Social Icons

Pages

Monday, November 4, 2024

అన్ని పోటీపరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - పక్షులు

 అన్ని పోటీపరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - పక్షులు

1. పక్షుల్లో ప్రధాన నత్రజని వ్యర్థ పదార్థం?

a) యూరియా  b) అమోనియా  c) యూరిక్ ఆమ్లం  d) ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్   (c)


2. ఏ దేశ జాతీయ పక్షి అంతరించిపోయింది?

a) శ్రీలంక  b) పెరూ  c) నైజీరియా  d) మారిషస్  (d)


3. కింది వాటిలో పక్షులకు సంబంధించి సరికాని విషయం?

a) పక్షి మెదడులో అనుమస్తిష్కం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.

b) ఆధునిక పక్షుల్లో దంతాలు ఉండవు

c) పక్షుల్లో వాసన గ్రహించే గుణం అధికంగా ఉంటుంది

d) పక్షి తోకపై ఉన్నవి రెట్రిసస్ ఈకలు     (c)


4. నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉన్న జిల్లా?

a) రంగారెడ్డి  b) వరంగల్  c) ఖమ్మం  d) నెల్లూరు  (d)


5. కింది వాటిలో నిల్చుని గుడ్లు పెట్టే ఏకైక పక్షి

a) బాతు  b) రాబందు  c) ఆస్ట్రిచ్  d) పెంగ్విన్  (d)


6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ పక్షి శాస్త్రీయ నామం?

a) కొరేసియస్ బెంగాలెన్సిస్  b) స్ట్రుతియో కామెలస్  

c) కోర్వస్ స్ప్లెండర్స్  d) స్టెర్నా మాక్రూరా  (a)


7. వేగవంతమైన పక్షి?

a) గోల్డెన్ ఫ్లోవర్  b) స్విఫ్ట్  c) ఉడ్ కాక్  d) ఆర్కిటిక్ టెర్న్     (b)


8. ఋతువులకు అనుగుణంగా కొన్ని పక్షులు ప్రదర్శించే ప్రత్యేక వలస ప్రవర్తన అధ్యయనం?

a) ఫ్రైనాలజి  b) ఫెనాలజి  c) అంజియాలజీ  d) ఇథాలజీ      (b)


9. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుని మన రాష్ట్రంలో పెంచుతున్న పక్షి?

a) కివి  b) బట్టమేక పక్షి  c) ఈమూ  d) ఆస్ట్రిచ్  (c)


10. డార్విన్‌కు స్ఫూర్తినిచ్చిన ఫించ్ పక్షులు ఎక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి?

a) జావా  b) మలయాదీవులు  c) నికోబార్ దీవులు  d) గలపగాస్ దీవులు   (d)


11. ఏ దేశానికి చెందిన హమ్మింగ్ పక్షి అన్నింటి కంటే చిన్నది?

a) క్యూబా  b) మెక్సికో  c) అర్జెంటీనా  d) కెనడా       (a)


12. ఏ మాసాల మధ్య నెమలి ప్రజననం చెందుతుంది?

a) డిసెంబరు - ఫిబ్రవరి  b) మార్చి - మే  c) జూన్ - ఆగస్టు  d) సెప్టెంబర్ - నవంబర్    (c)


13. ఏ పక్షిలో రెక్కలు తెడ్లుగా రూపాంతరం చెందాయి?

a) బాతు  b) సీగల్  c) పెంగ్విన్  d) టరామిగన్     (c)


14. కింది వాటిలో “ఎకోలొకేషన్”ను ప్రదర్శించే జీవి?

a) పాములు  b) కుక్కలు  c) గబ్బిలం  d) తొండలు  (c)


15. పక్షుల్లో కెల్లా పెద్దది?

a) దక్షిణ అమెరికా ఆస్ట్రిచ్  b) ఆఫ్రికా ఆస్ట్రిచ్  c) బట్టమేక పక్షి  d) టినామస్    (b)


16. అస్సన్ బ్యారేజి పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

a) అసోం  b) పశ్చిమ బెంగాల్  c) కర్ణాటక   d) ఉత్తరాఖండ్    (d)


17. ఎగిరే పక్షిలో గాలితో నిండిన ఎన్ని వాయుకోశాలు ఉంటాయి?

a) 7  b) 8  c) 9  d) 10     (c)


18. గుడ్లను పెట్టే క్షీరదాలు కింది ప్రాంతంలో మాత్రమే కన్పిస్తాయి?

a) న్యూజిలాండ్  b) శ్రీలంక  c) ఆస్ట్రేలియా  d) నార్వే  (c)


19. రోళ్లపాడు అభయారణ్యంలో ఏ పక్షిని ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు?

a) నెమలి  b) పాల పిట్ట  c) రాబందు  d) బట్టమేక పక్షి    (d)


20. కేవ్ లాదేవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?

a) గుజరాత్  b) రాజస్థాన్  c) ఉత్తరాఖండ్  d) హర్యానా  (b)


21. గుజరాత్ రాష్ట్ర పక్షి?

a) గ్రేటర్ ప్లెమింగో  b) బ్లాక్ - క్రెస్టెడ్ బుల్ బుల్  c) బ్లాక్ ఫ్రాంకోలిన్  d) బ్లాక్ నెక్డ్ క్రేన్   (a)


22. బట్టమేక పక్షి ఏ రాష్ట్రానికి రాష్ట్రీయ పక్షి?

a) రాజస్థాన్  b) కర్ణాటక  c) తమిళనాడు  d) ఉత్తరప్రదేశ్   (a)


23. పశువుల్లో వాడే ఏ వాపు నివారణ మందు రాబందుల గణనీయ తగ్గుదలకు కారణం?

a) ఆస్పిరిన్  b) డైక్లోఫినాక్  c) డిడిటి  d) పైరాజినమైడ్    (b)


24. కింది జీవుల్లో మాత్రమే టెలిస్కోపిక్ 'దృష్టి' ఉంటుంది?

a) చేపలు  b) పాములు  c) పక్షులు  d) కుక్కలు   (c)


25. పాలపిట్ట ఆంధ్రప్రదేశ్ తో  పాటు ఏ రాష్ట్రాల రాష్ట్రీయ పక్షి?

a) హిమాచలప్రదేశ్, గోవా  b) కేరళ, మధ్యప్రదేశ్ 

 c) తమిళనాడు, మహారాష్ట్ర  d) బీహార్, కర్ణాటక   (d)


26. శబ్దిని అభివృద్ధి చెంది ఉన్న ఏకైక ఎగరని పక్షి?

a) ఆఫ్రికా ఆస్ట్రిచ్  b) దక్షిణ అమెరికా ఆస్ట్రిచ్  c) కివి  d) ఈము  (b)


27. అధిక రెక్కల వ్యాసం ఉన్న పక్షి?

a) సీగల్  b) సీ ఆల్బట్రాస్  c) బ్లడ్ ఫిజంట్  d) బ్లాక్ నెక్డ్ క్రేన్   (b)

No comments:

Post a Comment