శాతవాహనులు - సాంస్కృతిక సేవ
1. పౌదాన్యపురాన్ని ఏ పట్టణంతో పోల్చారు?
1. బోధన్ 2. కోటిలింగాల 3. పెదబంకుర్ 4. పుణిసిరి (1)
2. 'మెడోకళింగ', 'తెన్ కళింగ' పదాలను ప్రయోగించినవారు?
1. పరాశరుడు 2. అగస్త్యుడు 3. టాలమి 4. పుటార్క్ (2)
3. ట్రిలింగాన్, ట్రిలిప్తాన్ పదాలను ఉపయోగించినదెవరు?
1. పెరిప్లస్ 2. టాలమి 3. ప్లిని 4. జస్టిస్ (2)
4. 'త్రిలింగశ్చ' పదం ఏ గ్రంథంలో ఉంది?
1. మార్కండేయ పురాణం 2. మత్స్య పురాణం
3. బ్రహ్మాండ, భవిష్యత్తు పురాణాలు 4. విష్ణు, భాగవత పురాణాలు (1)
5. 'ఆంధ్రభృత్య' అని పేర్కొన్న గ్రంథం ఏది?
1. రామాయణం 2. భాగవతం 3. భారతం 4. ఐతరేయ బ్రాహ్మణం (2)
6. ఆంధ్రులు చేర, చోళ, పాండ్యులతో కలిసినట్లు చెప్పిన గ్రంథం?
1. మహాభారతం 2. రామాయణం 3. కంఠోపనిషత్తు 4. పరిప్పాదల్ (1)
7. 'ఐతరేయ బ్రాహ్మణం' లో పేర్కొన్న దక్షిణ దేశ రాజు ఎవరు?
1. ములక రాజు 2. అస్సక రాజు
3. విదర్భ రాజు భీముడు 4. కళింగ రాజు వాసు (3)
8. భావరి వృత్తాంతం ఏ గ్రంథంలో ఉంది?
1. సుత్తనిపాతం 2. భీమసేన జాతకం
3. పేరివణ జాతకం 4. కథావత్తు (1)
9. అస్సక రాజులైన అరుణ, బ్రహ్మదత్తులను భౌద్ధులుగా మార్చిన బౌద్ధ సన్యాసులు ఎవరు?
1. ఆనందుడు 2. ఉపాలి 3. మహాకశ్యపుడు 4. మహా కాత్యాయనుడు (4)
10. యశోధర్ముడు, మరో రాజుతో దక్కన్ దేశానికి వచ్చి ప్రతిపాలపుర రాజ్యాన్ని స్థాపించాడని తెలిపే ఆధారమైన కావ్యం ఏది?
1. ధర్మామృతం 2. విశుద్దిమగ్గ
3. హాతిగుంఫా శాసనం 4. గుంటుపల్లి శాసనం (1)
11. దక్షిణ దేశానికి వచ్చేటప్పుడు అగస్త్యుని రాకను అడ్డుకున్నది ఎవరు?
1. మహిషుడు 2. బలవీరుడు 3. వాతాపి, ఉల్వలుడు 4. నాగాశోకుడు (3)
12. 'అష్టాధ్యాయి' గ్రంథంలో పాణిని పేర్కొన్న దక్షిణ దేశ రాజ్యాలు?
1. ఆంధ్ర, తమిళ 2. ఆంధ్ర, కన్నడ
3. కళింగ, తెలంగాణ 4. తెలంగాణ, తమిళ (3)
13. 'వంబమోరియర్' అంటే అర్థం?
1. విజేత 2. చక్రవర్తి
3. హఠాత్తుగా పైకి వచ్చినవారు 4. పరాక్రమవంతుడు (3)
14. తమిళ దేశంపై చంద్ర గుప్త మౌర్యుడు దండయాత్ర చేసినప్పుడు, అతడికి సహాయంగా వచ్చిన ఆంధ్రులను మామల్లార్ ఏమని వర్ణించాడు?
1. తెలుగులు 2. తెలగలు 3. వడగర్లు 4. ఆంధ్రులు (3)
15. 'సువర్ణగిరి' అంటే ప్రస్తుతం ఏ ప్రాంతం?
1. జొన్నగిరి(అనంతపురం) 2. కనకగిరి(కర్ణాటక)
3. ఎర్రగుడి(ఆంధ్రప్రదేశ్, కర్నూలు) 4. కోటిలింగాల(తెలంగాణ) (1)
16. 'నిగమసభ'(పట్టణ సభ)శాతవాహనుల కాలంలో కనిపించే మరొక ప్రాంతం ఏది?
1. ధూళికట్ట 2. పెద బంకుర్ 3. వడ్డమాను 4. వెట్నార్ (3)
17. 'కుబ్జిరకుడు' అనే రాజుకు సంబంధించిన వివరాలు ఏ శాసనంలో ఉన్నాయి?
1. నానాఘాట్ 2. భట్టిప్రోలు 3. నాసిక్ 4. హతిగుంఫా (2)
18. కళింగ, అస్సక (తెలంగాణ) రాజ్యాల మధ్య యుద్ధం జరిగిందని తెలిపే గ్రంథం?
1. చుళ్వవగ్గ జాతకం 2. భీమసేన జాతకం
3. సుత్తనిపాతం 4. కథావత్తు (1)
19. 'చుళ్వవగ్గ జాతకం' ప్రకారం 'అస్సక' రాజు ఎవరు?
1. బ్రహ్మదత్తుడు 2. చేతన 3. అరుణ 4. కుబ్యారకుడు (3)
20. మూడో బౌద్ధ సంగీతి తరవాత అశోకుడు 'అస్సక' రాజ్యాలకు పంపిన బౌద్ధమత ప్రచారకుడు ఎవరు?
1. మహాదేవ భిక్షువు 2. క్రకుచంద
3. రుద్రదేవ భిక్షువు 4. మహాకాత్యాయనుడు (1)
21. అస్సక రాజు అరుణ పేరును ప్రస్తావించే మరో బౌద్ధ గ్రంథం?
1. కథావత్తు 2. మద్యమనికాదు
3. చుళ్వవగ్గ 4. విమానవత్తు (4)
22. 'ఆంధ్రానగరి' ఏ నదీ తీరాన ఉందని పేర్కొన్నారు?
1. కృష్ణా 2. గోదావరి 3. మహానది 4. తెలివహానది (4)
23. శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏమంటారు?
1. ఆహారాలు 2. రాష్ట్రాలు 3. మండలాలు 4. సామ్రాజ్యాలు (1)
24. 'ఆంధ్రానగరి' ఏ పట్టణంగా గుర్తింపు పొందింది?
1. ధాన్యకటకం 2. ఏట్లియ 3. పోతన 4. పితుండా నగరం (2)
25. 'బొరాబొదూర్' శిల్పానికి నమూనా ఏది?
1. గాలి 2. ఘంటసాల 3. బొజ్జన్న కొండ 4. ఫణిగిరి (3)
26. శాతవాహన యుగంలో తెలంగాణలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసింది ఎవరు?
1. చంద్రముఖనాథుడు 2. ఆర్యనాథుడు
3. ధర్మనంది 4. ధర్మకీర్తి (3)
27. వైదిక మత ముఖ్య ఆరాధన విధానం ఏది?
1. యజ్ఞాలు చేయడం 2. విగ్రహారాధన
3. వ్రతాలు చేయడం 4. తపస్సు చేయడం (1)
28. రాజ శాసనాలను రచించేది ఎవరు?
1. లేఖకుడు 2. మహాసేనాపతి
3. నిబంధనకారుడు 4. మహామాత్యుడు (2)
29. 'అక్షపటలక' శాఖ ముఖ్య విధి ఏది?
1. సైనిక శాఖ 2. రికార్డ్ శాఖ 3. భాండాగారిక 4. వస్తు కోశాధికారి (1)
30. 'దైవమియ' అంటే.... ?
1. పన్ను 2. యజ్ఞం 3. దేవతలు 4. విదేశీ వ్యాపారం (1)
No comments:
Post a Comment