Social Icons

Pages

Tuesday, August 31, 2021

ప్రాచీన భారత దేశ చరిత్ర - మాదిరి ప్రశ్నలు

 ప్రాచీన భారత దేశ చరిత్ర - మాదిరి ప్రశ్నలు

1. అష్టాధ్యాయి రచించిన పాణిని వీటిలో ఏ మహాజనపదకు చెందినవాడు? 

ఎ) గాంధార బి) కాంభోజ (సి) వత్స డి) అవంతి     (ఎ)

2. లిచ్చావీలను అంతం చేయడంలో అజాతశతృవుకు సహకరించిన మంత్రి? 

ఎ) వస్సాకార బి) బద్ధసాల సి) కౌటిల్య డి) కల్పక   (ఎ)

3. నందరాజులు ఏ మతాన్ని ఆదరించారు? 

ఎ) హిందూ బి) బౌద్ద సి) జైన   డి) అజీవిక       (సి)

4. విశ్వామిత్రుడితో ఏ రాజుని పోల్చుతారు? 

ఎ) బింబిసార బి) అజాతశత్రువు సి) మహాపద్మనందుడు డి) కాలాశోక  (సి)

5. కాకవరిన్ బిరుదున్న రాజు? 

ఎ) అజాతశత్రువు బి) కాలశోకుడు సి) శిశునాగ డి) పద్మనందుడు   (బి)

6. మగధ రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రకు మార్చిన మగధ చక్రవర్తి? 

ఎ) ఉదయనుడు బి) కాలశోకుడు సి) చంద్రగుప్త మౌర్యుడు డి) బింబిసారుడు  (బి)

7. అలెగ్జాండర్ భారత్ పై ఎప్పుడు దండెత్తాడు?

ఎ) 327 B.C     బి) 303 B.C     సి) 302 B.C    డి) 298 B.C   (ఎ)

8. బుద్ధుడి జీవితకాలంలో మనుగడలో లేని మహాజనపదం?

ఎ) మల్ల బి) మగధ సి) కోసల డి) అహతి           (ఎ)

9. మగధను పాలించిన రాజవంశాల కాల క్రమం? 

ఎ) బృహద్రథ, హర్యాంక, శిశునాగ, నంద 

బి) హర్యాంక, బృహద్రథ, శిశునాగ, నంద

 సి) శిశునాగ, హర్యాంక, బృహద్రథ, నంద

 డి) బృహద్రథ, శిశునాగ, హర్యాంక, నంద            (ఎ)

10. అజాతశత్రువు వివాహం చేసుకొన్న కోసల రాకుమార్తె ?

 ఎ) యశోధ బి) త్రిశాల సి) కోసల మహాదేవి డి)వజ్జీర    (డి)

11. వీరిలో ఏ మగధరాజు బుద్ధుడ్ని కలిసిన దృశ్యం బార్హుత్ శిల్పాల్లో చెక్కారు? 

ఎ) బింబిసారుడు బి) అజాతశత్రువు సి) ఉదయాన్ డి) శిశునాగ   (బి)

12. వీరిలో శ్రేణిక బిరుదున్న రాజు? 

ఎ) ప్రసేన్ జీత్ బి) బింబిసారుడు సి) మహాసేనుడు డి) కాలాశోకుడు  (బి)

13. బుద్ధుడు, మహావీరుడు, మస్కరి గోషల పుత్రుడు ఎవరి పాలనా కాలంలో నిర్యాణం పొందారు?

 ఎ) బింబిసారుడు బి) అజాతశత్రువు సి) ఉదయనుడు డి) కాలశోకుడు  (బి)

14. గ్రీకు రచనల్లో అగ్రామ్స్ గా పేరొందిన రాజు?

ఎ) ధననందుడు బి) శిశునాగుడు సి) అశోకుడు డి) బిందుసారుడు   (ఎ)

No comments:

Post a Comment