పోలీస్, గ్రూప్స్ ఆర్ ఆర్ బి ప్రత్యేకం
1. ఎ) భరతనాట్యం బి) కూచిపూడి సి) బాంగ్రా డి) యక్షగానం
సమాధానం : (సి) బాంగ్రా
వివరణ : బాంగ్రా మినహా మిగిలినవి శాస్త్రీయ నృత్యాలు. బాంగ్రా జానపద నృత్యం
సమాధానం : బి) నవంబర్
వివరణ : నవంబర్ మినహా మిగిలిన నెలలకు 31 రోజులు. నవంబర్ నెలకు 30 రోజులు మాత్రమే ఉంటాయి.
3. ఎ) ముఖ్యమంత్రి బి) లోకసభ సభ్యుడు సి) రాజ్యసభ సభ్యుడు డి) ప్రధాన మంత్రి
సమాధానం : (ఎ) ముఖ్యమంత్రి
వివరణ : ఎ) ముఖ్యమంత్రి మినహా మిగిలినవి వ్యక్తులు కేంద్రానికి సంబంధించిన వారు.
4. ఎ) కోహిమా బి) ఈటానగర్ సి) అగర్తల డి) పాట్నా
సమాధానం : (డి) పాట్నా
వివరణ : పాట్నా మినహా మిగిలినవి వివిధ ఈశాన్య రాష్ట్రాల రాజధానులు.
5. ఎ) పెల్లాగ్రా బి) బెరిబెరి సి) అనీమియా డి) గాయిటర్
సమాధానం : (డి) గాయిటర్
వివరణ : గాయిటర్ మినహా మిగిలినవి విటమిన్ వలన వచ్చును. కానీ గాయిటర్ వ్యాధి అయోడిన్ లోపం వలన వచ్చును.
6. ఎ) బాడ్మింటన్ బి) చెస్ సి) క్యారమ్స్ డి) బిలియర్డ్స్
సమాధానం : (ఎ) బాడ్మింటన్
వివరణ : బాడ్మింటన్ మినహా మిగిలినవి Indoor games.
7. ఎ) మే బి) జూన్ సి) జూలై డి) ఆగష్టు
సమాధానం : (బి) జూన్
వివరణ : జూన్ మినహా మిగిలిన నెలలకు 31 రోజులు కలవు.
8. ఎ) నైల్ బి) ఓల్గా సి) నయాగరా డి) అమెజాన్
సమాధానం : (సి) నయాగరా
వివరణ : నయాగరా మినహా మిగిలినవి నదుల పేర్లు. కానీ నయాగరా అనేది జలపాతం.
9. ఎ) గుండె బి) నేత్రం సి) చెవి డి) కాలు
సమాధానం : (ఎ) గుండె
వివరణ : గుండె మినహా మిగిలినవి ఒక జత కలవు.
10. ఎ) నియాసిన్ బి) ట్రిప్సిన్ సి) ఆస్కార్బిక్ ఆమ్లం డి) రైబోఫ్లోవిన్
సమాధానం : (బి) ట్రిప్సిన్
వివరణ : ట్రిప్సిన్ మినహా మిగిలినవి వివిధ విటమిన్స్ పేర్లు. కానీ ట్రిప్సిన్ అనేది ఎంజైమ్.
11. ఎ) బంతి బి) చామంతి సి) తామర డి) గులాబి
సమాధానం : (సి) తామర
వివరణ : తామర మినహా మిగిలిన పువ్వులు భూమి మీద పెరుగును.కానీ, తామర నీటిలో పెరుగును.
12. ఎ) పోలెండ్ బి) గ్రీస్ సి) స్పెయిన్ డి) కొరియా
సమాధానం : (డి) కొరియా
వివరణ : కొరియా మినహా మిగిలిన దేశాలు యూరప్ ఖండంలోనివి. కానీ, కొరియా ఆసియా ఖండమునకు సంబంధించిన దేశము.
13. ఎ) చెన్నై బి) హైదరాబాద్ సి) బెంగుళూర్ డి) లక్నో
సమాధానం : (డి) లక్నో
వివరణ : లక్నో మినహా మిగిలిన నగరములు వివిధ దక్షిణ భారతదేశాల రాష్ట్రాల రాజధానులు. లక్నో ఉత్తర భారతదేశ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని.
14. ఎ) కివి బి) గద్ద సి) పెంగ్విన్ డి) ఆస్ట్రిచ్
సమాధానం : (బి) గద్ద
వివరణ : గద్ద మినహా మిగిలిన పక్షులు ఎగరలేనివి. గద్ద ఎగిరే పక్షి.
15. ఎ) గోధుమ బి) ఆవాలు సి) వేరుశెనగ డి) వరి
సమాధానం : (డి) వరి
వివరణ : వరి మినహా మిగిలినవి రబీ పంటలు. కానీ, వరి ఖరీఫ్ పంట.
16. ఎ) బైకాల్ బి) థాల్ సి) చిలక డి) థార్
సమాధానం : (డి) థార్
వివరణ : థార్ మినహా మిగిలినవి వివిధ సరస్సుల పేర్లు. కానీ, థార్ అనేది ఎడారి.
17. ఎ) కోణార్క్ బి) మధురై సి) ఎల్లోరా డి) దిల్వారా
సమాధానం : (సి) ఎల్లోరా
వివరణ : ఎల్లోరా మినహా మిగిలినవి వివిధ ప్రసిద్ధ దేవాలయములు గల ప్రదేశములు. కానీ, ఎల్లోరా ప్రసిద్ధ గుహలు గల ప్రదేశము.
18. ఎ) ఋగ్వేదము బి) ఆయుర్వేదము సి) సామవేదము డి) యజుర్వేదము
సమాధానం : (బి) ఆయుర్వేదము
వివరణ : ఆయుర్వేదము మినహా మిగిలినవి వేదాలు. కానీ, ఆయుర్వేదము ఒక వైద్యశాస్త్రము.
19. ఎ) గ్రానైట్ బి) లిగ్నైట్ సి) ఆంత్రసైట్ డి) బిటుమినస్
సమాధానం : (ఎ) గ్రానైట్
వివరణ : గ్రానైట్ మినహా మిగిలినవి బొగ్గు యొక్క రూపాంతారాలు. కానీ, గ్రానైట్ అనునది ఒక విలువైన రాయి.
20. ఎ) సంతాల్స్ బి) ఖోండ్స్ సి) అబోర్స్ డి) డోగ్రి
సమాధానం : (డి) డోగ్రి
వివరణ : డోగ్రి మినహా మిగిలినవి వివిధ గిరిజనుల జాతులు. కానీ, డోగ్రి అనేది ఒక భాష.
21. ఎ) కాలువ బి) వంతెన సి) ప్రవాహం డి) సెలయేరు
సమాధానం : (బి) వంతెన
వివరణ : వంతెన మినహా మిగిలినవి నీటిని కలిగి యుండును.
22. ఎ) నేపాల్ బి) న్యూఢిల్లీ సి) కాబూల్ డి) బీజింగ్
సమాధానం : (ఎ) నేపాల్
వివరణ : నేపాల్ మినహా మిగిలినవి వివిధ దేశాల రాజధానులు. కానీ, నేపాల్ అనునది దేశం.
23. ఎ) మహావీరుడు బి) గౌతమ బుద్ధుడు సి) మహాత్మాగాంధీ డి) గురునానక్
సమాధానం : (సి) మహాత్మాగాంధీ
వివరణ : మహాత్మాగాంధీ మినహా మిగిలిన వారు వివిధ ప్రసిద్ధ మతముల స్థాపకులు.
24. ఎ) రాజీవ్ గాంధీ బి) జవహర్ లాల్ నెహ్రూ సి) చరణ్ సింగ్ డి) బాబూ రాజేంద్ర ప్రసాద్
సమాధానం : (డి) బాబూ రాజేంద్ర ప్రసాద్
వివరణ : బాబూ రాజేంద్ర ప్రసాద్ మినహా మిగిలిన వారు ప్రధాన మంత్రులు. కానీ, బాబూ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి.
25. ఎ) పాదరసము బి) ఆక్సిజన్ సి) మెగ్నీషియం డి) సోడియం
సమాధానం : (ఎ) పాదరసము
వివరణ : 4 మూలకాలే. కానీ, పాదరసము ద్రవరూపమూలకం.
26. ఎ) కలం బి) నల్లబల్ల సి) కాగితం డి) పలక
సమాధానం : (ఎ) కలం
వివరణ : కలం మినహా మిగిలిన వాటిపై వివిధ వస్తువులతో వ్రాయవచ్చు. కానీ, కలం వ్రాయటానికి ఉపయోగించే వస్తువు.
27. ఎ) గారో బి) ఖాశీ సి) కాంగ్రా డి) జెంతియా
సమాధానం : (సి) కాంగ్రా
వివరణ : కాంగ్రా మినహా మిగిలినవి కొండలు. కానీ, కాంగ్రా లోయ.
28. ఎ) మార్చి బి) జూలై సి) ఆగష్టు డి) మే
సమాధానం : (సి) ఆగష్టు
వివరణ : అన్ని నెలలకు రోజులు 31. మార్చి 3వ నెల, జూలై 7వ నెల, మే 5 వ నెల, అనగా మార్చి, జూలై, మే బేసి సంఖ్యల నెలలు. కానీ, ఆగష్టు అనేది 8వ నెల అనగా సరిసంఖ్యకు సంబంధించిన నెల.
29. ఎ) నారింజ బి) పసుపు సి) ఆకుపచ్చ డి) గులాబీ
సమాధానం : (డి) గులాబీ
వివరణ : గులాబీ మినహా మిగిలిన రంగులు ఇంద్ర ధనస్సు నందు కలవు.
30. ఎ) న్యూటన్ బి) మార్కొని సి) బీతావన్ డి) ఫారడే
సమాధానం : (సి) బీతావన్
వివరణ : బీతావన్ మినహా మిగిలిన వ్యక్తులు శాస్త్రవేత్తలు.
31. ఎ) క్యారెట్ బి) అల్లం సి) బీట్ రూట్ డి) అనపకాయ
సమాధానం : (డి) అనపకాయ
వివరణ : అనపకాయ మినహా మిగిలిన కూరగాయలు భూమి నుండి వస్తాయి.
32. ఎ) బిందుసారుడు బి) బింబిసారుడు సి) అశోకుడు డి) సంప్రాప్తి
సమాధానం : (బి) బింబిసారుడు
వివరణ : బింబిసారుడు మినహా మిగిలిన వ్యక్తులు మౌర్య వంశానికి చెందిన వారు. కానీ, బింబిసారుడు హర్యంక వంశానికి చెందిన వారు.
33. ఎ) దాద్రానగర్ హవేలి బి) అండమాన్ నికోబార్ దీవులు సి) పాండిచ్చేరి డి) జార్ఖండ్
సమాధానం : (డి) జార్ఖండ్
వివరణ : జార్ఖండ్ మినహా మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ, జార్ఖండ్ అనునది ఒక రాష్టం పేరు.
34. ఎ) బుల్లీ బి) కార్నర్ సి) బంకర్ డి) డ్రిబుల్
సమాధానం : (సి) బంకర్
వివరణ : బంకర్ మినహా మిగిలిన పదాలు హాకీ క్రీడకు సంబంధించినవి.
35. ఎ) బీర్బల్ బి) ఫైజ్ అహ్మద్ సి) అబుల్ ఫజిల్ డి) తాన్ సేన్
సమాధానం : (బి) ఫైజ్ అహ్మద్
వివరణ : జ్ అహ్మద్ మినహా మిగిలిన వ్యక్తులు అక్బరు ఆస్థానానికి చెందినవారు.
36. ఎ) ఆసియా బి) అర్జెంటీనా సి) ఆఫ్రికా డి) ఆస్ట్రేలియా
సమాధానం : (బి) అర్జెంటీనా
వివరణ : అర్జెంటీనా మినహా మిగిలినవి వివిధ ఖండముల పేర్లు.
37. ఎ) మెరీనా బి) జెర్సొప్పా సి) విక్టోరియా డి) ఏంజల్
సమాధానం : (ఎ) మెరీనా
వివరణ : మెరీనా మినహా మిగిలినవి వివిధ జలపాతములు. కానీ, మెరీనా ఒక బీచ్.
38. ఎ) కాండ్లా బి) హిమాద్రి సి) శివాలిక్ డి) హిమాచల్
సమాధానం : (ఎ) కాండ్లా
వివరణ : కాండ్లా మినహా మిగిలినవి వివిధ హిమాలయ పర్వత శ్రేణులు. కానీ, కాండ్లా అనునది ఓడరేవు.
39. ఎ) చెరకు బి) జొన్న సి) కాఫీ డి) పొగాకు
సమాధానం : (బి) జొన్న
వివరణ : జొన్న మినహా మిగిలినవి వాణిజ్య పంటలు. కానీ, జొన్న ఆహారపంట.
40. ఎ) శాంగ్ పో బి) బందీపూర్ సి) హజారీ బాగ్ డి) కన్హా
సమాధానం : (ఎ) శాంగ్ పో
వివరణ : శాంగ్ పో మినహా మిగిలినవి వివిధ జాతీయ పార్కులు.
No comments:
Post a Comment