మాదిరి ప్రశ్నలు
1) ఏ నిర్వచనం వల్ల అర్థశాస్త్రానికి సార్వజనీనత లభిస్తుంది?
1) కొరత 2) శ్రేయస్సు 3) సంపద 4) అన్నీ (1)
2) సూక్ష్మ అర్థశాస్త్రానికి మరొక పేరు?
1) క్షీణోపాంత ప్రయోజన సూత్రం 2) ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం
3) ధరల సిద్ధాంతం 4) ఏదీకాదు (3)
3)'Wealth of Nations' గ్రంథాన్ని ఎవరు రాశారు?
1) పిగూ 2) వాల్రస్ 3) మార్షల్ 4) ఆడం స్మిత్ (4)
4) 1970లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత?
1) రాబిన్స్ 2) అమర్త్యసేన్ 3) మార్షల్ 4) పాల్ శామ్యూల్‌సన్ (4)
5) వనరుల కొరత వల్ల ఏర్పడే సమస్య?
1) ఎంపిక 2) కొరత 3) ఆర్థిక 4) శ్రేయస్సు (1)
6) పూర్తిగా తయారుకాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువులను ఏమంటారు?
1) వినియోగ వస్తువులు 2) మాధ్యమిక వస్తువులు 3) ఆర్థిక వస్తువులు 4) ఉచిత వస్తువులు (2)
7) ‘ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) కె.ఇ. బోల్డింగ్ 2) రాగ్నర్ ఫ్రిష్ 3) జె.ఎం. కీన్స్ 4) స్టిగ్లర్ (3)
8) అర్థశాస్త్రంలో ‘సూక్ష్మ అర్థశాస్త్రం’, ‘స్థూల అర్థశాస్త్రం’ భావనలను 1933లో అభివృద్ధి చేసినవారు?
1) కీన్స్ 2) ఆడమ్ స్మిత్ 3) రాగ్నర్ ఫ్రిష్ 4) రాబిన్స్ (3)
9) ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని రచించింది?
1) మార్షల్ 2) కీన్స్ 3) ఆడమ్ స్మిత్ 4) రాబిన్స్ (1)
10) చెక్కతో కుర్చీ తయారు చేసినప్పుడు దానికి ఏ ప్రయోజనం చేకూరుతుంది?
1) రూప ప్రయోజనం 2) స్థల ప్రయోజనం 3) సేవల ప్రయోజనం 4) కాల ప్రయోజనం (1)
11) అర్థశాస్త్రాన్ని ‘సామాజిక శాస్త్రాల్లో రాణి’ వంటిదని చెప్పినవారు?
1) జాకోబ్ వైనర్ 2) మార్షల్ 2) ఆడమ్ స్మిత్ 4) పాల్ శామ్యూల్ సన్ (4)
12) అర్థశాస్త్రానికి కొరత నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థికవేత్త?
1) రాబిన్స్ 2) ఆడమ్ స్మిత్ 3) మార్షల్ 4) జాకోబ్ వైనర్ (1)
No comments:
Post a Comment