Social Icons

Pages

Tuesday, August 31, 2021

ప్రాచీన భారతదేశ చరిత్ర - 16 రాజ్యా లు

 ప్రాచీన భారతదేశ చరిత్ర - 16 రాజ్యా లు

1. అంగ: దీని రాజధాని చంపా. బ్రహ్మదత్తుడిని అంతం చేసి బింబిసారుడు ఈ రాజ్యా న్ని ఆక్రమించాడు.

 2. కాశీ: రాజధాని వారణాశి. ఇది వరుణ, ఆసి నదుల సంగమ ప్రాంతం. 

3. కోసల: దీని తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. ఈ రాజులు కాశీని ఆక్రమించుకొన్నారు. ఈ రాజ్యం చివరికి మగధలో విలీనమైంది. 

4. వజ్జీ: వైశాలి దీని రాజధాని. ఇది 8 గణరాజ్యాలతో కూడిన సమాఖ్య. వైశాలి రాజైన చేతకుడి కుమార్తె చెల్లనను బింబిసారుడు వివాహం చేసుకొన్నాడు. ఈ రాజ్యాన్ని అజాత శత్రువు అంతం చేశాడు. 

5. మల్ల: దీని రాజధానులు కుశినార, పావ. కుశినారలో బుద్ధుడు, పావలో మహావీరుడు నిర్యాణం చెందారు. ఈ గణరాజ్యం బుద్ధుడ్ని బాగా ఆదరించింది. బుద్ధుడి శిష్యులు ఆనందుడు, ఉపాలి ఈ రాజ్యానికి చెందినవారే. పావలో సాంతగార అనే శాసనసభ ఉండేది. 

6. చేది: రాజధాని సుక్తిమతి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది.

7. వత్స: రాజధాని కౌశాంబి. దీని రాజు ఉదయనుడు. బౌద్ధమతాన్ని ఆదరించాడు. హర్షుడి ప్రియదర్శిక,రత్నావళితో పాటు అనేక కథల్లో ఇతడు నాయకుడు. అవంతి రాజైన పలాక ఈ రాజ్యాన్ని ఆక్రమిం చాడు. 

8. పాంచాల: దీని రాజధానులు అహిచ్చత్ర, కంపిల్య

 9. శౌరసేన: దీని రాజధాని మధుర. గ్రీకు రచనల్లో ఈ రాజ్యాన్ని సౌరసేనాయ్ గా, రాజధానికి మేధోరాగా ప్రస్తావించారు. 

10. మత్స్య: దీని రాజధాని విరాటనగరం. ఈ రాజ్యం మగధలో కలిసిపోయింది. 

11. కురు: దీని రాజధాని ఇంద్రప్రస్థ. ఆధునిక ఢిల్లీ పరిసరాల్లోని నగరం. రెండో రాజధాని హస్తినాపుర్. 

12. అస్సక/అస్మక: రాజధాని పొదన లేదా పోటన. దీన్ని నేటి బోధన్ గా భావిస్తారు. షోడశ మహాజనపదాల్లోని ఏకైక దక్షిణాది రాజ్యం . ఆంధ్ర, మహారాష్ట్రలకు విస్తరించింది. 

13. అవంతి: రాజధానులు ఉజ్జయినీ, మహిష్మతి. బుద్ధుడి సమకాలికుడైన అవంతి రాజు ప్రద్యోత లేదా చండ ప్రద్యోత మహాసేన. దీని చివరిరాజైన నందివర్థనుడిని ఓడించి మగధ రాజు శిశునాగుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు. 

14. గాంధార: రాజధాని తక్షశిల. దీనిరాజు పుక్కుసతి లేదా పుష్కర సరీన్. ఈయన బింబిసారుడి వద్దకు రాయబారిని పంపాడు. ఈ రాజ్యాన్ని పర్షియన్లు ఆక్రమించుకున్నారు.

 15. కాంభోజ: దీని రాజధాని రాజాపుర (గిరివజ్ర) 

16. మగధ: రాజగృహ, పాటలీపుత్ర దీని రాజధానులు

       బుద్ధుడి కాలంలో పై 16 జనపదాల్లో కేవలం నాలుగు రాజ్యాలే ఉండేవి. అవి... వత్స, అవంతి, కోసల, మగధ. మిగిలిన రాజ్యాలన్నీ ఈ నాలుగు రాజ్యాల్లో విలీనమయ్యాయి. క్రీ.పూ. 4వ శతాబ్దంలో ఈ నాలుగు రాజ్యాలూ విలీనమై మగధ సామ్రాజ్యం ఆవిర్భవించింది.

No comments:

Post a Comment