Social Icons

Pages

Showing posts with label Geography. Show all posts
Showing posts with label Geography. Show all posts

Tuesday, October 31, 2023

ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

 ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా?

జ. 29%, 71%

2. దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. జలభాగం

3. పేంజియాకు మధ్యలో ఉన్న సముద్రం?

జ. టెథిస్

4. ‘ఖండ చలన సిద్ధాంతాన్ని’’ ప్రతిపాదించింది?

జ. ఆల్ఫ్రెడ్ వెజినర్

5. ‘‘లారెన్షియా’’కు మరో పేరు?

జ. అంగారా

6. పూర్వం భూభాగం అంతా ఒకే ఖండ భాగంగా ఉన్నప్పుడు దానిని ఏమనేవారు?

జ. పేంజియా

7. లారెన్షియా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలుగా

8. ఖండాల్లో పెద్దది, చిన్నది?

జ. ఆసియా, ఆస్ట్రేలియా

9. పేంజియాను అన్ని వైపులా ఆవరించి ఉన్న సముద్రం?

జ. పెంథాల్సా

10. మహాసముద్రాల్లో పెద్దది, లోతైనది?

జ. పసిఫిక్ మహాసముద్రం

11. ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. భూభాగం

12. కేప్ యార్‌‌క అనేది?

జ. ద్వీపకల్పం

13. ‘లారెన్షియా’ అంటే?

జ. టెథిస్‌కు ఉత్తరంగా ఉన్నభూభాగం

14. గ్రీన్‌లాండ్ ఓ?

జ. ద్వీపం

15. టెథిస్‌కు దక్షిణంగా ఉన్న భూభాగం?

జ. గోండ్వానా

16. అన్ని వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపం

17. మహా సముద్రాల్లో అతి చిన్నది?

జ. ఆర్కిటిక్ మహాసముద్రం

18. గోండ్వానా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికా

19. మూడు వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపకల్పం

Tuesday, July 26, 2022

మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు

 మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు 

1. భారతదేశం మొదటగా భూకక్ష్యలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం?

1) ఆర్యభట్ట  2) భాస్కర-1  3) ఇన్‌శాట్ - 1బి   4) భాస్కర - 2   (1)

2. అన్నింటికంటే ప్రకాశంగా కనిపించే గ్రహం?

1) శని  2) భూమి  3) శుక్రుడు  4) బుధుడు   (3)

3. పగలు, రాత్రి ఏర్పడడానికి కారణం?

1) భూ పరిభ్రమణం  2) భూ భ్రమణం  3) ఉల్కాపాతం  4) ఏదీకాదు    (2)

4. సూర్య గ్రహణం ఏ సందర్భంలో ఏర్పడుతుంది?

1) భూమి.. చంద్రుడికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు  

2) చంద్రుడు.. భూమికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు

3) సూర్యుడు భూమి, చంద్రుడి మధ్య వచ్చినప్పుడు      4) అన్నీ         (2)

5. రాశుల్లో అన్నింటికంటే పెద్ద తారాగణం?

1) సెరస్  2) ఇంకారస్  3) హైడ్రా  4) హేలీ   (3)

6. రష్యా సహకారంతో భారతదేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పర్చిన ప్రదేశాలు?

1) తుంబా  2) శ్రీహరికోట  3) ఢిల్లీ  4) 1, 2  (4)

7. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం?

1) శని  2) బృహస్పతి  3) బుధుడు  4) శుక్రుడు  (1)

8. ఇప్పటివరకు గుర్తించిన నక్షత్రాల్లో అతిపెద్దది?

1) సెరస్  2) ఎప్సిలాన్ అరిగ  3) హైడ్రా  4) ఇంకారస్  (2)

9. మొట్టమొదటి స్పేస్ షటిల్?

1) అపోలో  2) స్పుత్నిక్  3) కొలంబియా  4) వస్తోక్   (3)

10. స్కైలాబ్ అనే ప్రయోగాత్మక అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏ దేశం ఏర్పాటు చేసింది?

1) రష్యా   2) అమెరికా  3) ఇండియా  4) సింగపూర్   (2)

11. చంద్రుడు తన చుట్టూ తాను, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు? 

1) 30 రోజులు  2) 29 1/2 రోజులు   3) 92 1/2 రోజులు   4) 29 రోజులు  (2)

12. ధ్రువ నక్షత్రం నావికులకు దేన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది? 

1) గెలాక్సీ  2) గాలి  3) దిక్కు  4) వాతావరణం  (3)

13. ఒక కాంతి సంవత్సరం (కి.మీ.లలో)? 

1) 3 ×104 × 60 × 60 ×24 × 365.25  2) 3 × 102 × 60 × 60 × 24 × 365.25  

3) 3 × 105 × 60 × 60 × 24 × 365.25  4) 3 ×103 × 60 × 60 × 24 × 365.25    (4)

14. నక్షత్రాలు కాంతిని నలుదిశలకు వెదజల్లా లంటే వాటిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత? 

1) 10 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  2) 5 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  

3) 5 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  4) 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  (4)

15. 1994లో విజయవంతంగా ప్రయోగించిన భారతీయ ఉపగ్రహ నౌక? 

1) ఇన్‌శాట్-1బి  2) పీఎస్‌ఎల్‌వీడీ-2  3) భాస్కర-2  4) ఆర్యభట్ట   (2)

16. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం?

1) 149,000,000 కి.మీ.  2) 149,598,500 కి.మీ.  3) 149,593,300 కి.మీ  4) 149,895,500 కి.మీ.  (2)

17. ఏ అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు? 

1) స్కాటర్‌‌న - 5, స్కాటర్‌‌న - 6  2) అపోలో - 11, సోయూజ్-టీ-11  

3) వైకింగ్-1, వైకింగ్-2  4) సోయూజ్ -టీ-11, శాల్యూట్  (3)

18. బుధ గ్రహం పరిభ్రమణ కాలం? 

1) 88 రోజులు  2) 248 రోజులు 3) 365 రోజులు  4) 243 రోజులు   (1)

19. స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేసిన రోజు? 

1) 3-6-1984  2) 3-4-1984  3) 3-4-1985  4) 3-6-1985  (2)

20. భూమధ్య రేఖ వద్ద భూమి వ్యాసం కి.మీ.లలో?

1) 12,576  2) 12,657  3) 12,756  4) 12,765   (3)

21. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో ద్రవ్యరాశిలో రెండో స్థానంలో ఉన్న గ్రహం, ఆత్మభ్రమణ కాలం అన్నింటి కంటే ఎక్కువ ఉన్న గ్రహం వరుసగా? 

1) బృహస్పతి, భూమి  2) బుధుడు, అంగారకుడు  3) శని, శుక్రుడు  4) నెప్ట్యూన్, యురేనస్  (3)

22. స్పేస్ ప్రోబ్‌కు ఉదాహరణ? 

1) పయనీర్  2) ఆర్యభట్ట  3) భాస్కర - 2  4) అట్లాంటిస్  (1)

23. ఏ గ్రహం మీద ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడిన వాతావరణం ఉంది? 

1) కుజుడు   2) బుధుడు  3) బృహస్పతి  4) యురేనస్    (1)    


Sunday, July 24, 2022

పోటీ పరీక్షల ప్రత్యేకం - భౌగోళిక శాస్త్రం - ద్వితీయ భూస్వరూపాలు

 పోటీ పరీక్షల ప్రత్యేకం - భౌగోళిక శాస్త్రం - ద్వితీయ భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలోని భూభాగాన్ని ప్రధానంగా ఏ విధంగా విభజించారు?

జ. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు

2. సముద్రమట్టం నుంచి సుమారు 800 మీ. కన్నా ఎత్తుగా ఉండి, వాలు ఎక్కువగా ఉండే భూస్వరూపాన్ని ఏమంటారు?

జ. పర్వతం

3. ఆల్ఫ్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

జ. ఐరోపా

4. అట్లాస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

జ. ఆఫ్రికా

5. భూఅంతర్భాగంలో సంపీడన బలాలు పని చేయడం వల్ల ఏర్పడే పర్వతాలు?

జ. ముడుత పర్వతాలు

6. ముడుత పర్వతాలకు ఉదాహరణ?

జ. ఆసియాలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండిస్, ఉత్తర అమెరికాలో రాకీ

7. భూఅంతర్భాగంలో విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుచించుకుపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?

జ. ఖండ పర్వతాలు

8. ఖండ పర్వతాలపై ఉన్న భూభాగాన్ని ఏమంటారు?

జ. భ్రంశోద్ధి శిలా విన్యాసం

9. ఖండ పర్వతాల్లో లోపలికి కుచించుకుపోయిన భాగాన్ని ఏమంటారు?

జ. గ్రేబెల్

10. భూఅంతర్భాగం నుంచి లావా బయటకు ప్రవహించి భూమి ఉపరితలంపై విస్తరించడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?

జ. అగ్ని పర్వతాలు

11. కిలిమంజారో అగ్ని పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?

జ. మధ్య ఆఫ్రికా

12. ఇటలీలోని ప్రముఖ అగ్ని పర్వతం?

జ. వెసూవియస్

13. ప్యూజియామా అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?

జ. జపాన్

14. పీఠభూమి అంచుల్లో ఏర్పడ్డ అగ్ని పర్వతాలకు ఉదాహరణ?

జ. ఆగ్నేయ ఆఫ్రికాలోని డ్రాకన్‌‌సబర్‌‌గ పర్వతాలు, ఇండియాలోని వింధ్య సాత్పూర పర్వతాలు

15. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం చాలా ఎత్తుగా ఉన్న పర్వతాలు క్రమేణా వికోషీకరణం చెంది ఎత్తును, పరిమాణాన్ని కోల్పోగా మిగిలిన పర్వతభాగాన్ని ఏమంటారు?

జ. అవశిష్ట పర్వతం

16. అవశిష్ట పర్వతానికి మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని ఆరావళి పర్వతాలు

17. సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తులో ఉండి కొద్దిపాటి ఎత్తు పల్లాలతో ఇంచుమించు సమతల ఉపరితలం గల భూస్వరూపం?

జ. పీఠభూమి

18. పర్వతాలతో పరివేష్టితమై ఉన్న పీఠభూముల్ని ఏమంటారు?

జ. పర్వతాంతర పీఠభూములు

19. ఏ రకమైన పీఠభూములు మిగతా వాటి కంటే చాలా ఎత్తులో ఉంటాయి?

జ. పర్వతాంతర పీఠభూములు

20. పర్వతాంతర పీఠభూములకు మంచి ఉదాహరణ?

జ. హిమాలయాలకు ఉత్తరంగా ఉన్న టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి

21. పర్వతాల దిగువున వాటి పాదాల దగ్గర ఏర్పడే పీఠభూములు?

జ. పర్వత పాద పీఠభూములు

22. పర్వత పాద పీఠభూములకు ఓవైపు పర్వతాలుంటే మరోవైపు ఉండేవి?

జ. మైదానాలు (లేక) సముద్రాలు

23. భూమి అంతర్భాగంలో జనించే ఊర్ద్వ బలాల వల్ల పైకి తన్నుకురావడం వల్ల ఏర్పడ్డ పీఠభూములు?

జ. పర్వత పాద పీఠభూములు

24. పర్వత పాద పీఠభూములకు మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి

25. తక్కువ వాలును కలిగి సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండే పీఠభూమి?

జ. ఖండాంతర పీఠభూమి

26. ఖండాంతర పీఠభూమికి మంచి ఉదాహరణ?

జ. ఉత్తర అమెరికాలోని అపలేషియన్ పీఠభూమి

27. సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండి ఉపరితలం సమతలంగా ఉన్న భూభాగం?

జ. మైదానం

28. సముద్రమట్టాన్ని ఆనుకొని ఉన్న మైదానాలు?

జ. తీర మైదానాలు

29. తీర మైదానాలకు మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం

30. గాలి, నీరు, హిమానీ నదాల కోతకు గురై ఎత్తు తగ్గడం వల్ల ఏర్పడ్డ మైదానాలు?

జ. కోత మైదానాలు

31. కోత మైదానాలకు మంచి ఉదాహరణ?

జ. కెనడాలోని షీల్డు, రష్యాలోని పశ్చిమ సైబీరియా

32. గాలి, నదులు, హిమానీ నదాల ద్వారా మోసుకొనిపోయిన ఒండ్రుమట్టి, ఇసుక,గుళక రాళ్లతో ఏర్పడిన మైదానాలు?

జ. నిక్షేపిత మైదానాలు.

33. నిక్షేపిత మైదానానికి మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని గంగా సట్లెజ్ మైదానం

Tuesday, January 4, 2022

వాతావరణం - జలావరణం - భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు

 వాతావరణం - జలావరణం - భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు

1. వాతావరణం అంటే?

జ. భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుపొర

2. వాతావరణాన్ని ఏ విధంగా విభజించారు?

జ. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం

3. వాతావరణంలో ఎక్కువ సాంద్రత కలిగిన పొర?

జ. ట్రోపో ఆవరణం

4. ట్రోపో ఆవరణ మందం భూమి ఉపరితలం నుంచి?

జ. 8 నుంచి 18 కి.మీ. ఎత్తు వరకు

5. ట్రోపో ఆవరణం మందం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?

జ. భూమధ్యరేఖా ప్రాంతం

6. వాతావరణంలో జరిగే అనేక రకాల మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి?

జ. ట్రోపో ఆవరణం

7. పగలు సూర్యతాపం నుంచి, రాత్రి భూమి ఉపరితలంపై తగిన వేడిని నిలిపి జీవరాసులని రక్షిస్తున్న పొర?

జ. ట్రోపో ఆవరణం

8. మేఘాలు, అవపాతం ఏ పొరలో ఏర్పడుతున్నాయి?

జ. ట్రోపో ఆవరణం

9. ట్రోపో ఆవరణానికి, ఐనో ఆవరణానికి మధ్య ఉండే పొర?

జ. స్ట్రాటో ఆవరణం

10. స్ట్రాటో ఆవరణం ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

జ. 80 కి.మీ.

11. స్ట్రాటో ఆవరణం ప్రత్యేకత?

జ. విమానాలు ఈ పొరలోనే ప్రయాణం చేస్తాయి

12. వాతావరణంలో అన్నిటికన్నా పైన ఉండే పొర?

జ. ఐనో ఆవరణం

13. ఐనో ఆవరణం ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది?

జ. 1050 కి.మీ.

14. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసే పొర?

జ. ఐనో ఆవరణం

Monday, January 3, 2022

భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు

 భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు 

1. భారతదేశానికి దక్షిణ సరిహద్దు?

జ. కన్యాకుమారి అగ్రం

2. రెండు భూభాగాలని కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేసే సన్నని భూభాగం?

జ. భూసంధి

3. భారతదేశంలో పగులు లోయలో ప్రవహించే నదులు?

జ. నర్మద, తపతి

4. భూసంధులకు ఉదాహరణలు?

జ. పనామా, సూయజ్

5. భూ అంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపైన ఉన్న రెండు సమాంతరభ్రంశాల మధ్య ఉన్న భూభాగం కిందికి జారిపోవడంతో ఏర్పడ్డ భూభాగాన్ని ఏమంటారు?

జ. పగులు లోయ

6. ఒక భూభాగపు చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్లు ఉంటే దాన్ని ఏమంటారు?

జ. అగ్రం

7. నయగారా జలపాతం ఏ ఖండంలో ఉంది?

జ. ఉత్తర అమెరికా

8. ఆఫ్రికా ఖండపు దక్షిణపు చివరి కొన?

జ. గుడ్‌హోప్ అగ్రం

9. నదీ ప్రవాహ జలం ఎత్తై ప్రాంతం నుంచి అగాధదరి కిందకు పడే ప్రదేశాన్ని ఏమంటారు?

జ. జలపాతం

10. అట్లాంటిక్ మహాసముద్రంలోని రిడ్జ్?

జ. మిడ్ ఓషనిక్ రిడ్జ్ 

11. అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూస్వరూపం ఏర్పడుతుంది?

జ. ఎడారి

12. సముద్ర అంతర్భాగంలో భూతలంపై ఉండే పర్వత శిఖరాన్ని ఏమంటారు?

జ. రిడ్జ్ 

13. సముద్రానికి ఆనుకొని ఉండే భూభాగం?

జ. తీరం

14. మన్నార్ సింధుశాఖ ఏ దేశాల మధ్య ఉంది?

జ. భారత్, శ్రీలంక

15. సన్నని లోతైన భూతలాన్ని ఏమంటారు?

జ. లోయలు

16. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందిన అర్థచంద్రాకార భూస్వరూపాన్ని ఏమంటారు?

జ. అఖాతం

17. నదీ ప్రవాహం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడ్డ లోతైన లోయను ఏమంటారు?

జ. అగాధదరి

18. నదులు సముద్రంలో కలిసే ప్రాంతం?

జ. నదీ ముఖద్వారం

19. సూయజ్ కాలువ వేటిని కలుపుతుంది?

జ. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం

20. నదీ ముఖద్వారం వద్ద సముద్రాన్ని కలిసే ముందు నది రెండు లేక మూడు పాయలుగా చీలినపుడు ఆ పాయల మధ్య ఉండే ప్రాంతం?

జ. డెల్టా

22. రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ, రెండు విశాల భూభాగాలను వేరు చేసే సన్నని సముద్ర భాగాన్ని ఏమంటారు?

జ. జలసంధి

22. కృష్ణా, గోదావరి డెల్టాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?

జ. ఆంధ్రప్రదేశ్

23. ఖండ అంతర్భాగంలో ఉన్న నదీ జల భాగాన్ని ఏమంటారు?

జ. సరస్సు

24. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన సరస్సు?

జ. కొల్లేటి సరస్సు

25. రవాణా, నీటి పారుదలకు తవ్వి కృత్రిమంగా ఏర్పాటు చేసిన జలమార్గం?

జ. కాలువ

26. ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు?

జ. సింధు శాఖ

27. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అగాధ దరి

జ. అమెరికాలోని కొలరాడో

Friday, September 10, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - భూగోళ శాస్త్రం - సౌర కుటుంబం

పోటీ పరీక్షల ప్రత్యేకం - భూగోళ శాస్త్రం - సౌర కుటుంబం   

1. భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం?

జవాబు. సూర్యుడు

2. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?

జవాబు. 8 నిమిషాలు

3. భూమి ఆకారానికి మంచి నమూనా?

జవాబు. గ్లోబు(Globe)

4. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం?

జవాబు. చంద్రుడు

5. గ్రహాల పరిమాణంలో భూమి స్థానం?

జవాబు. ఐదు

6. బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు?

జవాబు. బాహ్యగ్రహాలు

7. భూమికి, చంద్రుడికి మధ్య దూరం?

జవాబు. 3,84,365 కి.మీ.

8. భూమి సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది?

జవాబు. 149.4 మిలియన్ కిలో మీటర్లు

9. దూరాన్ని బట్టి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమి ఎన్నో స్థానంలో ఉంది?

జవాబు. 3వ స్థానం

10. సూర్యుడి ఉపరితలం, కేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు వరుసగా?

జవాబు. 6000°C, 1,00,000°C

11. పాలవెల్లికి మరో పేరు?

జవాబు. ఆకాశగంగ, పాలపుంత

12. ఉపగ్రహాలు అంటే?

జవాబు. గ్రహాల చుట్టూ తిరిగే చిన్న గోళాలు

13. ప్రతి 15 రోజుల కాలంలో చంద్రుడి పరిమాణం క్రమంగా తగ్గుతూ తిరిగి 15 రోజులు పెరుగుతూ ఉండడాన్ని ఏమంటారు?

జవాబు. చంద్రకళలు

14. సూర్యుని చుట్టూ తిరిగో గోళాలను ఏమంటారు?

జవాబు. గ్రహాలు

15. సౌరకుటుంబం అంటే?

జవాబు. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు

16. ఉపగ్రహాలు లేని గ్రహాలు?

జవాబు. బుధుడు, శుక్రుడు

17. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు అనేవి?

జవాబు. అంతరగ్రహాలు

18. పాలవెల్లి అంటే?

జవాబు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం

19. భూమికి అతి దగ్గరలో ఉన్న గ్రహం?

జవాబు. బుధుడు

20. గ్రహాలన్నింటిలో అతి పెద్దది?

జవాబు. బృహస్పతి

21. భూమి ఏ ఆకారంలో ఉంది?

జవాబు. గోళాకారం

22. లఘుగ్రహాలు అంటే

జవాబు. సౌరకుటుంబంలో మన కంటికి కనబడని చిన్న చిన్న శిలా శకలాలు

23. ఒక గ్రహం చుట్టూ పరిభ్రమించే మానవ నిర్మిత యంత్ర పరికరమే?

జవాబు. కృత్రిమ ఉపగ్రహం

24. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి ఆరో స్థానంలో ఉన్న గ్రహం?

జవాబు. శని

25. సూర్యగోళం భూమి కంటే ఎంత పెద్దది?

జవాబు. 1.3 రెట్లు

Thursday, June 24, 2021

భూమి - ఆవరణాలు - గ్రహణాలు కు సంబంధించిన ముఖ్య ప్రశ్నలు

భూమి - ఆవరణాలు - గ్రహణాలు కు సంబంధించిన ముఖ్య ప్రశ్నలు 

 1. భూమి ఉపరితలంపై ఉన్న రాతి పొర?

జ. శిలావరణం (లేక) ఆశ్మావరణం

2. జలావరణంలో భాగమైనవి?

జ. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, ఇతర జలభాగాలన్నీ

3. వాతావరణం అంటే?

జ. భూమిని ఆవరించి ఉన్న గాలి పొర

4. జీవావరణం అంటే?

జ. అడవులు, పంటలు, జంతువులు, పక్షులు మొదలైన జీవరాశులు

5. పర్యావరణం అంటే?

జ. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అన్నీ కలిప

6. వాతావరణంలో నైట్రోజన్ శాతం?

జ. 78.08%

7. వాతావరణంలో ఆక్సిజన్ శాతం?

జ. 20.94%

8. వాతావరణంలో అయాన్ శాతం?

జ. 0.93%

9. వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం?

జ. 0.03%

10. వాతావరణంలో హైడ్రోజన్, నియాన్, హీలియం శాతం?

జ. 0.02%

11. లిథోస్ అంటే?

జ.శిల........Lithosphere - శిలావరణం

12. అట్‌మోస్ అంటే?

జ. ఆవిరి.........Atmosphere - వాతావరణం

13. హదర్ అంటే?

జ.నీరు.........Hydrosphere - జలావరణం

14. బయో (BiO) అంటే?

జ.జీవం .........Biosphere - జీవావరణం

15. సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వచ్చినపుడు ఏర్పడే గ్రహణం?

జ. చంద్ర గ్రహణం

16. భూమి మీద సూర్యకిరణాలు పడకుండా ఉండే సగభాగాన్ని (నీడ) ఏమంటారు?

జ. ప్రచ్ఛాయ

17. నీడ చుట్టూ ఉండే భాగాన్ని ఏమంటారు?

జ. పాక్షిక ఛాయ

18. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

జ. పౌర్ణమి రోజు చంద్రుడు ప్రచ్ఛాయలోకి వచ్చినప్పుడు

19. చంద్రుడి కక్ష్యతలం భూమి కక్ష్య తలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది?

జ. 5° 9’

20. ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడదు?

జ. చంద్రుడు ప్రచ్ఛాయలోకి పూర్తిగా రాకపోవడం వల్ల

21. సూర్యుడు కనిపించకుండా భూమికి చంద్రుడు అడ్డు వస్తే ఏర్పడే గ్రహణం?

జ. సూర్యగ్రహణం

22. చంద్రుడి నీడ ఉన్న భాగంలో ఏర్పడే సూర్యగ్రహణం?

జ. సంపూర్ణ సూర్యగ్రహణం

23. చంద్రుడి నీడ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే సూర్యగ్రహణం

జ. పాక్షిక సూర్యగ్రహణం

24. ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఎందుకు ఏర్పడదు?

జ. చంద్రుడి నీడ భూమిపై పడకపోవడం వల్ల

Thursday, June 3, 2021

భౌగోళిక శాస్త్ర ముఖ్య ప్రశ్నలు - అక్షాంశాలు - రేఖాంశాలు

భౌగోళిక శాస్త్ర ముఖ్య ప్రశ్నలు - అక్షాంశాలు - రేఖాంశాలు 

1. భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశం వద్ద నిర్ణయించారు?

జ. 82 1/2° తూర్పు రేఖాంశం

2. ఉత్తర, దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూగోళంపై గీసిన వృత్తం పేరు?

జ. భూమధ్యరేఖ

3. అక్షాంశాలను ఏ విధంగా పిలుస్తారు?

జ. సమాంతర రేఖలు

4. అక్షాంశాల్లో అతి పెద్ద వృత్తం?

జ. భూమధ్యరేఖ

5. 23 1/2° ఉత్తర అక్షాంశ రేఖ?

జ. కర్కటరేఖ

6. 66 1/2° ఉత్తర అక్షాంశ రేఖ?

జ. ఆర్కిటిక్ వలయం

7. 23 1/2° దక్షిణ అక్షాంశ రేఖ?

జ. మకరరేఖ

8. 0° అక్షాంశం అని దేనిని అంటారు?

జ. భూమధ్యరేఖ

9. మొత్తం అక్షాంశాల సంఖ్య?

జ. 180

10. భూమధ్యరేఖకు సమాంతరంగా ఉత్తర, దక్షిణ ధృవాల వరకు గీసిన వలయాకార ఊహారేఖలు?

జ. అక్షాంశాలు

11. 90° దక్షిణ అక్షాంశ రేఖ?

జ. దక్షిణ ధృవం

12. 66 1/2° దక్షిణ అక్షాంశరేఖ?

జ. అంటార్కిటిక్ వలయం

13. గ్రీనిచ్‌రేఖ నుంచి తూర్పుగా 180° రేఖాంశం వరకు ఉన్న అర్థగోళం?

జ. పూర్వార్థ గోళం (లేక) తూర్పు అర్థగోళం

14. ఒక డిగ్రీ రేఖాంశాన్ని దాటడానికి సూర్యుడికి పట్టే సమయం?

జ. 4 నిమిషాలు

15. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలని ఎందుకు అంటారు?

జ. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాలోనూ ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. ఒకే సమయాన్ని సూచిస్తుంది.

16. ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధృవం వరకు, అంటార్కిటిక్ వలయం నుంచి దక్షిణ ధృవం వరకు ఉన్న ప్రాంతం?

జ. అతి శీతల ధృవ మండలం

17. 90° ఉత్తర అక్షాంశరేఖ?

జ. ఉత్తర ధృవం

18. రేఖాంశాలకు మరో పేరు?

జ. మధ్యాహ్న రేఖలు

19. రేఖాంశాల వల్ల ప్రధాన ఉపయోగం?

జ. వివిధ ప్రదేశాల సమయాల్లోని తేడాలను తెలుసుకోవడం

20. రేఖాంశాల్లో ప్రారంభరేఖ?

జ. 0° రేఖాంశం (లేక) గ్రీనిచ్‌రేఖ

21. కర్కటరేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు, మకరరేఖ నుంచి అంటార్కిటిక్ వలయం వరకు ఉన్న ప్రాంతం?

జ. సమ శీతోష్ణ మండలం

22. మొత్తం రేఖాంశాల సంఖ్య?

జ. 360

123. ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్యరేఖకు లంబంగా, భూమధ్యరేఖను ఖండిస్తూ భూమి చుట్టూ నిలువుగా గీసిన ఊహారేఖలు?

జ. రేఖాంశాలు

24. అక్షాంశాలు, రేఖాంశాల ఉమ్మడి ఉపయోగం?

జ. ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవచ్చు

25. ఇంగ్లండ్ దేశంలోని ఏ నది మీదుగా గ్రీనిచ్‌రేఖ వెళ్తుంది?

జ. థేమ్స్

26. అక్షాంశాల వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమిటి?

జ. ఒక ప్రదేశపు శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు.

27. గ్రీనిచ్ రేఖ నుంచి పశ్చిమంగా 180° రేఖాంశం వరకు ఉన్న అర్థగోళం?

జ. పశ్చిమార్థ గోళం

28. సూర్యకిరణాలు ఏ రేఖలను దాటి లంబంగా పడవు?

జ. కర్కటరేఖ, మకరరేఖ

29. భూమధ్యరేఖ నుంచి ఉత్తరంగా కర్కటరేఖ వరకు, దక్షిణంగా మకరరేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?

జ. అత్యుష్ణ మండలం

Friday, December 7, 2018

Rajasthan GK Questions with Answers for Competitive Exams

1. రాజస్థాన్ లోని ఏ ప్రాంతంలో సింధునాగరికత అవశేషాలు ఉన్నాయి? - (కాలిబాన్)

2. రాజస్థాన్ రాష్ట్రంలో డిసర్డ్ నేషనల్ పార్క్ ఎక్కడ నెలకొల్పారు? - (జైసల్మేర్)

3. "బికనీర్, జోధ్ పూర్, టోంక్, బార్మేర్" జిల్లాల్లో సెంట్రల్ కేమెల్ బ్రీడింగ్ సెంటర్ ఉంది? - (జోధ్ పూర్)

4. రాజస్థాన్ లో జిల్లాల మొత్తం సంఖ్య? - (33)

5. దేశ జనాభాలో రాజస్థాన్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? - (7)

6. దేశ విస్తీర్ణంలో రాజస్థాన్  రాష్టం ఎన్నో స్థానంలో ఉంది? - (1)

7. రాజస్థాన్ కు ఏ దిక్కులో పాకిస్థాన్ సరిహద్దు గలదు? - (పశ్చిమాన)

8. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని ఏది? - (జైపూర్)

9. స్వాతంత్య్రం రాకమునుపు రాజస్థాన్ రాష్ట్రాన్ని బ్రిటిషర్లు ఏ విధముగా వ్యవహరించేవారు? - (రాజ్ పూటానా స్టేట్)

10. రాజస్థాన్ లో ఉన్న ఎడారి పేరు? - (థార్)

11. రాజస్థాన్ రాష్ట్ర అధికార భాష? - (హిందీ)

12. రాజస్థాన్ రాష్ట్రంలో అతిపెద్ద సరస్సు ఏది? - (సాంబర్ సాల్ట్ సరస్సు)

13. రాజస్థాన్ లో ఎత్తైన ప్రదేశం ఏది? - (గురుశిఖర్)

14. 1998లో అణుపరీక్షలు నిర్వహించిన ప్రదేశం పోఖ్రాన్ ఏ జిల్లాలో ఉంది? - (జైసల్మేర్)

15. ఉదయపూర్ ని ఏ మారుపేరుతో కూడా పిలుస్తారు? - (సిటి ఆఫ్ లేక్స్, వెనిస్ ఆఫ్ ఈస్ట్, వైట్ సిటీ)

16. జైపూర్ ని ఏ మారుపేరుతో కూడా పిలుస్తారు? - (పింక్ సిటీ)

17. జైపూర్ లో ఉన్న కోటలు? - (నహర్ గఢ్ పోర్ట్స్, జైగఢ్ పోర్ట్స్, అమేర్ పోర్ట్స్)

18. రాజస్థాన్ రాష్ట్రీయ పక్షి ఏది? - (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్)

19. "జోధ్ పూర్, జైసల్మేర్, బార్మర్, శ్రీ గంగానగర్" వీటిలో ఏ జిల్లాకి పాకిస్థాన్ తో సరిహద్దు  లేదు? - (జోధ్ పూర్)

20. కేయోలాడియా జాతీయ ఉద్యానవనం పూర్వపు పేరేమిటి? - (భరతపూర్ బర్డ్ శాంక్చరి)

21. వన్ కి ఆశా అని పిలిచే రాజస్థాన్ నది ఏది? - (బానస్ నది)

22. రాజస్థాన్ లో ఏ ప్రదేశాన్ని గోల్డెన్ సిటీగా అభివర్ణిస్తారు? - (జైసల్మేర్)

23. రాజస్థాన్ రాష్ట్రానికి ఏ ఇతర రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి? - (పంజాబ్)

24. రాజస్థాన్ రాష్ట్రానికి ఈశాన్య భాగంలో ఏ రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి? - (హర్యానా, ఉత్తరప్రదేశ్)

25. రాజస్థాన్ రాష్ట్రానికి నైరుతి భాగంలో ఏ రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి? - (గుజరాత్)

26. జాతీయ టైగర్ రిజర్వులు రాజస్థాన్ లో ఉండేవి? - (రణథంబోర్ నేషనల్ పార్కు, సరిస్క టైగర్ రిజర్వ్, ముకుంద్రా హిల్ టైగర్ రిజర్వ్)

27. రాజస్థాన్ లో మక్రానా పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది? - (మార్బుల్ (పాలరాయి))

28. రాజస్థాన్ అవతరణ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? - (మార్చి 30)

29. రాజస్థాన్ రాష్ట్రీయ జంతువు ఏది? - (చింకార జింక)

Thursday, November 1, 2018

The River System of India-G K Questions in Indian Geography

నదీ వ్యవస్థ 
1. "నర్మదా, చంబల్, సబర్మతి, కావేరి" లలో ప్రధాన నది కానిది ఏది? - (చంబల్)

2. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? - (నైలునది)

3. "నైలునది, సింధూ, అమెజాన్, డార్లింగ్" లలో పరస్థానీయ నది కానిది ఏది? - (అమెజాన్)

4. భారతదేశంలో అతి పొడవైన ఉపనది? - (యమున)

5. "నర్మదా, సువర్ణరేఖ, తపతి, శరావతి" లలో భిన్నంగా ఉండేది ఏది? - (సువర్ణరేఖ)

6. సింధూ నది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం? - (థాంచోక్)

7. "ఆస్కిని, ష్యోక్, గిల్లేట్, శతుద్రి" లలో సింధూనది పర్వత ప్రాంత ఉపనది ఏది? - (ష్యోక్, గిల్లేట్)

8. గంగానదిలో నివసించే డాల్ఫీన్స్ జాతి ఏది? - (సు - సు)

9. భారత్ - పాక్ సరిహద్దు ద్వారా ప్రవహించే నది? - (జీలం)

10. చీనాబ్ నది జన్మస్థానమైన "బారాలప్పా" ఏ పర్వత శ్రేణిలో ఉంది? - (జస్కర్)

11. "బియాస్, సట్లెజ్, రావి, జీలం" లలో ఏ నదిని 'ఐరావతి, పరూషిణి' అనే పేర్లతో పిలుస్తారు? - (రావి)

12. సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది? - (షిష్కిలా)

13. భారత్ లో మాత్రమే ప్రవహించే సింధూ ఉపనది? - (బియాస్)

14. మూడు దేశాలు (టిబెట్, పాక్, ఇండియా) ద్వారా ప్రవహించే సింధూ ఉపనది? - (శతుద్రి)

15. మానస సరోవర్ కు దగ్గరగా జన్మించిన నది ఏది? - (సింధూ)

16. భారతదేశంలోని ప్రధాన నదుల ద్వారా ప్రవహించే నీటిశాతం? - (85%)

17. వరద కాలువలు ఎక్కువగా కలిగిన నది? - (సట్లెజ్)

18. అతిపెద్ద అంతర్భుభాగ నది ఏది? - (ఘగ్గర్)

19. దేశంలో అత్యధిక ప్రాజెక్టులను కలిగిన నది ఏది? - (నర్మదా)

20. "దిబ్రుగఢ్" నగరం ఏ నది ఒడ్డున ఉంది? - (బ్రహ్మపుత్ర)

21. గంగానదికి గల మరొక పేరు?  - (కర్మనాసా నది)

22. హిమాలయాల్లో పుట్టి గంగానదికి కుడివైపున కలిసే ఏకైక ఉపనది? - (యమునా)

23. భారతదేశం గుండా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతిపెద్ద నది? - (సింధూ)

24. బ్రహ్మపుత్రా నది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం? - (జిథోలా)

25. 1887 కంటే ముందు గంగానదికి ఉపనదిగా ఉండి ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా ప్రవహిస్తున్న నది? - (టీస్టా)

26. భారతదేశములో అత్యధికంగా అక్ భౌ (ఎద్దడుగు) సరస్సులను ఏర్పరిచే నది? - (బ్రహ్మపుత్ర)

27. ఎర్రనది అని ఏ నదిని పిలుస్తారు? - (బ్రహ్మపుత్ర)

28. "శరావతి, వరాహ, మాండవి, బ్రాహ్మిణి" నదుల్లో భిన్నంగా ఉండే నది ఏది? - (బ్రాహ్మిణి నది)

29. "అలకానంద, గోమతి, రావి, రామ్ గంగ" లలో పూర్వవర్తిత నది ఏది? - (అలకానంద)

30. నర్మదానది చెలికత్తె ఏది? - (తపతి)

31. "కావేరి, సోన్ నది, భీమ, కృష్ణా" నదులను వాటి జన్మ స్థానాల ఆధారంగా దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి? - (కావేరి, కృష్ణా, భీమ, సోన్ నది)

32. భారతదేశములో అతిపురాతన నది ఏది? - (గోదావరి)

33. భారతదేశములో అతి నవీన నది ఏది? - (గంగా)

34. విదీర్ణ ధరి గుండా ప్రవహించే నదులు? - (నర్మద, తపతి, దామోదర్)

35. ఐదున్నర దశాబ్దాల తర్వాత 2017 సెప్టెంబర్ 17 న పూర్తయి జాతికి అంకితం చేసిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? - (నర్మదా)

36. ప్రపంచంలో అతిపెద్ద అంతర్భుభాగ నది ఏది? - (ఓల్గా)

37. పుష్కర్ సరస్సు గుండా ప్రయాణించే నది? - (లూని)

38. కపిలాధార, సహస్రధార జలపాతాలు ఏ నదిపై ఉన్నాయి? - (నర్మదా)

39. జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? - (శరావతి)

40. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? - (దామోదర్)

41. గోమతినది ఒడ్డున ఉన్న భారతీయ నగరం? - (లక్నో)

42. ఇండియా నేపాల్ సరిహద్దుల ద్వారా ప్రవహించే నది? - (శారద)

43. క్షీప్రానది ఒడ్డున గల నగరం? - (ఉజ్జయినీ)

44. అలియా బెట్ దీవి ఏ నది ముఖద్వారం వద్ద ఉంది? - (నర్మదా)

45. బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న నదీ పరివాహక ప్రాంతం? - (దామోదర్)

46. సాగరమతి అని ఏ నదిని పిలుస్తారు? - (లూని)

Tuesday, September 25, 2018

General Knowledge in Telangana Police Constable Study Material # 2

1. ఎవరి అనుచరులు హైదరాబాద్ లో జయభేరి అనే పత్రికను ప్రచురించారు? - (అంబేద్కర్)

2.  సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని దేనిని పిలుస్తారు? - (పోచంపల్లి)

3. సాఫ్ట్ డ్రింక్ లో కలిపే తీపి పదార్థం? - (ఎస్సర్ టేమ్)

4. కరీంనగర్ జిల్లాలోని సిల్వర్ ఫిలిగ్రీ కళను పరిచయం చేసినవారు? - (కదర్ల రామయ్య)

5. సూర్యరశ్మి ద్వారా శరీరానికి లభించే విటమిన్? - (డి - విటమిన్)

6. కాలేయం ఉత్పత్తి చేసేది? - (యూరియా)

7. క్లోమం ఒక - ? (అంతః & బాహ్య శ్రావక గ్రంథి)

8. "ఒరైజా సటైవా" అనేది దేని శాస్త్రీయ నామం? - (వరి)

9. మనల్ని సజీవంగా ఉంచే O₂ కిరణజన్య సంయోగ క్రియ ఫలితం. అది దేని నుంచి లభిస్తుంది. ? - (నేల శోషించుకున్న కార్బోనేట్లు)

10. కాంతి సంవత్సరం దేనికి యూనిట్? - (దూరం)

11. www అంటే? - (world wide web)

12. విద్యుత్ పొటెన్షియల్ కి ప్రమాణం? - (ఓల్ట్)

13. ద్రవ పదార్థాలలో ఉత్తమ వాహకం? - (పాదరసం)

14. ప్రెషర్ కుక్కర్ లో వంట త్వరగా అవుతుంది. కారణం? - (నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది)

15. సంగీత కచేరీలలో ధ్వని? - (శోషణం చేసుకుంటుంది)

16. ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని దేనికి కలుపుతారు? - (జింక్)

17. ఇనుప బంతి దేనిలో తేలుతుంది?  - (పాదరసం)

18. ముడి చమురును విఘటన పరిచినపుడు ఉత్పత్తి అయ్యే వాయువు ఏది? - (LPG)

19. ఎరువుల ద్వారా మొక్కలకు అందే మూడు మూలకాలు? - (పొటాషియం, నైట్రోజన్ & ఫాస్ఫరస్)

20. భూపరివేష్ఠిత రాష్ట్రం ఏది? - (జార్ఖండ్)

21. గ్రీన్ విచ్ లో ఉదయం 10 గంటలు అయితే ఇండియాలో ఎంత సమయం అవుతుంది? - (3. 30 PM)

22. సింధు నదికి, ష్యోక్ నదికి మధ్య విస్తరించిన పర్వతశ్రేణి ఏది? - (లఢక్ శ్రేణి)

23. కాలింపాంగ్ ను లాసాతో కలిపే భారత్ - టిబెట్ రహదారి ఏ కనుమ నుంచి వెళ్తుంది? - (జెలెప్ లా)

24. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? - (తెలంగాణ)

25. భారతదేశంలో అత్యంత పురాతనమైన మాంగనీస్ గని ఏది? - (శ్రీకాకుళం)

26. వెండి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం? - (రాజస్థాన్)

27. తెలంగాణలో లభించే బొగ్గు ఏ రకానికి చెందింది? - (బిట్యుమినస్)

28. ఏ నదిని "మీనం బాకం" అని పిలుస్తారు? - (డిండి)

29. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ ను మార్చి 3 న ఎక్కడ ప్రారంభించారు? - (న్యూయార్క్)

30. 12 వ పంచవర్ష ప్రణాళిక కాలం? - (2012 - 17)

31. దేశములో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది? - (కేంద్ర గణాంక సంస్థ)

32. ప్రణాళిక సంఘం ప్రచురించే పత్రిక ఏది? - (యోజన)

33. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ట్రేడ్ మార్క్? - (గోల్కొండ లోగో)

34. 2016  మార్చి 9 న బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన దేశం?  - (ఇరాన్)

35. యూరప్ యుద్ధ భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? - (బెల్జియం)

36. ప్రపంచంలో రోబోలకు పౌరసత్వం జారీ చేసిన తొలి దేశం? - (సౌదీ అరేబియా)

37. మైత్రీ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏ దేశాలకు సంబంధించింది? - (భారత్ - బంగ్లాదేశ్)

Tuesday, September 18, 2018

Panchayat Secretary Study Material in Indian Geography

1. దేశంలో మొట్టమొదటి ఔషధ పరిశ్రమ ఏది?  - (పింప్రీ)

2. H M T ట్రాక్టర్ లను ఏ ప్రాంతంలో తయారు చేస్తారు? - (పింజోర్)

3. భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ? - (నూలు వస్త్ర పరిశ్రమ)

4. ఆకాశ్ మిస్సైల్ ను ఏ పరిశ్రమలో తయారు చేస్తారు? - (BEL)

5. సైకిల్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? - (లూథియానా)

6. పెన్సిలిన్ ను ఏ పరిశ్రమలో తయారు చేస్తారు? - (హెచ్ఎబిఎల్ పింప్రీ)

7. మొదటి కాగితం పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? - (సేరంపూర్)

8. ఈ వి ఎం లను ఏ పరిశ్రమలో తయారు చేస్తారు? - (ఇ సి ఐ ఎల్)

9. భారతదేశంలో పొడవైన రోడ్డు బ్రిడ్జ్ ఏది? - (భూపేన్ హజారికా సేతు)

10. పొడవైన రైల్,  రోడ్డు బ్రిడ్జ్ ? - (బిగిబిల్)

11. జాతీయ రహదారుల చట్టాన్ని ఎప్పుడు చేశారు? - (1956)

12. దేవీ అహల్యాబాయి ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది? - (ఇండోర్)

13. దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?  - (1904)

14. దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ బొగ్గు ఏది? - (బైలదిల్లా)

15. మొదటి బంగారు గని ఏది? - (రామసిరి గని)

16. కింబర్లి గనులు దేనికి ప్రసిద్ధి చెందినవి? - (వజ్రాలు)

17. రాగి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం? - (చిలీ)

18. అతిపెద్ద పెట్రోలియం బావి(ప్రపంచంలో)? - (అబుదాన్)

19. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? - (జాదుగూడ)

20. బగ్గాస్సే ను ఉపయోగించి రాకెట్ ఇంధనం తయారు చేసే చెక్కర పరిశ్రమ? - (తణుకు)

21. భారతదేశంలో ఎత్తైన రోడ్డు? - (లేహ్ - మనాలి)

22. ఇండో - పాక్ సరిహద్దును అనుసరిస్తూ వెళ్లే జాతీయ రహదారి?  - (NH - 15)

23. అతిచిన్న జాతీయ రహదారి?  - (NH - 47(A))

24. భారతదేశాన్ని రెండు అర్ధభాగాలుగా విభజించే జాతీయ రహదారి?  - (NH - 6)

25. గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఏది? - (అమృత్ సర్ - కలకత్తా)

26. తెలంగాణలో పొడవైన జాతీయ రహదారి?  - (NH - 44)

27. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రోడ్లను నిర్మించే సంస్థ?  - (బి ఆర్ ఒ)

28. భారతీయ రైల్వేల పితామహుడు? - (డల్హౌసీ)

29. వీల్స్ అండ్ యాక్సెల్స్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? - (ఎలహంక)

30. మొదటి గాజు పరిశ్రమను భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? - (ఫిరోజాబాద్)

31. అల్యూమినియం పరిశ్రమలను వేటికి దగ్గరగా ఏర్పాటు చేస్తారు? - (థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు)

32. మొదటి నూలు వస్త్ర పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు? - (1818)

33. సీసం ముడి ధాతువు ఏది? - (గెలీనా)

34. మైకాను ఏ పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు? - (ఎలక్ట్రానిక్ పరిశ్రమ)

35. తక్కువ ధరకే పేదలకు ఏసీ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు? - (గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్)

36. అత్యధిక దూరం ప్రయాణించే రైలు? - (వివేక్ ఎక్స్ ప్రెస్)

37. మొదటి మాంగనీస్ గని ఏది?   - (శ్రీకాకుళం)

38. మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఏది? - (పాల్వంచ)

39. తెలంగాణలో మొదటి పవర్ పరిశ్రమ ఏది? - (సిర్పూర్ కాగజ్ నగర్)

40. భారతదేశంలో అతిపురాతన ఇనుము - ఉక్కు పరిశ్రమ ఏది? - (టిస్కో)

41. తుంగ చాపలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? - (మహబూబ్ నగర్)

42. వజ్రాల ఉత్పత్తికి చెందిన గనులు? - (పన్నా గనులు)

43. బెరైటీస్ (ముగ్గురాయి) ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? - (ఆంధ్రప్రదేశ్)

44. డోలమైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? - (ఒడిశా)

45. మొదటి ఎరువుల పరిశ్రమ ఏది? - (సింద్రీ)

46. రూప్ నారాయణ్ దేనికి ప్రసిద్ధి? - (కేబుల్స్)

47. కొడెర్మి దేనికి ప్రసిద్ధి చెందింది? - (మైకా)

48. ఫియట్ కార్లను తయారు చేసే ప్రాంతం? - (ముంబై)

49. తాళాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? - (అలీఘర్)

50. కోలార్ గనులు దేనికి ప్రసిద్ధి చెందినవి? - (బంగారం)

51. వి. డి. సావర్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? - (పోర్టు బ్లెయిర్)

52. లిటిల్ జపాన్ అని దేనిని పిలుస్తారు? - (శివకాశి)

53. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? - (బెంగళూరు)

54. రాజస్సానీ విమానాశ్రయం ఎక్కడ ఉంది? - (అమృత్ సర్)

Tuesday, September 4, 2018

Panchayat Secretary/ Police/ V R O/ Group - 4 study material - Northern plains & plateau

ఉత్తర మైదానాలు - ద్వీపకల్ప పీఠభూమి 
1. చోటానాగపూర్ పీఠభూమికి - షిల్లాంగ్ పీఠభూమికి మధ్య ఉన్న ప్రాంతం ఏది? - (మాల్దా గ్యాప్)

2. చిల్కా సరస్సు ఏ మైదానాల్లో ఉంది? - (ఉత్కళ్ మైదానాలు)

3. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు? - (సుపీరియర్ సరస్సు)

4. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు? - (కాస్పియన్)

5. తెలంగాణలో ఎత్తైన జలపాతం ఏది? - (కుంతల)

6. ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన జలపాతం ఏది? - (డుడుమా)

7. భారతదేశంలో అతిపురాతన ముడుతపర్వతాలు? - (ఆరావళి)

8. నీలగిరి ప్రాంతంలోని జలపాతం? - (కలహట్టి)

9. భారత్ లో అతిపెద్ద చెలియలికట్ట కలిగిన నగరం? - (చెన్నై)

10. పర్వతాల అధ్యయనాన్ని ఏమంటారు? - (ఓరాలజి)

11. నాగరికతలకు ఊయలలు అని వేటిని పిలుస్తారు? - (మైదానాలు)

12. సరోవరీయ రాష్ట్రం ఏది? - (జమ్మూ కాశ్మీర్)

13. భారతదేశంలో "విదీర్ణ దరి లోయ" ఏ రెండు పర్వతాల మధ్య ప్రధానంగా విస్తరించి ఉంది?  - (నర్మదా - తపతి)

14. ఓవెన్ ప్రాక్చర్ జోన్ ఎందులో ఉంది? - (అరేబియా సముద్రం)

15. అన్నామలై పర్వతాల్లో తూర్పుగా ప్రవహించే నది? - (తామ్రపాణి)

16. "ఊటి" ఏ కొండల్లో విస్తరించి ఉంది? - (నీలగిరి)

17. కాకులు లేని నగరం? - (కొడైకెనాల్)

18. లుషాయి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? - (మిజోరం)

19. మహారాష్ట్ర పీఠభూమి వేటితో ఏర్పడింది? - (బసాల్టు)

20. బైలదిల్లా గని ఎక్కడ ఉంది? - (ఛత్తీస్ గఢ్)

21. ఝరియా గని ఎక్కడ ఉంది? - (జార్ఖండ్)

22. ఖేత్రీ గనులు ఎక్కడ ఉన్నాయి? - (రాజస్థాన్)

23. పన్నా గనులు ఎక్కడ ఉన్నాయి? - (మధ్య ప్రదేశ్)

24. షిల్లాంగ్ ఏ కొండల్లో ఉంది? - (కాశీ)

25.  బెంగళూరు నగరం సముద్రమట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? - (920 మీ)

26. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయం? - (5 AM)

27. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు కలిసే ప్రాంతం? - (అంబాల)

28. పశ్చిమ బెంగాల్ లో క్షామపీడిత ప్రాంతం? - (పురులియం)

29. కొండప్రాంతాల్లో వచ్చే వర్షప్రాంతాలను ఏ పేరుతో పిలుస్తారు? - (పర్వతీయ వర్షపాతాలు)

Friday, August 17, 2018

GK - Police / VRO/ Group - 4 Study Material in Geography # 2

1. భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య? - (247)

2. భారతదేశంలో అతిపెద్ద ద్వీప సముదాయం? - (అండమాన్ & నికోబార్)

3. "నన్ కోరి, బారెన్, కార్ నికోబార్, పిట్లీ" లలో అండమాన్ దీవులకు చెందని దీవి  ఏది? - (పిట్లీ)

4. లక్ష దీవులు ఏ రకానికి చెందినవి? - (పగడపు దీవులు)

5. "అండమాన్ దీవులు, లక్ష దీవులు, పాంబన్ దీవి, నికోబార్ దీవులు" లలో పర్యాటకులకు ఏ దీవుల్లోకి అనుమతి లేదు? - (నికోబార్ దీవులు)

6. అతిపెద్ద నదీ ఆధారిత దీవి? - (మజూలీ)

7. "శాండిల్ పీక్" ఎక్కడ ఉంది? - (ఉత్తర అండమాన్)

8. "సెయింట్ జార్జ్" దీవి ఎక్కడ ఉంది? - (గోవా తీరం)

9. దేశంలో అతిపొడవైన తీరరేఖ కలిగిన రాజకీయ విభాగం? - (అండమాన్ & నికోబార్)

10. దేశంలో అతి తక్కువ పొడవు కలిగిన తీరం? - (కెనరా  తీరం)

11. లాగూన్స్ అధికంగా ఉన్న తీరం? - (మలబారు తీరం)

12. దేశంలో అతిపొడవైన తీరరేఖ కలిగిన  నగరం? - (చెన్నై)

13. "గోవా" కి గల మరోపేరు?  - (రేవతి ద్వీపం)

14. ఇండియా - శ్రీలంక మధ్య ఉన్న శిలా ఉపరితల దీవి? - (పాంబన్)

15. లక్ష దీవుల్లో  అతి చిన్న దీవి? - (బిత్రా)

16. భారత్ - బాంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద దీవి? - (న్యూమోర్)

17. ముంబై నగరం ఏ దీవి సముదాయంలో అభివృద్ధి చెందింది? - (సాల్ శెట్టి)

18. ఇండియా - ఇండోనేషియా ను వేరుచేసే చానల్? - (గ్రేట్ చానల్)

19. బ్లూ ఫ్లాగ్ అవార్డ్ పొందిన బీచ్?  - (చంద్రభాగ)

20. నూతన సహస్రాబ్ది తొలి సూర్యకిరణాలు స్పృశించిన కచల్ దీవి ఏ ద్వీప సముదాయానికి చెందింది? - (నికోబార్)

21. భారత ప్రాదేశిక జలాల పరిధి? -  (12 నాటికల్ మైళ్లు)

22. ప్రపంచంలో అతి నవీన ముడత పర్వాతాలు ఏవి? - (హిమాలయాలు)

23. హిమాలయాలు ఏ యుగానికి చెందినవి?  - (టెర్షియరీ యుగం)

24. హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడినవి? - (అవక్షేప శిలలు)

25. భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న వేసవి విడిది కేంద్రం? - (గుల్ మార్గ్)

26. "డూన్" లను బెంగాల్ లో ఏమని పిలుస్తారు? - (తాల)

27. పురాతన కాలపు సిల్క్ మార్గం ఏ కనుమ నుంచి వెళ్లేది? - (నాథులా)

28. హిమాలయాల్లో మొదటిగా ఏర్పడిన శ్రేణి? - (హిమాది)

29. "Back Bone Of Asia"  అని ఏ పర్వతశ్రేణిని పిలుస్తారు? - (కారాకోరం)

30. లోయలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు? - (హిమాచల్)

31. సిమ్లా నగరం ఏ పర్వతశ్రేణి మీద ఉంది? - (దౌల్ దార్)

32. రాక్ గార్డెన్ ఎక్కడుంది? - (చండీగఢ్)

33. పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం? - (సారామతి)

34. ముంబై నగరానికి నీరందించే సరస్సు? - (ఉజ్ని)

35. "లే" ను చేరుకోవడానికి గల ఏకైక రహదారి మార్గం ఏ కనుమ నుంచి వెళ్తుంది? - (జోజిలా)

36. "వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్" ఏ రాష్ట్రంలో ఉంది? - (ఉత్తరా ఖండ్)

37. వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి? - (హిమాచల్)

38. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దానిని కనుగొనక ముందు ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా దేనిని పరిగణించేవారు? - (కాంచన గంగ)

39. మకాలు, మనస్లూ శిఖరాలు ఏ పర్వతశ్రేణిలో విస్తరించి ఉన్నాయి? - (హిమాద్రి)

40. మహాభారత శ్రేణి ఎక్కడ ఉంది? - (నేపాల్)

41. కశ్మీర్ లోయ ఏ రెండు పర్వతశ్రేణుల మధ్య విస్తరించి ఉంది? - (పీర్ పంజల్ - హిమాద్రి)

42.  ప్రపంచంలో అత్యంత ఎత్తైన  యుద్ధ క్షేత్రం సియాచిన్ ఏ పర్వతశ్రేణిలో ఉంది? - (కారాకోరం)

43. ఉదంపూర్ డూన్ ఏ రాష్ట్రంలో ఉంది? - (జమ్మూ & కాశ్మీర్)

44. చంద్రలోయ ఏ రాష్ట్రంలో ఉంది? - (హిమాచల్ ప్రదేశ్)

45. గౌరీశంకర్ శిఖరం ఏ పర్వతాల్లో ఉంది? - (హిమాలయాలు)

46. భారతదేశంలో అతి పొడవైన హిమనీ నది? - (సియాచిన్)

47. స్విట్జర్లాండ్ ఆఫ్ పాకిస్థాన్ అని ఏ లోయను పిలుస్తారు? - (స్వాత్ లోయ)

48. భారతదేశంలో ఎత్తైన శిఖరం? - (కె 2)

Monday, August 6, 2018

GK - Police / VRO/ Group - 4 Study Material in Geography

1. విపత్తును ఇంగ్లిష్ లో Disaster అంటారు.  గ్రీకు భాషలో Dus అంటే దుష్ట అని, aster  అంటే నక్షత్రం (దుష్ట నక్షత్రం) అని అర్థం.

2. సునామీ అనే పదం జపాన్ భాష నుంచి సేకరించారు. Tsu అనగా ఓడరేవు అని, nami అనగా " రాకాసి అల" అని అర్థం.

3. సైక్లోన్ అనే పదం "సైక్లోన్" అనే గ్రీకు భాష నుండి పుట్టింది. సైక్లోన్ అంటే "పాముచుట్ట" అని అర్థం.

4. ఇప్పటివరకు సంభవించిన అతి పెద్ద సైక్లోన్ - టైఫూన్. ఇది వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో 1994 లో ఏర్పడింది.

ప్రదేశము                                              చక్రవాకం పేరు 
ఇండియా                                               సైక్లోన్
ఎడారులు                                             సైమూన్
ఆస్ట్రేలియా                                          విల్లీ విల్లీ
దక్షిణ అమెరికా                                    టోర్నడో
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం     హరికేన్
ఈశాన్య పసిఫిక్ మహాసముద్రం          హరికేన్
వాయువ్య పసిఫిక్ మహాసముద్రం         టైఫూన్

5. భారతదేశంలో ఎక్కువగా పెను తుపానులకు గురయ్యే రాష్ట్రం - (ఒడిశా)

6. పశ్చిమ తీరంలో  ఎక్కువగా పెను తుపానులకు గురయ్యే రాష్ట్రం - (గుజరాత్)

కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు - సమాధానాలు 
1. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుంది? - (హోనాలులు)

2. అమెచ్యూర్ రేడియోకి మరోపేరు? - (హామ్ రేడియో)

3. విపత్తును రకాలుగా వర్గీకరించడానికి ఆధారం? - (దాని వేగం)

4. ప్రపంచ విపత్తులో ఎంత శాతం భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం  ఉంది? - (ఎనిమిది)

5. 1957 లో National Civil Defence College ని ఎక్కడ స్థాపించారు? - (నాగపూర్)

6. భూపాతాలు దేనివల్ల సంభవిస్తాయి?  -(అడవుల నరికివేత)

7. సీడర్ అనే తుఫాన్ బంగ్లాదేశ్ ను ఎప్పుడు తాకింది? - (2007 నవంబర్ 15)

8. ప్రకృతి ప్రమాదాల ఫలితంగా ఏర్పడే భూపాతాలు ప్రపంచ విపత్తులో ఎంత శాతం? - (నాలుగు)

9. National Institute of Management ఎక్కడుంది? - (న్యూఢిల్లీ)

10. హరికేన్(గాలి వాన) అంటే? - (ప్రకృతి విపత్తు)

11. సునామీలు ఎక్కువగా సంభవించే ప్రాంతం? - (పసిఫిక్ మహాసముద్రం)

Wednesday, June 20, 2018

Competitive Exams Special - Disaster Management

విపత్తులు 
1. "Disaster" అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి గ్రహించారు?  - (ఫ్రెంచ్)

2. ప్రకృతి సంబంధ ప్రమాదాలు(Natural Hazard)?  - (భూకంపం, భూపాతం, తుఫాను)

3. వేగం ఆధారంగా Rapid on-set Disaster కి చెందింది? - (పర్యావరణ క్షీణత)

4. భారతదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? - (సుమారు 12%)

5. ప్రపంచ విపత్తుల నిర్వహణ సమావేశాన్ని 2005లో ఎక్కడ నిర్వహించారు? -  (జపాన్)

6. భారతదేశంలో ఎంత భూభాగ శాతం వరదలకు గురవుతుంది? - (12%)

7. "సునామీ" అనే పదం ....... ? -  (జపనీస్ పదం)

8. SAARC విపత్తు నిధిని ఏ ఆర్ధిక సంఘంలో భాగంగా ఏర్పాటు చేశారు? - (న్యూఢిల్లీ)

9. జాతీయ విపత్తు నిధిని ఏ ఆర్ధిక సంఘంలో భాగంగా ఏర్పాటు చేశారు? - (13 వ)

10. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుంది? - (హోనలూలు)

11. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడుంది? - (న్యూఢిల్లీ)

12. "Disaster" అనేది ఏ భాషా పదం?  - (ఫ్రెంచ్))

13. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి? - (ట్రోపోస్పియర్)

14. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? - (2005 డిసెంబర్ 23)

15. Indian National Center for Ocean Information Services (INCOIS) ఎక్కడ ఏర్పాటు చేశారు? - (హైదరాబాద్)

16. జాతీయ విపత్తుల  నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు?  - (ప్రధాన మంత్రి)

17. "కరువులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు" వీటిలో మానవుని వల్ల ఏర్పడే విపత్తులు? - (అగ్ని ప్రమాదాలు)

18. భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తులకు గురవుతున్నాయి? - (25)

19. 1556 జనవరి 23 న ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఎక్కడ సంభవించింది? - (చైనా)

20. జాతీయ విపత్తు నిర్వహణ  విధానాన్ని (National Disaster Management Policy) ని యూనియన్ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది?  -(2009)

Saturday, January 6, 2018

General Knowledge - Earth - Enclosures

భూమి - ఆవరణాలు 
1. 1492 లో భారతదేశానికి చేరాలని బయలు దేరిన కొలంబస్ ఏ దేశం? - (ఇటలీ)

2. ఐరోపా నుంచి పశ్చిమ దిశగా బయలుదేరిన కొలంబస్ ఏ దీవులకు చేరుకున్నాడు? - (కరేబియన్)

3. భూమి ఎటువైపు భ్రమణం చేస్తుంది? - (పడమర నుంచి తూర్పునకు)

4. ఉత్తర, దక్షిణ ధృవాల ద్వారా భూమి మధ్యగా గీసిన ఊహారేఖను ఏమంటారు? - (అక్షం)

5. 180° తూర్పు, పశ్చిమ రేఖాంశానికి మరోపేరు? - (అంతర్జాతీయ దినరేఖ)

6. - భూమిని సమాన అర్థగోళాలు చేసేది? - (భూమధ్య రేఖ)

7. 'లాటిట్యూడో' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? - (లాటిన్)

8. లాటిట్యూడ్ అంటే అర్థం? - (వెడల్పు)

9. Hemisphere లో Hemi అంటే అర్థం? - (సగభాగం)

10. అక్షాంశాల్లో పొడవు అనే పదానికి సమానపదం ఇచ్చే పదం? - (లాంగిట్యూడ్)

11. యాంటి మెరిడియన్ అంటే? - (180° రేఖాంశం)

12. భూమి ఒకడిగ్రీ మేర కదలడానికి పట్టే సమయం? - (4ని)

13. మధ్యాహ్న రేఖలు అని వేటిని అంటారు? - (రేఖాంశాలు)

14. గ్రీనిచ్ కంటే భారత కాలమానం? - (5. 30 గం. ముందు)

15. సముద్ర ప్రవాహాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహించడాన్ని ఏమంటారు? - (ప్రవాహాలు)

16. సముద్ర ఉపరితల నీటిమట్టం హెచ్చు, తగ్గులను ఏమంటారు? - (తరంగాలు)

17. సముద్రంలో నీటిమట్టం ప్రతి రోజూ పెరగడాన్ని, తగ్గడాన్ని ఏమంటారు? - (పోటు పాటు)

18. 'లితో' అంటే గ్రీకు భాషలో అర్థం? - (రాయి)

19. 'అట్మాస్పియర్' లో అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం? - (నీటిఆవిరి)

20. మధ్యధరా సముద్ర ద్వీప స్తంభం అని ఏ అగ్నిపర్వతాన్ని అంటారు? - (స్ట్రాంబోలి)

21. 'కిలిమంజారో' అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? - (టాంజానియా)

22. భారతదేశంలోని అగ్నిపర్వతం? - (నార్కొండం)

23. సజీవంగా ఉన్న 3/4 వంతు అగ్ని పర్వతాలు ఏ మహాసముద్ర అంచున ఉన్నాయి? - (ఫసిఫిక్)

24. ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల శిలలు బలహీనమై, పగిలిపోయే ప్రక్రియను ఏమంటారు? - (శిలాశైథిల్యం)

25. కొలొరాడో నది ప్రత్యేకత? - (అతిపెద్ద అగాధ ధరిని కలిగి ఉంది)

26. గోదావరి నదిపై బైసన్ గార్జ్  ఎక్కడుంది? - (పాపికొండలు)

27. నదులు V ఆకారం లోయను ఎక్కడ ఏర్పాటు చేస్తాయి? - (పర్వత ప్రాంతాల్లో)

28. ప్రపంచంలో ఎత్తైన జలపాతం? - (ఎంజెల్)

29. ఎంజెల్ జలపాతం ఏ నదిపై ఉంది? - (చురుణ్)

30. భారతదేశంలో ఎత్తైన జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? - (శరావతి)

31. ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను కలిగి ఉన్న నది? - (గంగా)

32. U ఆకారపు లోయలను ఏర్పాటు చేసేవి? - (హిమానీ నదాలు)

33. ట్రోపో ఆవరణం సగటు ఎత్తు ఎన్ని కి. మీ.? - (13)

34. ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? - (భూమధ్య రేఖ)

35. అన్నిటి కంటే పైన ఉండే ఆవరణం? - (ఎక్సో)

36. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? - (స్ట్రాటో)

37. అయానో ఆవరణం అని దేనికి పేరు? - (థర్మో)

38. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గే ఆవరణం? - (ట్రోపో)

39. సమశీతోష్ణ మండలాల్లో వీచే పవనాలు? - (పశ్చిమ పవనాలు)

40. 'మౌసమ్' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? - (అరబిక్)

41. 'చినూడ్' అనే పదానికి అర్థం? - (మంచును తినేది)

42. భారతదేశంలో మే - జూన్ నెలల్లో వీచే పవనాలు? - (లూ)

43. ఆల్ప్స్ పర్వాతాల మీదుగా వీచే ఉష్ణ పవనం? - (ఫోన్)

44. బాగా ఎత్తులో ఉన్న మేఘాలను ఏమని పిలుస్తారు? - (సిర్రస్)

45. ఒరోజెనిక్ వర్షపాతం అని దేనిని అంటారు? - (పర్వతీయ వర్షపాతం)

46. సైక్లోన్ అనే ఇంగ్లీష్ పదానికి మూలమైన గ్రీక్ పదం 'కైక్లోన్' అంటే అర్థం? - (తిరుగుతున్న)

47. అవపాతం ఏ రూపంలో ఉంటుంది? - (వర్షం, మంచు, తుఫాను, వడగండ్లు)

48. గాలి వేగాన్ని కొలిచే పరికరం? - (అనిమో మీటర్)

49. ఆక్స్ భౌ సరస్సులు వేటి ద్వారా ఏర్పడతాయి? - (నదీ ప్రవాహాలు)

50. జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలమైన పొర? - (స్ట్రాటో ఆవరణం)

Friday, August 18, 2017

General Knowledge - Geography

భూగోళ శాస్త్రం 
1. 'జాగ్రఫీ' పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త? - (ఎరటోస్థనీస్)

2. భూగోళశాస్త్ర పితామహుడు ఎవరు? - (హెకాటియస్)

3. ఆధునిక భూగోళశాస్త్ర పితామహుడు ఎవరు? - (అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ )

4. భారతదేశ భూగోళశాస్త్ర పితామహుడు ఎవరు? - (జేమ్స్ రన్నెల్)

5. రాజకీయ భూగోళశాస్త్ర వ్యవస్థాపకుడు ఎవరు? - (ప్రెడరిక్ రాట్జెల్)

6. శాస్త్రీయంగా మొదటి ప్రపంచ పటం తయారు చేసింది? - (అనాగ్జిమెండర్)

7. 'అట్లాస్' పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు? - (మెర్కెటర్)

8. ప్రపంచ పటంలో దక్షిణాన్ని పైభాగంలో చూపింది ఎవరు? - (ఆల్ఇద్రిసి)

9. ఖగోళ శాస్త్ర బైబిల్ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు? - (ఆల్మజిస్ట్)

10. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కోపర్నికస్ ఏ దేశస్థుడు? - (పోలెండ్)

11. ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యునిలో కనిపించే రంగులు? - (ఎరుపు, నారింజ)

12. సూర్యునిలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతం? - (కేంద్రం)

13. సూర్యుని గురుత్వాకర్షణశక్తి భూమి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? - (28 రెట్లు)

14. సూర్యునిలో అతి చల్లని ప్రాంతం? - (సూర్యాంకాలు)

15. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని లో కనిపించే భాగం? - (కరోనా)

16. సూర్యునికి, భూమికి మధ్య ఉండే గరిష్ట దూరం? - (152 మిలియన్ కి.మీ)

17. ఆకాశంలో ఇంద్ర ధనుస్సు ఏర్పడటానికి కారణం? - (కాంతి విక్షేపణం)

18. ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యునిలో కనిపించే భాగం ఏది? - (క్రోమోస్పియర్)

19. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం? - (500 సెకన్లు)

20. సూర్యుని పరిభ్రమణ కాలం ఎంత? - (250 మిలియన్ సంవత్సరాలు)

21. రోదసీ యాత్రికుడికి బయట ఉన్న ఆకారం ఏ రంగులో కనిపిస్తుంది? - (నలుపు)

22. డోలనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? - (అలెన్ సాండెజ్)

23. వాయుపరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? - (ఇమాన్యూయెల్ కాంట్)

24. గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? - (చాంబర్లీన్ & మౌల్టన్ )

25. విశ్వ దీవులు అని వేటిని అంటారు? - (గెలాక్సీ)

26. పాలపుంతకు సమీపంలో ఉన్న గెలాక్సీ ఏది? - (అండ్రొ మెడా)

27. విశ్వంలో అతి పెద్ద నక్షత్రం ఏది? - (బెటిల్ గ్లక్స్)

28. విశ్వంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం ఏది? - (పార్ సెక్)

29. ఒక కాంతి సంవత్సరం = ? (9. 3 X 1012 కి. మీ)

30. దక్షిణ ధృవం వద్ద నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాన్ని ఏమంటారు? - (ఉర్సు మైనర్)

31. గెలాక్సీలకు, నిహారికలకు మధ్య గల ఖాళీ ప్రదేశ శాతం ఎంత? - (97%)

32. పాలపుంత అనే గెలాక్సీ ని 'స్వర్గానికి దారులు' అని ఏ దేశస్థులు పిలుస్తారు? - (గ్రీక్)

33. చైనా  అంతరిక్ష నావికులను ఏమని పిలుస్తారు? - (టైకొనాట్స్)

34. నక్షాత్రాలకు జన్మ స్థానాలు అని వేటిని అంటారు? -(నిహారికలు)

35. కృష్ణ బిలాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? - (స్టీఫెన్ హాకిన్స్)

36. నక్షాత్రాలలో అధిక శాతం గల వాయువు? - (హైడ్రోజన్)

37. నక్షత్రాల్లో ఉష్ణోగ్రతను కొలిచే పరికరం? - (పైరో మీటర్) 

Wednesday, July 27, 2016

The effects of Pollution - 5th class

The effects of Pollution - 5th class
Choose the correct answer:
1. Cars & factories release - 
a) coolants               b) poisonous gases                 c) aerosol             (b)

2. Air pollution can be controlled if our automobiles use - 
a) kerosene            b) coal                      c) clean fuel                     (c)

3. Acid rain causes - 
a) noise pollution       b) soil pollution       c) deafness                    (b)

Fill in the blanks to complete the sentences.
1. Cars release ------ gases into the air. (poisonous)
2. Industries should be located away from ---------- area. (residential)
3. Burning fuel such as wood, coal, kerosene--------- the air. (pollute)
4. Sewage pollutes our ------ sources. (water)
5. Ships spill ------- into the sea causing extensive --------- pollution.(oil, water)
6. Roots of trees hold soil together, thus preventing --------- erosion.(soil)
7. ------- pollution leads to deafness & stress. (noise)
8. When rain is polluted, we call it ------- rain.(acid)

Thursday, January 22, 2015

General Knowledge - Geography - part 2

General Knowledge - Geography - part 2

11. సౌరకుటుంబం మొత్తం పరిమాణంలో సూర్యుడు వ్యాపించిన శాతం ఎంత?
ఎ) 1%         బి) 9.8%         సి) 59. 8 %               డి) 99. 8%                                (డి) 

12. గ్రహాలను ఆయా అక్షాల మీద ఉంచే అంశాలు ఏవి?
ఎ) గురుత్వాకర్షణ బలం, అపకేంద్ర బలం                  
 బి) గ్రహాల ఆకృతి, వాటి పరిమాణం
సి) భ్రమణం, సాంద్రత                                    
డి) గ్రహాల మధ్య కేంద్రబలం, అపకేంద్ర బలం                                            (ఎ)

13. పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఏ గ్రహంలో చూడవచ్చు?
ఎ) బుధుడు            బి) శుక్రుడు           సి) కుజుడు              డి) ఇంద్రుడు                     (బి)

14. ప్లూటోను గ్రహస్థాయి నుంచి ఎప్పుడు తొలిగించారు?
ఎ) 2006 జనవరి 26              బి) 2006 మార్చి 26
సి) 2006 అక్టోబర్ 26                డి) 2006 నవంబర్ 26                                  (సి)

15. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లో ఎక్కువ సాంద్రత ఉన్నది?
ఎ) భూమి       బి) అంగారకుడు            సి) గురుడు             డి) శని                   (ఎ)

16. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే నిర్దిష్ట మార్గాన్ని ఏమంటారు?
ఎ) వృత్తాకార తలం        బి) విషువత్ గోళం         సి) ధీర్ఘవృత్తపథం            డి) భూకక్ష్య         (డి)

17. ఆస్టరాయిడ్లు ఏర్పరచిన గోతిలో నీళ్లు చేరడం వల్ల రూపొందే సరస్సును ఏమంటారు?
ఎ)టెక్టోనిక్ లేక్         బి) ఫాల్ట్ లేక్         సి) క్రేటర్ లేక్            డి) డిప్రెషన్ లేక్                  (సి)

18. 2013 ఫిబ్రవరి 15న భూ వాతావరణంలోకి చొచ్చుకు వచ్చిన ఆస్టరాయిడ్ కు ఏమని పేరు పెట్టారు?
ఎ) 2010 DA 14       బి) 2012 DA 14              సి) 2013 DA 14        డి) 2015 DA 14         (బి)

19. ఇటీవల కనుక్కున్న వజ్రపు గ్రహం పేరేమిటి?
ఎ) 55 Cancri e            బి) డైమండ్ ప్లానెట్         సి) సూపర్ ప్లానెట్         డి) సూపర్ ఎర్త్ డైమండ్      (ఎ)

20. 2013 ఫిబ్రవరి 15న ఏ నగరం పై ఉల్కలు పడి ఇళ్లు ధ్వంసమయ్యాయి?
ఎ) మాగ్నిటోగోర్స్క్   బి) వ్లాడివో స్టాక్        సి) సెయింట్ పీటర్స్ బర్గ్         డి) చెల్యాబిన్స్క్               (డి)