భూమి - ఆవరణాలు - గ్రహణాలు కు సంబంధించిన ముఖ్య ప్రశ్నలు
1. భూమి ఉపరితలంపై ఉన్న రాతి పొర?
జ. శిలావరణం (లేక) ఆశ్మావరణం
2. జలావరణంలో భాగమైనవి?
జ. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, ఇతర జలభాగాలన్నీ
3. వాతావరణం అంటే?
జ. భూమిని ఆవరించి ఉన్న గాలి పొర
4. జీవావరణం అంటే?
జ. అడవులు, పంటలు, జంతువులు, పక్షులు మొదలైన జీవరాశులు
5. పర్యావరణం అంటే?
జ. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అన్నీ కలిప
6. వాతావరణంలో నైట్రోజన్ శాతం?
జ. 78.08%
7. వాతావరణంలో ఆక్సిజన్ శాతం?
జ. 20.94%
8. వాతావరణంలో అయాన్ శాతం?
జ. 0.93%
9. వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం?
జ. 0.03%
10. వాతావరణంలో హైడ్రోజన్, నియాన్, హీలియం శాతం?
జ. 0.02%
11. లిథోస్ అంటే?
జ.శిల........Lithosphere - శిలావరణం
12. అట్‌మోస్ అంటే?
జ. ఆవిరి.........Atmosphere - వాతావరణం
13. హదర్ అంటే?
జ.నీరు.........Hydrosphere - జలావరణం
14. బయో (BiO) అంటే?
జ.జీవం .........Biosphere - జీవావరణం
15. సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వచ్చినపుడు ఏర్పడే గ్రహణం?
జ. చంద్ర గ్రహణం
16. భూమి మీద సూర్యకిరణాలు పడకుండా ఉండే సగభాగాన్ని (నీడ) ఏమంటారు?
జ. ప్రచ్ఛాయ
17. నీడ చుట్టూ ఉండే భాగాన్ని ఏమంటారు?
జ. పాక్షిక ఛాయ
18. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?
జ. పౌర్ణమి రోజు చంద్రుడు ప్రచ్ఛాయలోకి వచ్చినప్పుడు
19. చంద్రుడి కక్ష్యతలం భూమి కక్ష్య తలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది?
జ. 5° 9’
20. ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడదు?
జ. చంద్రుడు ప్రచ్ఛాయలోకి పూర్తిగా రాకపోవడం వల్ల
21. సూర్యుడు కనిపించకుండా భూమికి చంద్రుడు అడ్డు వస్తే ఏర్పడే గ్రహణం?
జ. సూర్యగ్రహణం
22. చంద్రుడి నీడ ఉన్న భాగంలో ఏర్పడే సూర్యగ్రహణం?
జ. సంపూర్ణ సూర్యగ్రహణం
23. చంద్రుడి నీడ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే సూర్యగ్రహణం
జ. పాక్షిక సూర్యగ్రహణం
24. ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఎందుకు ఏర్పడదు?
జ. చంద్రుడి నీడ భూమిపై పడకపోవడం వల్ల
No comments:
Post a Comment