పోటీపరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - చరిత్ర
1. ‘ప్రాజెక్టుల ప్రసాద్’అని ఎవరిని పిలుస్తారు?
1) వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ 2) రాజారామరాయణింగార్
3) రాజా నాయిని వెంకటరంగారావు 4) సర్ విజయానంద గజపతి (1)
2. గాంధీజీ దండియాత్రను ఎప్పుడు ప్రారం భించారు?
1) 1930 మార్చి 12 2) 1930 ఏప్రిల్ 6 3) 1930 మే 16 4) 1930 జూన్ 18 (1)
3. ‘క్విట్ ఇండియా ఉద్యమరాణి’ అని ఎవరిని పిలుస్తారు?
1) సరోజినీ నాయుడు 2) అరుణా అసఫ్ అలీ 3) కాదింబినీ గంగూలీ 4) ఉషా మెహతా (2)
4. కింది వాటిలో సరికాని జత ఏది?
1) భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర- పి. ఆనందాచార్యులు 2) సావిత్రి - అరవింద్ ఘోష్
3) నీల్ దర్పణ్- దీనబంధు మిత్ర 4) ఇండియా విన్‌స ఫ్రీడం - మౌలానా అబుల్ కలాం అజాద్ (1)
5. కింది వాటిలో తులసీదాస్ రచన ఏది?
1) గంగాలహరి 2) రామ్‌చరిత మానస్ 3) మితాక్షరి 4) సుబోధిని (2)
6. మధ్యయుగానికి చెందిన కబీర్‌ను ఏ పాశ్చాత్య మేధావితో పోలుస్తారు?
1) లెనిన్ 2) ఐన్‌స్టీన్ 3) స్టాలిన్ 4) కారల్ మార్క్స్ (4)
7. జ్ఞానేశ్వరుడు మరాఠీ భాషలో రాసిన జ్ఞానేశ్వరి గ్రంథం ఏ గ్రంథానికి వ్యాఖ్యానం?
1) మనుస్మృతి 2) అభిజ్ఞాన శాకుంతలం 3) భగవద్గీత 4) రుగ్వేదం (3)
8. అభంగాలు ఎవరిని కీర్తిస్తూ రాసినవి?
1) మీనాక్షి 2) విఠోభా 3) బుద్ధుడు 4) శివుడు (2)
9. ఫిర్దౌసీ అనే సూఫీ మతశాఖ ఎక్కడ ఆదరణ పొందింది?
1) బిహార్ 2) ఢిల్లీ 3) సింధ్ 4) బెంగాల్ (1)
10. వార్కరీ సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో రెండుసార్లు ఏ ప్రాంతాన్ని దర్శించాలి?
1) ఉజ్జయనీ (మధ్యప్రదేశ్) 2) మధుర (ఉత్తర ప్రదేశ్)
3) పండరీపురం (మహారాష్ట్ర) 4) తిరుమల (ఆంధ్రప్రదేశ్) (3)
11. మీరాబాయి ఎక్కడ మరణించారు?
1) శృంగేరీ 2) ద్వారక 3) జైపూర్ 4) పూరీ (2)
12. శివాజీ ఇచ్చే సంపదను తిరస్కరించిన భక్తి ఉద్యమకారుడు?
1) వల్లభాచార్యుడు 2) శంకరదేవుడు 3) నామదేవుడు 4) తుకారాం (4)
13. గణపతి దేవుని కాలంలో ప్రసిద్ధి చెందిన శైవమత శాఖ ఏది?
1) పాశుపతం 2) వీరశైవం 3) కాలముఖం 4) కాపాలిక (1)
14. ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) క్రీ.శ. 1243 2) క్రీ.శ. 1263 3) క్రీ.శ. 1199 4) క్రీ.శ. 1253 (2)
15. కింది వాటిలో సరైన జత ను గుర్తించండి.
1) మదనిక శిల్పాలు-రామప్ప దేవాలయం 2) లక్నవరం చెరువు- కాకతీయులు
3) మాన్యఖేటం- రాష్ట్రకూటులు 4) పైవన్నీ సరైనవే (4)
16. జైన రామాయణం రాసిందెవ రు?
1) కంబన్ 2) నాగచంద్రుడు 3) బిల్హణుడు 4) కల్హణుడు (2)
17. ఆంధ్ర మహభాగవతం రాసిన పోతన ఏ రాజుల పాలనా కాలానికి చెందిన వారు?
1) వెలమరాజులు 2) కాకతీయులు 3) పాండ్యులు 4) రాష్ట్రకూటులు (1)
18. హోయసాలేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
1) దేవగిరి 2) బేలూరు 3) హాలిబేడు 4) మథురై ( 3)
19. హోయసాల రాజుల రాజధాని ఏది?
1) రాచకొండ 2) బాదామీ 3) హన్మకొండ 4) ద్వారా సముద్రం (4)
20. మహ్మద్ బిన్ తుగ్గక్ మధురైని ఎప్పుడు ఆక్రమించాడు?
1) క్రీ.శ. 1328 2) క్రీ.శ. 1323 3) క్రీ.శ. 1312 4) క్రీ.శ. 1302 (1)
21. భారతదేశంపై దండెత్తి, ఆక్రమించిన తొలి పారశీక చక్రవర్తి ఎవరు?
1) మొదటి డేరియస్ 2) జెర్కసీజ్ 3) మూడో డేరియస్ 4) మూడో ఖుస్రూ (3)
22. కింది వాటిలో సరైంది ఏది?
1) అపరాంత - గోవా 2) పాటలీపుత్రం - పాట్నా
3) వాలికొండాపురం - పాండిచ్చేరి 4) పైవన్నీ (4)
23. సత్యశోధక్ సమాజ్ స్థాపకులెవరు?
1) దయానంద సరస్వతి 2) రాజా రామ్‌మోహన్ రాయ్
3) సురేంద్రనాథ్ బెనర్జీ 4) జ్యోతీరావ్ పూలే (2)
24. సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి?
1) విదేశీ వస్తువులను బహిష్కరించడం 2) శాంతియుత ప్రతిఘటన
3) పన్నులు కట్టకుండా ఉండడం 4) బ్రిటిషర్ల ఆస్తులు ధ్వంసం చేయడం (3)
25. భారత స్వాతంత్రోద్యమ కాలంలో బాల చరఖా సంఘం స్థాపించిందెవరు?
1) సరోజినీ నాయుడు 2) అరుణా అసఫ్ అలీ 3) ఇందిరా గాంధీ 4) గైడిన్లూ రాణి (3)
26. నవజీవన భారత్ సభ (1925) స్థాపించిం దెవరు?
1) భగత్ సింగ్ 2) గాంధీజీ 3) మహదేవ్ దేశాయ్ 4) అంబేడ్కర్ (1)
27. షియా మతశాఖవారు తమ సంకేతంగా ఏ రంగు జెండా స్వీకరించారు?
1) నల్లజెండా 2) ఎర్రజెండా 3) పచ్చజెండా 4) తెల్లజెండా (1)
28. వైష్ణవ భక్తి ఉద్యమ దృక్పథంలో దాస కూటము ఏ ప్రాంతంలో ఏర్పడింది?
1) కశ్మీర్ 2) తమిళనాడు 3) బెంగాల్ 4) కర్ణాటక (4)
29. అబుల్ ఫజుల్ ప్రకారం సూఫీలలో ఎన్ని శాఖలు ఉన్నాయి?
1) 12 2) 14 3) 16 4) 18 (2)
30.కింది వాటిలో సరైంది ఏది?
1) క్రీ.శ. 712 - అరబ్బుల సింధు ఆక్రమణ 2) జిజియా - జుట్టు పన్ను
3) పీర్‌సాహెబ్ దర్గా - కడప 4) పైవన్నీ సరైనవే (4)
31. సూఫీ మత శాఖలను ఏమంటారు?
1) తరఫ్‌లు 2) శిల్‌శిలా 3) మదర్సాలు 4) మిజిలీలు (2)
32. ఒరియా భాషలో రామాయణం రాసిందెవరు?
1) బలరాందాస్ 2) కృతికవాసుడు 3) అతిశదీపాంకరుడు 4) లక్ష్మణసేనుడు (1)
33. రుగ్వేదాన్ని పోలిన గ్రంథం ఏది?
1) గీతాగోవిందం 2) ఖురాన్ 3) ఆదిగ్రంథ్ 4) జెండ్ అవెస్థా (4)
34. కింది వాటిలో బంకించంద్ర చటర్జీ రచన కానిదేది?
1) దుర్గేశ్ నందిని 2) కపాల కుండల 3) పరిణీత 4) మృణాళిని (3)
35. భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) ఫిబ్రవరి 28 2) ఏప్రిల్ 14 3) జూలై 14 4) ఆగస్ట్ 29 (1)
36. మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన లీడర్ పత్రికను ఎక్కడ నుంచి ప్రచురించారు?
1) ఢిల్లీ 2) బొంబాయి 3) అలహాబాద్ 4) మద్రాసు (3)
37. పంచశీల సూత్రాలను ఉల్లంఘించి చైనా భారత్‌పై ఎప్పుడు దండెత్తింది?
1) 1961 ఆగస్ట్ 16 2) 1962 అక్టోబర్ 20 3) 1959 నవంబర్ 19 4) 1949 జనవరి 27 (2)
38. ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని (కుప్పం) ఎప్పుడు నెలకొల్పారు?
1) 1997 2) 1999 3) 2001 4) 2003 (1)
39. కింది వాటిలో ఏ దేవాలయం నీడ భూమిపై పడదు?
1) జగన్నాథాలయం (పూరీ) 2) బృహదీశ్వరాలయం (తంజావూరు) 3) రామప్ప దేవాలయం (పాలంపేట) 4) రుద్రేశ్వరాలయం (హన్మకొండ) (2)
40. ‘స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే నగరం ఏది?
1) అలహాబాద్ 2) హైదరాబాద్ 3) బొంబాయి 4) అహ్మదాబాద్ (4)
41. లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాను అతివాద నాయకులు ఎపుడు స్థాపించారు?
1) 1907 2) 1908 3) 1909 4) 1910 (4)
42. బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదే శీ దండయాత్ర అన్నది ఎవరు?
1) దాదాభాయ్ నౌరోజీ 2) బిపిన్ చంద్రపాల్ 3) గోపాలకృష్ణ గోఖలే 4) తేజ్ బహదూర్ సప్రూ (1)
43. సైమన్ కమిషన్‌లో అధ్యక్షుడితో సహా ఎంత మంది భారత్ వచ్చారు?
1) 7 2) 8 3) 9 4) 10 (1)
44. ఆల్‌ఇండియా ముస్లింలీగ్ పతాకం ఏది?
1) నక్షత్రం, అర్ధచంద్రాకారం ఉన్న హరిత వర్ణ పతాకం
2) ఉదయించే సూర్యుడు ఉన్న తెలుపు రంగు ఉన్న పతాకం
3) ఛరఖా ఉన్న కాషాయ పతాకం 4) పూర్ణ చంద్రుడు ఉన్న పసుపు వర్ణ పతాకం (1)
45. ఉప్పు సత్యాగ్రహంలో ఇందిరాగాంధీ చిన్నతనంలోనే కింది వాటిలో దేని ద్వారా ఉద్యమం నడిపింది?
1) సత్యసేన 2) శాంతిసేన 3) వానరసేన 4) రామదండు (3)
46. 1954 మే 29న ఏయే దేశాల పంచశీల ఒప్పందం మధ్య జరిగింది?
1) భారత్, అమెరికా 2) భారత్, చైనా 3) భారత్, ఇటలీ 4) భారత్, జపాన్ (2)
47. జవహర్‌లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో మరణించారు?
1) 1964 2) 1965 3) 1964 4) 1967 (1)
48. క్రాంతి మైదాన్ అనే చారిత్రక ప్రాంతం ఎక్కడ ఉంది?
1) లక్నో 2) ముంబై 3) బెంగళూరు 4) కలకత్తా (2)
No comments:
Post a Comment