష్ణ శక్తి

 20. జీవరసాయన చర్యలు, శరీర ధర్మక్రియలు జరపడంలో సహాయపడే శక్తి ?

జ. ఉష్ణశక్తి 

21. చలికి కండరాలు వణికినపుడు ఏ శక్తి జనిస్తుంది? 

జ. ఉష్ణశక్తి

 22. ఆవేశం చెందిన రేణువులు ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చలించడం ద్వారా ఏ శక్తి ఉత్పత్తి అవుతుంది?

జ. విద్యుత్ శక్తి

 23. నాడీ ప్రచోదనాల్లో ఉత్పత్తి అయ్యే శక్తి ?

 జ. విద్యుత్ శక్తి

24. కొన్ని చేపలు ఇతర జీవులను ఎదుర్కొనేందుకు ఉత్పత్తిచేసే విద్యుత్ స్థితిజాలు ఎన్ని ఓల్టుల విద్యుత్ ఘాతాన్ని కలిగిస్తాయి?

 జ. 500 ఓల్టులు

 25. శరీరంలో ముఖ్యమైన శక్తి జనకాలు ? 

జ. కొవ్వులు, పిండిపదార్థాలు 

26. జీవ వ్యవస్థల్లో శక్తి రూపాంతరీకరణ ఏ సూత్రాల ఆధారంగా జరుగుతుంది ?

 జ. ఉష్ణగతిక సూత్రాలు 

27. 1 గ్రాము పిండి పదార్థాల నుంచి విడుదలయ్యే శక్తి ? 

జ. 4 కిలో కాలరీలు 

28. 1 గ్రాము కొవ్వు పదార్థాల నుంచి విడుదలయ్యే శక్తి ? 

జ. 9.45 కిలో కాలరీలు

 29. కణం, శరీరంలో రసాయన పదార్థాలు ఏర్పడుట, వాటి విచ్ఛిన్నం గురించి తెలిపే క్రియ?

 జ. జీవక్రియ

 30. జీవుల్లో ఓ రసాయన పదార్థ సంశ్లేషణను ఏమంటారు? 

జ. జీవ నిర్మాణ క్రియ

 31. రసాయన పదార్థ విచ్ఛిన్నతను ఏమంటారు? 

జ. విచ్చిన్న క్రియ

 32. ఓ యౌగిక జీవనిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియల్లో జరిగే చర్యలన్నింటిని ఏమంటారు ?

 జ. జీవ క్రియా పథం

 33. ఆహారంలో ఉండే రసాయన పదార్థాల విచ్చిన్నత ఏ జీవ క్రియా పథంలో జరుగుతుంది ? 

జ. విచ్ఛిన్న జీవక్రియ

 34. మొక్కల్లో పదార్థాలు అధిక సాంద్రతనుంచి తక్కువ సాంద్రతకు శక్తి వినియోగం కాకుండానే ప్రవహిస్తాయి. దీనిలో శక్తి అవసరం ఉండదు. కాబట్టి దీనిని ఏమంటారు ? 

జ. నిష్క్రియా రవాణా

35. మొక్కల్లో శక్తిని వినియోగించుకొని తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోనికి పదార్థాలు గాఢత ప్రవణతకు వ్యతిరేకంగా రవాణా చెందడాన్ని ఏమంటారు ?

 జ. సక్రియా రవాణా 

36. వర్షం నీరు పై నుంచి కిందకి పడడం ఏ రవాణా? 

జ. నిష్క్రియా రవాణా

 37. కింది నుంచి పైపుల ద్వారా నీటిని మేడపై ట్యాంకులోకి పంపడం ఏ రవాణా ? 

జ. సక్రియా రవాణా 

38. నాడీకణం లోపల, బయట ఉండే ఏ అయాన్ల గాఢతల్లో తేడా వల్ల విద్యుత్ స్థితిజాలు ఏర్పడుతాయి? 

జ. సోడియం, పొటాషియం అయాన్లు 

39. జీవ క్రియా పథంలో ఓ యౌగికం ప్రామాణిక కాలంలో ఎంత మొత్తం ఉపయోగించుకుంటుందో ఆ ఉత్పత్తుల రేటును ఏమంటారు? 

జ. జీవక్రియా రేటు

 40. ఓ జంతువు ఆధార జీవక్రియా రేటు వేటిపై ఆధారపడి ఉంటుంది?

 జ. పరిసరాలు, శరీర ఉష్ణోగ్రత, శరీరంలోని హార్మోన్ స్థితి

 41. ఓ జీవి మామూలు ఉష్ణోగ్రతలో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉండే జీవక్రియారేటును ఏమంటారు ? 

జ. ఆధార జీవక్రియా రేటు (BMR) 

42. ఆధార జీవక్రియా రేటును ఎప్పుడు నిర్ణయిస్తారు ? దేనితో కొలుస్తారు ? 

జ. 1 రాత్రి ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత, స్పైరో మీటరుతో కొలుస్తారు. 

43. ఆధార జీవక్రియారేటు ఎప్పుడు, ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? 

జ. చిన్నవారిలో, వ్యాయామం చేస్తున్నప్పుడు, భోజనం చేసిన వెంటనే, రక్తంలో అవటు గ్రంథి హార్మోను ఎక్కువగా ఉన్నప్పుడు, పరిసరాల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు 

44. ఆధార జీవక్రియా రేటు ఎప్పుడు ఎవరిలో తక్కువగా ఉంటుంది ? 

జ. ఆడవారిలో, నిద్రపోతున్నవారిలో , ఎక్కువ కాలం ఆహారం తీసుకోని వారిలో, రక్తంలో అవటు గ్రంథి స్రావం తక్కువగా ఉన్నప్పుడు, పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు

45. పెద్ద క్షీరదాల కంటే చిన్న క్షీరదాల్లో BMR ఎలా ఉంటుంది ?

 జ. ఎక్కువగా

 46. భూమి మీద పడే కాంతిలో మొక్కలు ఎంత శాతం కాంతిని వినియోగించుకుంటాయి? 

జ. 1.5శాతం

 47. సౌర శక్తిని ఉపయోగించి, ఆవరణ వ్యవస్థలో మొక్కలు కర్బన లేదా సేంద్రియ పదార్థాన్ని ఉత్పత్తి చేయడాన్నేమంటారు? 

జ. ప్రాథమిక ఉత్పాదకత

 48. శాకాహారులు మొక్కలను తిన్నప్పుడు వాటిలోని కొంత శక్తి వ్యర్థం కాగా, జంతువు ఉపయోగించుకో గలిగే ఉత్పాదకతనేమంటారు ? 

జ. శాకాహార ఉత్పాదకత లేదా ద్వితీయ ఉత్పాదకత

 49. ఆహారపు గొలుసు ప్రతి స్థాయిలో ఉండే శక్తి పరిమాణాన్ని ఏమంటారు?

 జ. పోషక స్థాయి

 50. ప్రతి పోషకస్థాయిలోని శక్తి స్థాయి మార్పులను పిరమిడ్ రూపంలో చిత్రించడాన్నేమంటారు ?

 జ. శక్తి పిరమిడ్ 

51. ఆవరణ వ్యవస్థలో ఓ నిర్ణీత ప్రమాణ కాలంలో ఎంత పరిమాణం ఆరిన లేదా పొడి ద్రవ్యరాశి ఏర్పడుతుందో దాన్ని ఏమంటారు?

 జ. జీవ ద్రవ్యరాశి

 52. మన దేశంలో ఏడాదికి ఎన్ని హెక్టార్ల అటవీ భూమిని నష్టపోతున్నాం?

 జ. 1.3 మిలియన్ హెక్టారులు 

53. అడవి భూముల నుంచి, ప్రస్తుతం ఉన్న వనరుల నుంచి అధిక శక్తిని ఇచ్చే మొక్కలను అన్వేషించి వాటి నుంచి ఇంధనాలు తయారు చేస్తున్నారు. వాటినేమంటారు ? 

జ. శిలాజ ఇంధనాలు 

54. వంటచెరుకు, కొన్ని జంతువుల విసర్జితాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మెక్కలు, జంతువులు ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాలనేమంటారు? 

జ. జీవ ద్రవ్యరాశులు

55. ఎంత శాతం జనాభాకు వంట చెరుకు ప్రధాన ఆధారం?

 జ. 58 శాతం

56. ఓ ఇంటికి రోజుకు ఉపయోగపడే వంట చెరకు ?

జ. సుమారు 3 కిలోలు 

57. వంట చెరకు పొగ శుక్లాలు లేదా కంటిపొర, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమని తెలిపిన సంస్థ ?

 జ. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 

58. దహన సంస్కారాలకు ఏడాదికి ఎంత వంట చెరకు అవసరమవుతుంది ? 

జ. 30,000 మెట్రిక్ టన్నులు 

59. 30-40 మిలియన్ల వ్యవసాయేతర భూమిలో వంటచెరకును ఇచ్చే చెట్లను పెంచే అవకాశం ఉంది.ఆ నేలలను ఏమంటారు? 

జ. వంట చెరకు సాగు నేలలు 

60. వంట చెరకు సాగు నేలల్లో పెంచే మొక్కలు ? 

జ. లూసినా (సుబాబుల్), యూకలిప్టస్ (నీలగిరి), కేజురైనా(సరివి), అవిసీనియా

 61. ప్రజల కోసం, ప్రజల చేత పెంచబడే అడవులనేమంటారు ? 

జ. సామూహిక అడవులు

 62. నిరుపయోగంగా ఉండే సామాజిక ప్రాంతాల్లో పెంచే చెట్లను ఏమంటారు? 

జ. సామూహిక అడవులు

 63. తరతరాలుగా ఉపయోగిస్తున్న ఇంధనాలు కాకుండా ఉపయోగించే కొత్తరకం ఇంధనాలను ఏమంటారు?

జ. సాంప్రదాయేతర ఇంధనాలు

64. సాంప్రదాయేతర ఇంధన వనరులకు ఉదాహరణ ? 

జ. కలుపు మొక్కలు, సముద్ర వ్యర్థాలు, బయోగ్యాస్ 

65. బీడు, పొలాల్లో పెరిగే పనికిరాని మొక్కలనేమంటారు? 

జ. కలుపు మొక్కలు

66. కలుపు మొక్కల వల్ల లాభామేంటి ?

 జ. సేంద్రియ ఎరువులు, బయోగ్యాలు తయారు చేయవచ్చు. 

67. పేడను పిడకలుగా చేసి ఎండబెట్టి వాడినప్పుడు ఓ గ్రాము పేడ ఎన్ని కిలో కాలరీల శక్తినిస్తుంది ?

 జ. 3000 కిలో కాలరీలు 

68. గ్రామీణ ప్రాంతాల్లో మండే పొయ్యిలు వినియోగించుకునే ఇంధన శాతం?

 జ. 10 %

 69. పశువుల పేడ ద్వారా ఏ గ్యాస్ తయారు చేయవచ్చు ?

 జ. బయోగ్యాస్

 70. జీవ వ్యర్థ పదార్థాల నుంచి విడుదయ్యే ఇంధన వాయువు ? 

జ. బయోగ్యాస్ 

71. బయోగ్యాలో ఉండే మీథేన్ శాతం? 

జ. 50-70 శాతం 

72. 1 కిలో ఎండిన పశువుల పేడ తయారీకి కావాల్సిన పేడ నుంచి ఎంత బయోగ్యాసు ఉత్పత్తి చేయవచ్చు?

 జ. 200 CC

 73. 200 సీసీ ఎన్ని కిలో కాలరీల శక్తికి సమానం? 

జ. 900 కిలో కాలరీలు 

74. మన దేశంలో ఏటా ఎంత చెత్త లభిస్తుంది ? 

జ. 2000-3000 మెట్రిక్ టన్నులు 

75.బయోగ్యాస్ తయారీ ఎన్ని దశల్లో జరుగుతుంది ? 

జ. 3 దశలు 

76. హైడ్రో కార్బన్ లను సంచయనం చేసే శైవలాలకు చెందిన మొక్క ? 

జ. బొట్రియోకోకస్ బ్రాన్ 

77. పెట్రోలియం సంబంధిత పదార్థాలు ఉన్న మొక్క ? 

జ. కెలోట్రోపిస్ డ్రాసిర

78. చెరకును గడలుగా ఖండించిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాన్నేమంటారు? 

జ. బగాసే(Bagasse) 

79. చెరకు పరిశ్రమలోని వ్యర్థాన్ని ఏమంటారు? 

జ. మొలాసిస్

 80. మొలాసిస్ ద్వారా దీన్ని తయారు చేయవచ్చు ? 

జ. ఆల్కహాల్ 

81. గేసోహాల్ వేటి సమ్మేళనం? 

జ. ఆల్కహాల్ + గేసోలిన్ 

82. పెట్రోల్ రసాయనిక నామం?

 జ. గేసోలిన్

 88. కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఇవ్వగలిగే శక్తి నిష్పత్తి ?

 జ. 4 : 9.5 

84. సముద్రంలో ఉండే గోధుమ రంగు శైవలాలు ?

 జ. కెల్ఫ్స్ 

బయోగ్యాస్ ఉత్పత్తిలో వాడే శైవలాలు ? 

జ. గోధుమ రంగు శైవలాలు 

 86. ఓ నిర్ణీత ప్రమాణ కాలంలో ఉత్పత్తి అయ్యే పొడి ఆహారాన్నేమంటారు ?

 జ. జీవ ద్రవ్యరాశి

 87. వంట చెరుకు సాగుకు ఉపయోగపడే బురద నేలల మొక్క? 

జ. అవిసీనియా

Sunday, November 15, 2020

Study Material: Reproduction, Research institutes and scientists

 ప్రత్యుత్పత్తి, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు 

1. ఏనుగు గర్భావధి కాలం ఎంత?

ఎ) 330 రోజులు    బి) 180 రోజులు     సి) 600 రోజులు      డి) 270 రోజులు         (సి)

2. వీటిలో అతి తక్కువ గర్భావధి కాలం ఉన్న జంతువు ఏది?

ఎ) అపోజమ్     బి) పిల్లి      సి) కుక్క       డి) మేక          (ఎ)

3. వీటిలో ఎక్కువ  గర్భావధి కాలం ఉన్న జంతువు ఏది?

ఎ) అపోజమ్    బి) గేదె      సి) మానవుడు       డి) ఏనుగు          (డి)

4. కింది వాటిలో ఉల్భ రహిత జీవి ఏది?

ఎ) క్షీరదం    బి) పక్షి      సి) చేప       డి) పైవన్నీ          (సి)

5. గుఱ్ఱం  గర్భావధి కాలం ఎంత?

ఎ) 330 రోజులు    బి) 600 రోజులు     సి) 270 రోజులు      డి) 150 రోజులు         (ఎ)

6. కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవి ఏది?

ఎ) హైడ్రా     బి) ఈస్ట్      సి) బ్యాక్టీరియా       డి) హైడ్రా, ఈస్ట్           (డి)

7. ముక్కలవడం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవి ఏది?

ఎ) టినియా సోలియం     బి) స్పైరో గైరా      సి) బ్యాక్టీరియా      డి) ఎ, బి          (డి)

8. బ్యాక్టీరియా లో జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారు?

ఎ) ద్విధావిచ్చిత్తి     బి) కోరకీభవనం      సి) ముక్కలవడం      డి) పైవన్నీ          (ఎ)

9. రణపాల మొక్కలో శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ భాగం ద్వారా జరుగుతుంది?

ఎ) వేరు     బి) 1కాండం      సి) పత్రం       డి) పైవన్నీ         (సి)

10. పిల్లి  గర్భావధి కాలం ఎంత?

ఎ) 30 రోజులు    బి) 60 రోజులు     సి) 21 రోజులు      డి) 90 రోజులు         (బి) 

11. కింది వాటిలో కాండం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుకునే మొక్కలు ఏవి?

1. చెరకు                    2. ఉల్లి                    3. బంగాళదుంప 

ఎ) 2,3    బి) 1,3     సి) 3      డి) 1, 2, 3         (డి)

12. కేంద్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

ఎ) కటక్     బి) మనీలా      సి) సిమ్లా       డి) డబ్లిన్          (ఎ)

13. జాతీయ రసాయన ప్రయోగశాల ఎక్కడ ఉంది?

ఎ) పుణె     బి) హైదరాబాద్      సి) మైసూర్       డి) న్యూఢిల్లీ          (ఎ)

14. కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

ఎ) చెన్నై     బి) హైదరాబాద్     సి) మైసూర్      డి) కటక్         (సి)

15. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?

ఎ) హైదరాబాద్    బి) మైసూర్      సి) న్యూఢిల్లీ       డి) ముంబై          (ఎ)

16. కుందేలు  గర్భావధి కాలం ఎంత?

ఎ) 30 రోజులు    బి) 60 రోజులు     సి) 21 రోజులు      డి) 90 రోజులు         (ఎ)

17. ఏ అవయవం పని తీరుని తెలుసుకోవడానికి ECG పరీక్ష చేస్తారు?

ఎ) మెదడు     బి) గుండె      సి) కాలేయం       డి) మూత్రపిండం          (బి)

18. ఏ అవయవం పని తీరుని తెలుసుకోవడానికి EEG పరీక్ష చేస్తారు?

ఎ) మెదడు    బి) గుండె     సి) కాలేయం       డి) మూత్రపిండం         (ఎ)

19. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది?

ఎ) న్యూఢిల్లీ    బి) చెన్నై     సి) ముంబై      డి) హైదరాబాద్         (డి)

20. తోలు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

ఎ) ముంబై    బి) కటక్     సి) చెన్నై        డి) హైదరాబాద్          (సి)

21. కుక్క  గర్భావధి కాలం ఎన్ని రోజులు?

ఎ) 21    బి) 28     సి) 60      డి) 30         (సి)

22. ఇక్రిశాట్ ఎక్కడ ఉంది?

ఎ) బెంగళూర్     బి) చెన్నై     సి) హైదరాబాద్      డి) ముంబై         (సి)

23. జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

ఎ) రాజమండ్రి     బి) హైదరాబాద్     సి) మైసూర్       డి) సోలన్          (ఎ)

24. ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

ఎ) సెప్టెంబర్ 16    బి) అక్టోబర్ 16     సి) మార్చి 22      డి) నవంబర్ 16         (బి)

25. ఒంటె  గర్భావధి కాలం ఎన్ని రోజులు?

ఎ) 400    బి) 600     సి) 150   డి) 280         (ఎ)

26. మేక  గర్భావధి కాలం ఎన్ని రోజులు?

ఎ) 150    బి) 60     సి) 330      డి) 280         (ఎ)

27. జాతీయ పాడి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

ఎ) న్యూఢిల్లీ    బి) కర్నాల్      సి) మైసూర్      డి) సొలాన్          (బి)

28. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఏది?

ఎ) మార్చి 7     బి) మే 31     సి) అక్టోబర్ 16        డి) సెప్టెంబర్ 16         (డి)

29. ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది?

ఎ) జైపూర్     బి) డెహ్రాడూన్      సి) గోవా       డి) న్యూఢిల్లీ         (బి)

30. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు?

ఎ) కురియన్     బి) బోర్లాగ్      సి) స్వామినాథన్       డి) మెండల్          (ఎ)

31. శ్వేతవిప్లవ పితామహుడు ఎవరు?

ఎ) కురియన్    బి) స్వామినాథన్     సి) బోర్లాగ్       డి) అయ్యంగర్          (ఎ)

32. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన మొదటి జంతువు ఏది?

ఎ) ఒంటె పిల్ల     బి) గొర్రె పిల్ల      సి) పంది పిల్ల       డి) ఎలుక పిల్ల          (బి)

33. ట్రైకాలజీ అంటే దేని అధ్యయనం?

ఎ) చర్మం     బి) చెవి      సి) వెంట్రుకలు       డి)ముక్కు          (సి)

34. ఏ అవయవం గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటారు?

ఎ) కన్ను     బి) ముక్కు      సి) చెవి       డి) చర్మం         (బి)

35. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

ఎ) మనీలా     బి) ఢాకా      సి) న్యూఢిల్లీ      డి) భూటాన్          (ఎ)

36. వృద్దాప్య వ్యాధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

ఎ) యూజెనిక్స్     బి) యూఫెనిక్స్      సి) జెరంటాలజీ       డి) ఓడంటాలజీ          (సి)

37. మూత్రపిండాల అధ్యయనాన్ని ఏమంటారు?

ఎ) ఫ్లూరాలజీ     బి) న్యూరాలజీ      సి) నెఫ్రాలజీ       డి) రైనాలజీ         (సి)

38. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?

ఎ) లక్నో     బి) కలకత్తా      సి) హైదరాబాద్       డి) పుణె          (సి)

39. కిందివారిలో జీవ పరిణామ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు?

ఎ) మెండల్     బి) డార్విన్      సి) రీటర్       డి) అరిస్టాటిల్          (బి)

40. మానవుని రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

ఎ) విలియం హార్వే     బి) కార్ల్ అండ్ స్పినర్      సి) మాల్ఫీజీ       డి) విలియం కాఫ్         (ఎ)

41.ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు?

ఎ) రాబర్ట్ కోచ్     బి) ఎడ్వర్డ్ జెన్నర్      సి) విలియం హార్వే      డి) జాన్ ఫిలిప్స్          (బి)

42. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

ఎ) రాబర్ట్ హుక్     బి) నల్      సి) జాన్సన్       డి) నల్, రస్కా          (డి)

43. వైద్య శాస్త్ర పితామహుడు ఎవరు?

ఎ) ఎడ్వర్డ్ జెన్నర్    బి) హిప్పోక్రటిస్      సి) అరిస్టాటిల్      డి) లావోయిజర్          (బి)

44. కిణ్వనం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?

ఎ) జైమాలజీ     బి) ఎండోక్రైనాలజీ      సి) లిమ్నాలజీ      డి) కైనాటాలజీ          (ఎ)

45. జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

ఎ) నాగపూర్     బి) లక్నో      సి) హైదరాబాద్     డి) చెన్నై          (సి)

46. రేబిస్ కు వేక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

ఎ) అలెగ్జాండర్ ఫ్లెమింగ్     బి) లూయిస్ పాశ్చర్      సి) ఎడ్వర్డ్ జెన్నర్      డి) రాబర్ట్ కోచ్         (బి)

47. నేషనల్ ఎన్విరాన్ మెంటల్  ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది?

ఎ) దుర్గాపూర్     బి) నాగ్ పూర్      సి) డెహ్రాడూన్      డి) కొలకత్తా          (బి)

48. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది?

ఎ) పుణె    బి) లక్నో      సి) చెన్నై       డి) కొచ్చి          (ఎ)

49. కృత్రిమ జన్యువును తయారుచేసిన శాస్త్రవేత్త ఎవరు?

ఎ) మెండల్     బి) వాట్సన్     సి) హరగోవింద్ ఖొరానా       డి) క్రిక్          (సి)

50. కింది వారిలో ఎవరు మలేరియా వ్యాధిపై పరోశోధనలు చేశారు?

ఎ) లూయిస్ పాశ్చర్    బి) సాక్      సి) రోనాల్డ్ రాస్       డి) మీనన్          (సి)

51. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఎక్కడ ఉంది?

ఎ) కొలకత్తా     బి) లక్నో     సి) హైదరాబాద్       డి) న్యూఢిల్లీ          (ఎ)

52. కింది వాటిలో ఏ జీవి అలైంగిక విధానం ద్వారా ఏర్పడుతుంది?

ఎ) ఆడ తేనెటీగ     బి) మగ తేనెటీగ     సి) వానపాము       డి) కప్ప          (బి)

53.కణజాలం గురించిన అధ్యయనాన్ని ఏమంటారు?

ఎ) హిస్టాలజీ     బి) సెల్ బయాలజీ      సి) న్యూరాలజీ       డి) ఎంబ్రియాలజీ          (ఎ) 

Saturday, August 19, 2017

General Knowledge - Biology # 2

బయాలజీ  - 2 వ భాగం 
1. తేలు జంతు రాజ్యంలోని ఏ వర్గానికి చెందుతుంది? - (ఆర్థోపొడా)

2. ఈల్ అనేది ఒక . ? (చేప)

3. కర్పరాన్ని కలిగి ఉన్న ప్రోటోజోవన్? - (ఎల్ఫీడియం)

4. గాజుపాము, బ్లైండ్ స్నేక్, సముద్ర సర్పం, ట్రీ స్నేక్ లలో నిజమైన సర్పం కానిది ఏది? - (గాజుపాము)

5. వ్యాపనం ద్వారా శ్వాసక్రియను జరుపుకునే జంతువు? - (అమీబా, వానపాము)

6. నత్త, డేవిల్ ఫిష్, జలగ వాటిలో కర్పరం  లేని మొలస్కా వర్గపు జీవి? - (డేవిల్ ఫిష్)

7. పురుషుల్లో ఉండే ప్రోస్టేట్ గ్రంథి బరువు సుమారుగా? - (20 గ్రాములు)

8. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువు కనీసం ఎన్ని కిలోగ్రాముల బరువు ఉండాలి? - (3. 3)

9. 'బ్లూ బేబీ సిండ్రోమ్' ఉన్న శిశువులో ఏ అవయవంలో లోపాలు ఉంటాయి? - (గుండె)

10. 'డౌన్స్ సిండ్రోమ్' ఉన్న మానవునిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? - (47)

11. 'కానిబాల్స్' అంటే? -(తమ వంటి జీవులను తినే జంతువులు)

12. డుడాంగ్, డాల్పిన్, తిమింగలం వీటిలో జలచర క్షీరదం? -(డుడాంగ్, డాల్పిన్, తిమింగలం)

13. వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ ? -(కెరాటిన్)

14. జ్ఞానదంతం, రెటీనా, ఫ్లీహం, క్లోమం వాటిలో అవశేష అవయవం? - (జ్ఞానదంతం)

15. 'ముస్కులర్ డిస్ట్రోఫి' దేనికి సంబంధించిన వ్యాధి? - (కండరాలు)

16. చేప ప్రధాన విసర్జక పదార్ధం? - (అమ్మోనియా)

17. కుల్యా వ్యవస్థను కలిగి ఉండటం ఏ జంతువు లక్షణం? - (స్పంజిక)

18. కప్ప, పాము, ఏనుగు, చేప లలో ఏక రక్త ప్రసరణ కలది? - (చేప)

19. చేప గుండెలో ఉండే కర్ణికల సంఖ్య? - (1)

20. చేప, కప్ప, మొసలి వీటిలో గుండెలో మిశ్రమ రక్తం కల జీవి ? - (కప్ప)

21. ఉష్ణ రక్త జీవులు, బంధిత రక్తప్రసరణ, బ్రాంఖియల్ హృదయం, బాహ్య ఫలదీకరణ వీటిలో చేపల లక్షణం కానిది? - (ఉష్ణ రక్త జీవులు)

22. మలంతో పాటు చీము, రక్తం రావడం ఏ వ్యాధి లక్షణం? - (అమీబిక్ డిసెంట్రీ)

23. 'ఎంటరిక్ ఫీవర్' అని ఏ వ్యాధిని పిలుస్తారు? - (టైఫాయిడ్)

24. ఏ రకానికి చెందిన ట్యూమర్ ను శస్త్ర చికిత్స ద్వారా తొలిగించవచ్చు? - (బినైన్)

25. అధిక బరువును కలిగి ఉన్న మానవుని బాడీమాస్ ఇండెక్స్ ఎంత? - (25 నుంచి 29. 9)

26. కీలు చుట్టూ ఉండే ద్రవాన్ని ఏమంటారు? - (సైనోవియల్)

27. చేతి వేలితో ఒక వ్యక్తి కాలు పై నొక్కినప్పుడు గుంతలు ఏర్పడితే అతడు ఏ వ్యాధితో బాధపడుతున్నట్టు? - (ఎడిమా)

28. టార్పిడో, ఎక్సోసిటస్, డాల్ఫిన్, డెవిల్ ఫిష్ లలో ఎగిరే చేప ఏది? - (ఎక్సోసిటస్)

29. పుట్టిన పిల్లల్లో శ్వాసక్రియ రేటు? - (32)

30. మానవుని శరీరంలో యూరియా సంశ్లేషణ జరిగే ప్రదేశం? - (కాలేయం)

31. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే వినాళ గ్రంథి? - (అవటు)

32. టిబియా అనే ఎముక ఏ భాగంలో ఉంటుంది?- (కాలు)

33. 'వెరికోస్' అనేది దేనికి సంబంధించిన వ్యాధి?- (సిరలు)

34. చిన్నపిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచే కొవ్వు ఏది ? - (బ్రౌన్ ఫ్యాట్)

35. పాలలో ఉండే ప్రోటీన్ ఏది? - (కెసిన్)

36. మానవుని రక్త వర్గాలకు సంబంధించి ఎన్ని జన్యు రూపాలు ఉంటాయి? - (6)

37. 'పెప్సిన్' అనేది ఒక -? - (ఎంజైమ్)

38. కణం ప్రొటీన్ల కర్మాగారం అని దేన్ని పిలుస్తారు? - (రైబోజోమ్)

39. ఎగిరే క్షీరదం అని దేన్ని పిలుస్తారు? - (గబ్బిలం)

40. పాలలో లభించని పోషక పదార్ధం? - (ఇనుము)

41. హెర్పిస్ అనే వ్యాధిని కలుగజేసేది? -(వైరస్)

42. వైడాల్ : టైఫాయిడ్ ::బయాప్సి : - ? - (క్యాన్సర్)

43. ఉసరిలో పుష్కలంగా లభించే విటమిన్? - (విటమిన్ - సి)

44. మూత్రంలో విసర్జితమయ్యే విటమిన్? - (విటమిన్ - సి)

45. బటన్, మిల్కి, పాడిస్ట్రా అనేవి? - (పుట్టగొడుగు రకాలు)

46. వానపాము, బొద్దింక, కప్ప లలో రక్త నాళాలు లేని జంతువు? - (బొద్దింక)

47. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? - (సెరికల్చర్)

Tuesday, July 4, 2017

General Knowledge MCQ GK Questions & Answers in Biology

1. రఫ్లేషియా మొక్క గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
1. ఇది సంపూర్ణ వేరు పరాన్న జీవి.
2. అతిపెద్ద పుష్పాన్ని కలిగి ఉంటుంది.
3. ఏనుగు సహాయంతో పరాగ సంపర్కం జరుపుకుంటుంది.

ఎ) 2 మాత్రమే     బి) 1,2     సి) 2,3   డి) 1,2,3       (డి)

2. పరాన్నజీవిగా జీవించే అతిచిన్న పుష్పించే మొక్క?
ఎ) ఉల్ఫియా    బి) స్ట్రేగా     సి) పక్సినియ    డి) ఆర్సియొథోబియం    (డి)

3. పత్రో పరిసిత వేర్లు కలిగిన మొక్క?
ఎ) బల్బోఫిల్లమ్    బి) ఆగేవ్     సి) బ్రయోఫిల్లమ్    డి) పైవన్నీ     (సి)

4. పక్షి గూడు వంటి వేర్లు కలిగిన మొక్క?
ఎ) డస్చిడియ      బి) యుట్రిక్యులేరియ    సి) మోనోట్రోపా   డి) వాండా   ()

5. 'బ్లాడర్ వర్డ్' అని ఏ మొక్కను పిలుస్తారు?
ఎ) నెపెంథిస్     బి) యుట్రిక్యులేరియ   సి) డ్రాసిర    డి) డయోనియా    (బి)

6. 'వీనస్ ఫ్లైట్రాప్' అని ఏమొక్కను పిలుస్తారు?
ఎ) డయోనియా  బి) డ్రాసిర     సి) యుట్రిక్యులేరియ   డి) నెపెంథిస్  ()

7. అతి పెద్ద సరళ పత్రాలు ఏ మొక్కలో ఉంటాయి?
ఎ) నింఫియా   బి) సెక్వోయా    సి) విక్టోరియా    డి) సైకస్      (సి)

8. కూరగాయలుగా  ఉపయోగించే కాలీఫ్లవర్ ఒక?
ఎ) రసయుత పుష్ప విన్యాసం     బి) విభేదన లేని పత్రాల సముదాయం
సి) ఫలవంతమైన పుష్పాలు గల శాఖ    డి) కాండం           ()

9. అతి పెద్ద అండం కలిగిన మొక్క?
ఎ) నింఫియా   బి) సెక్వోయా    సి) విక్టోరియా    డి) సైకస్      (డి)

10. పుష్పించే అతి చిన్న మొక్క?
ఎ) ఉల్ఫియా  బి) విక్టోరియా   సి) రఫ్లేషియా    డి) సైకస్    ()

11. 'బోన్సాయ్' అంటే ?
ఎ) వామన మొక్కలను  పొడవుగా చేయడం  బి) వామన మొక్కలను సేకరించటం
సి) వామన మొక్కలను రూపొందించటం       డి) పండ్ల మొక్కలను సేకరించటం    (సి)

12. ఖర్జుర ఫలంలో తినే భాగం?
ఎ) అండ విన్యాస స్థానం         బి) ఫలకవచం
సి) అంకురచ్ఛదం                   డి) పూర్తి ఫలం       (బి)

13. 'కాజానస్ కజాన్' అనేది ఏ మొక్క శాస్త్రీయ నామం?
ఎ) కంది        బి) పెసర      సి) మినుము      డి) బఠాణి       ()

14. క్యారెట్ కు రంగు దేని వల్ల వస్తుంది?
ఎ) జాంథోఫిల్       బి) కెరోటిన్        సి) ఆంథోసైనిక్      డి) శ్వేత రేణువులు     (బి)

15. క్రోమోజోములకు సంబంధించిన క్రియ?
ఎ) శ్వాసక్రియ       బి) జీర్ణక్రియ      సి) విసర్జన       డి) అనువంశికత         (డి)

16. కింది వాటిలో సజీవ యాంత్రిక కణజాలం?
 ఎ) స్థూలకోణ కణజాలం      బి) దృడ  కణజాలం
సి) మృదు కణజాలం          డి) ఎ, బి                                       ()

17. కింది వాటిలో నిర్జీవ యాంత్రిక కణజాలం?
 ఎ) స్థూలకోణ కణజాలం      బి) దృడ  కణజాలం
సి) మృదు కణజాలం          డి) ఎ, బి                                       (బి)

18. కింది వాటిలో యాంత్రిక కణజాలం?
ఎ) స్థూలకోణ కణజాలం      బి) దృడ  కణజాలం
సి) మృదు కణజాలం          డి) ఎ, బి                                       (డి)

19. కింది వాటిలో సంక్లిష్ట కణజాలం ఏది?
ఎ) దృడ  కణజాలం      బి) స్థూలకోణ కణజాలం
సి) దారువు                       డి) పైవన్నీ                               (సి)

20. కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) సైటాలజీ                  బి) హిస్టాలజీ
సి) ఏలినాలజీ                డి) అనాటమీ                          (బి)

21. క్షిరదాల వెలుపలి చెవిలో ఉండే కణజాలం?
ఎ) స్థితి స్థాపక మృదులాస్థి      బి) తంతుయుత మృదులాస్థి
సి) కాల్షియం మృదులాస్థి        డి) కాచాభ మృదులాస్థి          ()

22. పెప్సిన్, ట్రిప్సిన్ అనే ఎంజైములు దేన్ని జీర్ణం చేస్తాయి?
ఎ) పిండి పదార్థాలు                బి) ప్రోటీన్లు
సి) కొవ్వులు                               డి) సెల్యులోజ్                 (బి)

23. జఠర రసంలో ఉండే ఎంజైము?
ఎ) ట్రిప్సిన్      బి) లైపేజ్       సి) పెప్సిన్           డి) అమైలేజ్          (సి)

24. 'సెల్యులేజ్' అనే ఎంజైము దేన్ని జీర్ణం చేస్తుంది?
ఎ) కేంద్రకామ్లాలు       బి) ఫాటీ ఆమ్లాలు      
సి) సెల్యులోజ్             డి) ప్రోటీన్లు                                (సి)

25. కింది ఏ పదార్థాలలో పెప్టెడ్  బంధాలు ఉంటాయి?
ఎ) ప్రోటీన్లు            బి) ఫాటీ ఆమ్లాలు
సి) కేంద్రకామ్లాలు           డి) పైవన్నీ                       ()

26. కింది వాటిలో ఎరోమాటిక్ అమైనో ఆమ్లం ఏది?
ఎ) గ్లైసిన్                 బి) సిస్టిన్    సి) ట్రిప్టోఫాన్           డి) పైవన్నీ      (సి)

27. అతి సరళ మైన అమైనో ఆమ్లం?
ఎ) గ్లైసిన్          బి) ల్యూసిన్          సి) ట్రిప్టోఫాన్         డి) సిస్టిన్         ()

28. కింది వాటిలో ఏకకణ శిలింద్రం ఏది?
ఎ) అగారికాస్        బి) పెన్సిలియం         సి) రైజోపస్     డి) ఈస్ట్        (డి)

29. వానపాము రక్తంలో హిమోగ్లోబిన్ ఉండే  ప్రదేశం?
ఎ) ఎర్ర రక్త కణాలు                బి) తెల్ల రక్త కణాలు
సి) ప్లాస్మా                               డి) హిమోగ్లోబిన్ ఉండదు                    (సి)

30. రక్తంలో ఎంత శాతం ప్లాస్మా ఉంటుంది?
ఎ) 90                బి) 55                 సి) 45                 డి) 10                   (బి)

31. పాకే జంతువులు ఏ తరగతికి చెందుతాయి?
ఎ) సరీసృప       బి) క్షిరదాలు       సి) ఉభయ చరాలు        డి) పైవన్నీ      ()

32. కొంకి పురుగులు, నులి పురుగులు ఏ వర్గానికి  చెందుతాయి?
ఎ) ప్రొటోజోవా        బి) ప్లాటీ హెల్మెంథిస్
సి) నిమాటి హెల్మెంథిస్                 డి) అనిలెడా                      (సి)

33. మానవ శరీరంలో యూరియాని సంశ్లేషించే అవయవం?
ఎ) మూత్రపిండాలు                  బి) కాలేయం
సి) ఫ్లీహం                                     డి) క్లోమం                            (బి)

34. ఆక్టోపస్ ఏ వర్గానికి  చెందుతుంది ?
ఎ) అనిలెడా                      బి) మొలస్కా
సి) ఇఖైనోడెర్మట               డి) పొరిఫెరా                                (బి)

35. పిండి పదార్థాన్ని కలిగి ఉండే జంతువు?
ఎ) యుగ్లీనా              బి)హైడ్రా          సి) అమీబా           డి) ఏదీ కాదు           ()

36. వర్మి కల్చర్ అంటే?
ఎ) నత్తల పెంపకం                               బి) వానపాముల పెంపకం
సి) పీతల పెంపకం                            డి) కీటకాల పెంపకం                      (బి)

37.  హైడ్రా : స్పర్షకాలు :: వానపాము : ......
ఎ)  శైలికలు              బి) శూకాలు       సి) కశాభాలు             డి) వృక్కాలు        (బి)

38. ఎదుగుదలకు తోడ్పడే పోషక పదార్థాలు అని వీటిని అంటారు?
ఎ) ప్రోటీన్లు               బి) పిండిపదార్థాలు
సి) కొవ్వులు                డి) కేంద్రకామ్లాలు                         ()

39. కింది వాటిలో విటమిన్ కానిది?
ఎ) బయోటిన్              బి) కొల్లాజిన్               సి) రైబోఫ్లేవిన్         డి) ఫోలికామ్లం     (బి)

40. కింది వాటిలో పాలీశాఖరైడ్ ఏది?
ఎ) సెల్యులోజ్                               బి) అమైలోజ్
సి) స్టార్చ్                                          డి) పైవన్నీ                        (డి)

41. 'లీన్నెక్' అనే శాస్త్రవేత్త దేన్ని కనుగొన్నాడు?
ఎ) స్టెతస్కోప్             బి) మైక్రో స్కోప్          సి) వైరస్             డి) ఇన్సులిన్            ()

42. సీతాకోక చిలుక సగటు జీవిత కాలం?
ఎ) 1-2 వారాలు            బి) 1-2 రోజులు           సి) 30 రోజులు        డి) 6 నెలలు          ()

43. ఏ జంతువు పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది?
ఎ) మేక              బి) ఒంటె           సి) గేదె                 డి) ఆవు                     (సి)

44. అతి పెద్ద శిలింద్రము ఏది?
ఎ) ఈస్ట్            బి) పెన్సీలియా        సి) గానోడెర్మా            డి) మ్యూకార్          (సి)

45. కింది వాటిలో అంకురచ్ఛద రహిత విత్తనం ?
ఎ) వరి           బి) చిక్కుడు               సి) గోధుమ              డి) పైవన్నీ                 (బి)

46. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) సాబిన్        బి) జెన్నర్           సి) సాక్               డి) కోచ్                    ()

47. 'కొలను పట్టు' అని దేన్ని అంటారు?
ఎ) రైజోపస్          బి) స్పైరోగైరా          సి) క్లోరెల్లా           డి) క్లామిడో మోనాస్       (బి)

48. వీర్యంలో ఉండే చెక్కర?
ఎ) ఫ్రక్టోజ్           బి) మాల్టోజ్           సి) గ్లూకోజ్                డి) సుక్రోజ్                ()

49. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణం?
ఎ) అధిక కొలెస్ట్రాల్                     బి) అధిక ప్రోటీన్లు
సి) అధిక స్టార్చ్                             డి) తక్కువ కొలెస్ట్రాల్                          ()