Social Icons

Pages

Tuesday, September 21, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - తెలుగు

పోటీ పరీక్షల ప్రత్యేకం - తెలుగు  

1. ‘కమలాసనుడు’ అనే బిరుదున్న శతక రచయిత?

1) పాల్కురికి సోమన     2) వేమన   3) బద్దెన   4) ధూర్జటి      (3)

2. ‘కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు’ అనే బిరుదులున్న కవి?

1) తిక్కన  2) పోతన  3) నన్నయ  4) శ్రీనాథుడు         (1)

3. అమృతం తెచ్చి తల్లి దాస్యాన్ని తొలగించిన వారు ఎవరు?

1) అనూరుడు  2) గరుత్మంతుడు  3) కశ్యపుడు  4) కాద్రవేయుడు       (2)

4. ‘మానవుడే నా సందేశం - మనుష్యుడే నా సంగీతం’ అని చాటి చెప్పిన కవి ఎవరు?

1) గురజాడ  2) శ్రీశ్రీ  3) డాక్టర్ సి.నారాయణ రెడ్డి  4) ఆరుద్ర           (2)

5. డాక్టర్ సి. నారాయణరెడ్డికి జ్ఞానపీఠ బహుమతి లభించిన గ్రంథం?

1) కర్పూర వసంతరాయలు  2) నాగార్జున సాగరం  3) విశ్వంభర  4) విశ్వనాథ నాయకుడు       (3)

6. ‘స్వాగతం’ పదంలోని సంధి?

1) గుణసంధి  2) యణాదేశసంధి  3) సవర్ణదీర్ఘసంధి  4) వృద్ధిసంధి            (2)

7. ‘హరించి ఇచ్చునది’ అనే వ్యత్పత్తి ఉన్న పదం?

1) ఎద  2) హరిణి  3) హృదయం 4) హర్మ్యం          ( 3)

8. శార్దూలం పద్యానికి యతిస్థానం ఎన్నో అక్షరం?

1) 11  2) 13  3) 14  4) 12          (2)

9. ‘తామరసం’ పదానికి నానార్థాలు?

1) మంచినీరు, చర్మరోగం  2) పద్మం, బ్రహ్మ  3) పద్మ, బంగారం  4) పండు, బ్రహ్మ      (3)

10. ‘బంగారం’ పదానికి ప్రకృతి రూపం?

1) సువర్ణం  2) స్వర్ణం  3) భృంగారం  4) బృందారం          (3)

No comments:

Post a Comment