Social Icons

Pages

Tuesday, October 31, 2023

ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

 ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా?

జ. 29%, 71%

2. దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. జలభాగం

3. పేంజియాకు మధ్యలో ఉన్న సముద్రం?

జ. టెథిస్

4. ‘ఖండ చలన సిద్ధాంతాన్ని’’ ప్రతిపాదించింది?

జ. ఆల్ఫ్రెడ్ వెజినర్

5. ‘‘లారెన్షియా’’కు మరో పేరు?

జ. అంగారా

6. పూర్వం భూభాగం అంతా ఒకే ఖండ భాగంగా ఉన్నప్పుడు దానిని ఏమనేవారు?

జ. పేంజియా

7. లారెన్షియా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలుగా

8. ఖండాల్లో పెద్దది, చిన్నది?

జ. ఆసియా, ఆస్ట్రేలియా

9. పేంజియాను అన్ని వైపులా ఆవరించి ఉన్న సముద్రం?

జ. పెంథాల్సా

10. మహాసముద్రాల్లో పెద్దది, లోతైనది?

జ. పసిఫిక్ మహాసముద్రం

11. ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. భూభాగం

12. కేప్ యార్‌‌క అనేది?

జ. ద్వీపకల్పం

13. ‘లారెన్షియా’ అంటే?

జ. టెథిస్‌కు ఉత్తరంగా ఉన్నభూభాగం

14. గ్రీన్‌లాండ్ ఓ?

జ. ద్వీపం

15. టెథిస్‌కు దక్షిణంగా ఉన్న భూభాగం?

జ. గోండ్వానా

16. అన్ని వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపం

17. మహా సముద్రాల్లో అతి చిన్నది?

జ. ఆర్కిటిక్ మహాసముద్రం

18. గోండ్వానా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికా

19. మూడు వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపకల్పం

No comments:

Post a Comment