Social Icons

Pages

Saturday, June 18, 2022

పోటీ పరీక్షల ప్రత్యేకం - మధ్యయుగ ప్రపంచం

 పోటీ పరీక్షల ప్రత్యేకం  - మధ్యయుగ ప్రపంచం

1. క్రూసేడులు ఎవరెవరి మధ్య జరిగాయి?

 జ. మహ్మదీయుల, క్రైస్తవుల మధ్య

2. మధ్యయుగ కాల ముఖ్య లక్షణం? 

జ. భూసామ్య పద్దతి నెలకొని ఉండటం

3. ప్రపంచ చరిత్రలో మధ్యయుగంగా నిర్ణయించిన కాలం? 

జ. క్రీ.శ 5 నుంచి క్రీ.శ 15వ శతాబ్దం వరకు

4. మధ్యయుగాన్ని యూరప్ ఖండంలో ఏమని పిలుస్తారు? 

జ. మలీ యుగం

5. మధ్య యుగంలో గ్రామీణ రైతులను ఎలా పిలిచేవారు?

 జ. సర్వ్ లు

6. క్రూసేడులు అంటే? 

జ. మత యుద్ధాలు

7. ఇస్లాం మత స్థాపకుడు? 

జ. మహ్మద్ ప్రవక్త

8. ఎవరితో ఏర్పడిన సాంస్కృతిక సంబంధాలు యూరప్ లో పునరుజ్జీవనానికి కారణమయ్యాయి?

 జ. అరబ్బులతో

9. బైజాంటైన్ సామ్రాజ్యాన్ని తురుష్కులు ఎప్పుడు ఆక్రమించారు?

 జ. క్రీ.శ 1453

10. మధ్యయుగంలో భూస్వామ్య విధానం వల్ల నూతనంగా ఏర్పడిన సామాజివ వర్గం? 

జ. మధ్యతరగతి ప్రజలు

11. మహ్మద్ ప్రవక్తను 'నీవే భగవంతుని ప్రవక్తవు' అని ప్రవచించిన దేవదూత?

 జ. జిబ్రాయిల్

12. కాన్ స్టాంటినోపిల్ నగరంగా ప్రసిద్ధి చెందింది? 

జ. బైజాంటైన్ (గ్రీకు)

13. బైజాంటైన్ అద్భుత నిర్మాణంగా పేర్కొన్న చర్చ్ ? 

జ. సెయింట్ సోఫియా చర్చ్

14. ఏ సంవత్సరం నుంచి తమ శకం ఆరంభమైందని ముస్లింలు భావిస్తారు?

 జ. క్రీ.శ 622

15. ఏ పర్వత ప్రాంతంలో మహ్మద్ ప్రవక్త నిత్యం ధ్యానం చేసేవాడు?

 జ. హీరా పర్వతం

16. మహ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత విస్తరణకు కృషి చేసిన వారు? 

జ. ఉమయ్యద్ ఖలీఫాలు

17. ఇస్లాం అంటే? 

జ. లొంగి ఉండుట(ఆత్మ సమర్పణం)

18. ప్రతి ముస్లిం తన జీవితంలో ఆచరించాల్సిన ఎన్ని సూత్రాలను ఖురాన్ ప్రస్తావించింది? 

జ. 6

19. 'అల్లా' పేరు మీద పేదలకు దానధర్మాలు చేయడాన్ని ఏమంటారు? 

జ. జకాత్

20. ప్రాచీన భారతదేశ విజ్ఞానాన్ని యూరప్ కు చేరవేసిన వారు?

 జ. అరబ్బులు

21. భారతీయ విద్వాంసులను 'బాగ్దాద్'కు ఆహ్వానించిన ఖలీఫా? 

జ. హరూన్

22. ఆంగ్ల భాషలోకి ప్రవేశించిన అరబ్బీ పదాలు? 

జ. లెమన్, షుగర్, సిరఫ్, బజార్, ఆల్జీబ్రా

23. భారతదేశంలో మధ్యయుగంగా గుర్తించిన కాలం? 

జ. క్రీ.శ 7 నుంచి 18వ శతాబ్దం వరకు

24. అరబ్బులు 'సింధు దండయాత్ర' చేసిన సంవత్సరం? 

జ. క్రీ.శ 712

25. ఏ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది? 

జ. క్రీ.శ 1526

26. మెఘలాయి పాలనా పద్ధతులు ఆరంభించిన వారు? 

జ. షేర్షాసూరి

27. గురునానక్ ఎవరి బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు? 

జ. కబీర్

28. నూతన తర్క శాస్త్రానికి పునాది వేసిన వాడు? 

జ. వాసుదేవ సార్వభౌమ

29. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో రామాయణ, మహాభారతాలను సంస్కృతం నుంచి ఇతర భాషల్లోకి అనువదించారు? 

జ. అక్బర్

30. ఉపనిషత్తులను అనువదించిన 'దారాషుకో' ఎవరి కుమారుడు? 

జ. షాజహాన్

31. అక్బర్ నామాను రచించిన వారు? 

జ. అబుల్ ఫజల్

32. అమర గానాన్ని వర్ణించిన అంధ కవి?

 జ. సూర్ దాస్ 

33. 'అపర వాల్మీకి'గా ప్రసిద్ది చెందిన వాడు? 

జ. తులసీదాస్

34. అమీర్ ఖుస్రూ కనిపెట్టిన నూతన వాద్యం ? 

జ. ఖయి

35. అక్కర్ ఆస్థానంలో ఉన్న ప్రముఖ గాయకుడు?

 జ. తాన్ సేన్

36. అక్బర్ సమాధి ఉన్న ప్రదేశం? 

జ. సికిందరా

37. మొగల్ కాలంనాటి నిర్మాణాల్లో గోడలను అలంకరించేందుకు ఏయే మత పద్ధతులను అనుసరించారు?

 జ. హిందూ, జైన మత పద్ధతులు

38. జహంగీర్ కళాపోషణకు నిదర్శణమైన ఉద్యానవనాలు ఎక్కడ ఉన్నాయి? 

జ. లాహోర్

39. హుమయూన్ ను మనదేశానికి పిలిపించిన ప్రముఖ పర్షియన్ చిత్రకారులు?

 జ. మీర్ సయ్యద్ ఆలీ, ఖ్వాజా అబ్దుల్ సయ్యద్

40. పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి అని అభివర్ణించిన వాడు?

 జ. బెర్నియర్

41. ఏ వంశపు రాజుల కాలంలో చైనాలో ప్రభుత్వద్యోగులను పరీక్షల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది? 

జ. టాంగ్ వంశం

42. మధ్య యుగ జపాన్లో నిజమైన అధికారం ఎవరికుండేది? 

జ. భూస్వాములకు

43. చైనాలో 'సుంగ్' వంశపు పాలనలో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన గొప్ప మార్పు ? 

జ. పేపరు కరెన్సీని ప్రవేశ పెట్టడం

44. చేతి వేళ్ల గోళ్లను పెంచి వాటికి వెండి తొడుగుల్ని పెట్టుకున్న వారు? 

జ. చైనీయులు

45. 'ఉదయించే సూర్యుని భూమి'గా ప్రసిద్ది చెందిన దేశం? 

జ. జపాన్

46. జపాన్ వారి పితృదేవతారాధనను ఏమని పిలుస్తారు? 

జ. షింటోయిజమ్

47. చైనాలో బౌద్ధ మతం క్షీణించడానికి కారణం? 

జ. కన్ఫ్యూషియస్ మత ఆవిర్భావం

No comments:

Post a Comment