Social Icons

Pages

Friday, September 10, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - తెలుగు

 పోటీ పరీక్షల ప్రత్యేకం - తెలుగు 

1. కింది వాటిలో నన్నయ కవితా గుణం కానిది ఏది?

  1) అక్షర రమ్యత       2) ప్రసన్న కథాకవితార్థయుక్తి     

3) నాటకీయత     4) నానారుచిరార్థ సూక్తినిధిత్వం        (3)

2.కింది వాటిలో నన్నయ బిరుదు ఏది?

  1) ఉభయ కవిమిత్రుడు    2) కవి బ్రహ్మ    3) శబ్ద శాసనుడు   4) శంభుదాసుడు  (3)

3. గరుత్మంతుడి తల్లి పేరు?

  1) కద్రువ   2) మాద్రి   3) అనసూయ   4) వినత  (4)

4. అమృతం తెచ్చిన తల్లి దాస్యం తొలగించినవాడు?

  1) అనూరుడు    2) గరుత్మంతుడు   3) కాద్రవేయుడు   4) కశ్యపుడు  (2)

5.‘నాలో కదిలే నవ్య కవిత్వం/ కార్మిక లోకపు కళ్యాణానికి/ శ్రామికలోకపు సౌభాగ్యానికి’ అని పలికిన అభ్యుదయ కవి?

  1) ఆరుద్ర    2) దాశరథి   3) అనిశెట్టి    4) శ్రీశ్రీ   (4)

6. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ గ్రంథకర్త ఎవరు?

  1) మంచన    2) నాచన సోమన   3) మారన    4) గౌరన   (4)

7. ‘సరస సాహిత్య విచక్షణుడు’ అనే బిరుదున్న కవి?

  1) నాచన సోమన   2) గౌరన   3) నంది తిమ్మన   4) కేతన  (2)

8. కింది వాటిలో వైరాగ్య శతకం ఏది?

  1) దాశరథి శతకం   2) శ్రీ కాళహస్తీశ్వర శతకం   3) వేంకటేశ శతకం   4) నరసింహ శతకం   (2)

9. డాక్టర్ సి.నారాయణ రెడ్డికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం లభించిన గ్రంథం?

  1) నాగార్జున సాగరం   2) విశ్వంభర   3) కర్పూర వసంతరాయలు   4) రామప్ప  (2)

10.ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథకర్త?

  1) కేతన    2) మారన   3) నన్నయ   4) చిన్నయ సూరి (3)

11. భారత కవికోకిల బిరుదున్న జాతీయోద్యమ నాయకురాలు?

  1) విజయలక్ష్మి పండిట్   2) సరోజినీ నాయుడు   3) దుర్గాబాయి దేశ్‌ముఖ్   4) ఇందిరాగాంధీ  (2)

12. కింది వాటిలో త్రిలింగాల్లో లేనిది ఏది?

  1) శ్రీశైలం   2) దాక్షారామం   3) శ్రీకాళహస్తి   4) కాళేశ్వరం  (3)

13. హరిశ్చంద్రుడి తండ్రి ఎవరు?

  1) విశ్వామిత్రుడు   2) త్రిశంకుడు   3) వశిష్టుడు   4) గౌతముడు   (2)

14. కింది వాటిలో గాంధీజీని ప్రభావితం చేసిన నాటకాలు?

  1) గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర    2) శాకుంతలం, శ్రవణ కుమార చరిత్ర  

  3) సత్యహరిశ్చంద్ర, శ్రవణ కుమార చరిత్ర    4) శాకుంతలం, మహాశ్వేత  (3)

15. మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? 

  1) స్వామి సీతారాం    2) పట్టాభి సీతారామయ్య  

  3) పింగళి వెంకయ్య    4) వల్లభ్‌భాయ్ పటేల్  (3)

16. ఉత్పలమాల పద్యపాదంలో గణాలు?

  1) న, జ, భ, జ, జ, జ, ర    2) భ, ర, న, భ, భ, ర, వ  

 3) మ, స, జ, స, త, త, గ   4) స, భ, ర, న, మ, య, వ  (2)

17. శార్దూలం పద్యంలో యతిస్థానం?

  1) 11వ అక్షరం   2) 12వ అక్షరం   3) 13వ అక్షరం   4) 14వ అక్షరం  (3)

18. ‘సందేశం’ పదంలో గణాలు?

  1) UUI -తగణం    2) UUU - మగణం   3) UIU - రగణం    4) UII - భగనం (2)

19. తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు’ ఈ పొడుపుకథకు విడుపు?

  1) గుమ్మడిపండు   2) దానిమ్మపండు   3) పనసపండు   4) అరటిపండు  (3)

20. యజ్ఞశాలలో పండితులు ‘చతుర్వేదాలు’ చదివారు ‘చతుర్వేదాలు’ ఏ సమాసం?

  1) ద్వంద్వ సమాసం   2) ద్విగు సమాసం   

3) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం   4) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం (2)

21. ‘భ్రమరం’ అంటే అర్థం?

  1) ఈగ    2) బొద్దింక   3) తుమ్మెద   4) తేనెటీగ  (3)

22. వినాయక చవితిని జాతీయ సమైక్యత కోసం వినియోగించిన నాయకుడు?

  1) గాంధీజీ    2) నెహ్రూ   3) బాలగంగాధర తిలక్   4) వల్లభ్‌భాయ్ పటేల్  (3)

23. ‘అరణ్యం’ అనే పదానికి పర్యాయ పదాలు?

  1) ధరణి, పుడమి   2) అడవి, విపినం   3) వసుధ, వనం   4) అడవి, భూమి  (2)

24. ‘అభ్యుదయం’ పదాన్ని విడదీసి రాస్తే?

  1) అభ + ఉదయం   2) అభు + యుదయం   3) అభి + ఉదయం   4) అభు + ఉదయం  (3)

25. ‘అత్యంత’ పదంలో సంధి?

  1) యడాగమ సంధి    2) యణాదేశ సంధి   3) గుణసంధి    4) వృద్ధి సంధి (2)

26. ‘మొసలి కన్నీరు’ జాతీయానికి అర్థం?

  1) జంతువుల కన్నీరు   2) మొసలి ఏడ్పు    3) తెలివితక్కువ   4) లేని బాధను నటించడం  (4)

27. కింది వాటిలో ద్విరుక్తటకార సంధికి ఉదాహరణలు?

  1) చెచ్చెర, పుట్టిల్లు   2) కట్టెదుట, నట్టిల్లు   3) నిట్టూర్పు, అందదుకు   4) నట్టెల్లు, కట్టకడ (2)

28. ‘ఇ-టి-తి’ అనేవి?

  1) విభక్త ప్రత్యయాలు   2) ఔపభక్తులు   3) సర్వనామాలు   4) అవ్యయాలు  (2)

29. కష్టపడిందంతా వృధా అయిన సందర్భంలో వాడే జాతీయం?

  1) ఆకాశానికి నిచ్చెన వేయడం   2) అడివిగాచిన వెన్నెల  

 3) బూడిదలో పోసిన పన్నీరు   4) కుక్క తోక పట్టి గోదారీదడం  (3)

30. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టినవారు?

  1) స్వామి దయానంద సరస్వతి   2) నందలాల్ బహుగుణ   

3) గాడిచర్ల హరి సర్వోత్తమ రావు   4) నంబూద్రి పాద్ (3)

31.‘గబ్బిలం, ఫిరదౌసి’ గ్రంథాల కర్త?

  1) దువ్వూరి రామిరెడ్డి   2) సి. నారాయణరెడ్డి 

  3) గుర్రం జాషువా   4) దేవరకొండ బాలగంగాధర తిలక్  (3)

32. కింది వారిలో చైతన్య స్రవంతి పద్ధతిని ప్రవేశపెట్టినవారు?

  1) శ్రీశ్రీ    2) జాషువా   3) గురజాడ   4) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి  (1)

33. సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంగా సంపాదకులు రాస్తే?

  1) సమర్థనీయం   2) సంపాదకీయం   3) రచనా సౌందర్యం   4) జీవిత చరిత్ర  (2)

34. ఆయుధ పూజ ఏ పండుగ రోజు నిర్వహిస్తారు?

  1) విజయదశమి   2) దీపావళి   3) సంక్రాంతి   4) శ్రీరామనవమి  (1)

35. ఆరుద్ర అసలు పేరు?

  1) పెనుమర్తి విశ్వనాథ శర్మ   2) కిళాంబి వెంకట నరసింహాచార్యులు  

 3) జంధ్యాల పాపయ్యశాస్త్రి   4) భాగవతుల సదాశివ శంకర శాస్త్రి  (4)

36. దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటికి లభించిన పురస్కారం?

  1) కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం    2) జ్ఞాన్‌పీఠ్   

3) మూర్తి దేవి పురస్కారం   4) తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1)

37. మత్తేభ పద్యపాదానికి యతిస్థానం పాటించే అక్షరం?  

  1) 10వ అక్షరం   2) 13వ అక్షరం   3) 14వ అక్షరం    4) 11వ అక్షరం (3)

38. గరుత్మంతుడి తండ్రి పేరు?   

  1) దక్ష ప్రజాపతి   2) సూర్యుడు   3) అనూరుడు   4) కశ్యప ప్రజాపతి  (4)

No comments:

Post a Comment