Social Icons

Pages

Wednesday, August 25, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - తెలుగు

 పోటీ పరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - తెలుగు 

1. పాండవులతో మహప్రస్థానానికి వెళ్లిందెవరు?

  1) జటాయువు 

  2) శునకం

  3) హరిణం 

  4) ఉడుత         (2)


2. తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని ఎవరికి అంకితమిచ్చారు?

  1) మనుమసిద్ధి మహారాజు

  2) హరిహర నాథుడు

  3) మంత్రి భాస్కరుడు

  4) గణపతి దేవ చక్రవర్తి      (2)


3.‘శ్మశానవాటి’ పద్యాలు ఏ నాటక ప్రదర్శన ద్వారా ప్రచారం పొందాయి?

  1) చింతామణి 

  2) గయోపాఖ్యానం

  3) యమాంజనేయ యుద్ధం

  4) సత్యహరిశ్చంద్ర         (4)


4.‘నందీశ్వరునిశాపం’ పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది?

  1) మొల్ల రామాయణం

  2) రంగనాథ రామాయణం

  3) కంకంటిపాపరాజు ఉత్తర రామాయణం

  4) భాస్కర రామాయణం        (3)


5. నందీశ్వరుడిని వానర ముఖుడు అని హేళనచేసి, శాపానికి గురైన వారెవరు?

  1) విభీషణుడు 

  2) రావణుడు

  3) కుబేరుడు 

  4) మైరావణుడు       (2)


6.‘తిన్నని ముగ్ధ భక్తి’ ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం గ్రంథంలోని ఏ ఆశ్వాసంలోనిది?

  1) ద్వితీయాశ్వాసం 

  2) చతుర్థాశ్వాసం

  3) తృతీయాశ్వాసం 

  4) పంచమాశ్వాసం     (3)


7. స్వప్న వృత్తాంతాన్ని వ్యక్తీకరించిన తొలి తెలుగు కవి?

  1) పోతన 

  2) పింగళి సూరన

  3) తిక్కన 

  4) ఎర్రన       ( 3)


8. ‘శ్రీకాళహస్తి’లో శ్రీ అంటే?

  1) లక్ష్మి  

  2) సర్పం

  3) ఏనుగు 

  4) సాలెపురుగు       (4)


9. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’  గేయ రచయిత ఎవరు?

  1) పులుపుల శివయ్య 

  2) వేములపల్లి శ్రీకృష్ణ

  3) త్రిపురనేని రామస్వామి చౌదరి

  4) శంకరంబాడి సుందరాచారి         (2)


10. కింది వాటిలో జాషువా బిరుదు కానిది ఏది?

  1) కవి కోకిల 

  2) కవి సామ్రాట్

  3) నవయుగ కవి 

  4) మధుర శ్రీనాథ         (2)


11. ‘విప్లవ రుషిని, విద్రోహ కవిని’ అని చెప్పుకున్న కవి ఎవరు?

  1) శ్రీశ్రీ 

  2) జ్వాలాముఖి

  3) శ్రీరంగం నారాయణ బాబు

  4) వరవరరావు          (3)


12. ‘స్పర్థ’ పాఠ్యభాగం శ్రీనాథుడి హరవిలాసంలోని  ఏ ఆశ్వాసంలోనిది?

  1) ద్వితీయాశ్వాసం 

  2) చతుర్థాశ్వాసం

  3) సప్తమాశ్వాసం 

  4) పంచమాశ్వాసం       (3)


13. ‘హరవిలాస’ కృతిభర్త ఎవరు?

  1) బెండపూడి అన్నయమంత్రి

  2) అవచి తిప్పయశెట్టి

  3) వీరభద్రా రెడ్డి 

  4) మామిడి సింగన        (2)


14.కింది వాటిలో ముని మాణిక్యం నరసింహారావు ప్రసిద్ధ రచనలు ఏవి?

  1) దాంపత్యోపనిషత్తు

  2) కాంతం కథలు - కాంతం కైఫీయత్తు

  3) రుక్కుతలి, గృహప్రవేశం

  4) పైవన్నీ       (4)


15. హాస్య రచనల్లో ‘సింహత్రయం’గా ప్రసిద్ధులైనవారు ఎవరు?

  1) చిలకమర్తి లక్ష్మీ నరనసింహారావు

  2) పానుగంటి లక్ష్మీ నరసింహారావు

  3) మునిమాణిక్యం నరసింహారావు

  4) పైవారందరూ            (4)


16.‘చాసో’ అసలు పేరు?

  1) చాగంటి నరసింహారావు

   2) కానుకొలను సోమయాజులు

  3) చాగంటి నరహరిరావు

  4) కానుకొలను నరహరిరావు        (2)


17. తెలంగాణ మాండలికంలో ‘ఎచ్చరిక’ కథ రాసిన రచయిత ఎవరు?

  1) కాళోజీ నారాయణరావు

  2) బోయ జంగయ్య 

  3) బి.ఎస్. రాములు

  4) యశోధా రెడ్డి       ( 2)


18. ప్రసిద్ధమైన ‘జాతర’ నవలా రచయిత ఎవరు?

  1) దాశరథి రంగాచార్యులు

  2) ఆనందారామం 

  3) బోయ జంగయ్య

  4) వట్టికోట ఆళ్వారుస్వామి     (3)


19. ‘ద హేజ్ ’ కథా రచయిత?

  1) హితశ్రీ 

  2) శశిశ్రీ

  3) మొహిద్దీన్ 

  4) ఇస్మాయిల్     (2)


20. ‘శశిశ్రీ’ అసలు పేరు?

  1) షేక్ మొహిద్దీన్ 

  2) షేక్ కరీముల్లా

  3) షేక్ రహంతుల్లా 

  4) షేక్ ఇస్మాయిల్       (3)


21. ‘నేను ఫెమినిస్టునీ, హ్యూమనిస్టునీ’ అని చెప్పుకున్న రచయిత్రి?

  1) సావిత్రి 

  2) విమల

  3) మల్లాది సుబ్బమ్మ

  4) పాటిబండ్ల రజని          (3)


22. బాల్యంలోనే తిరువాయూర్‌లో కచేరి నిర్వహించిన గాయకుడు?

  1) ఘంటసాల 

  2) బాలమురళీ కృష్ణ

  3) నేదునూరి కృష్ణమూర్తి

  4) బాల సుబ్రహ్మణ్యం       (2)


23. పాండురంగ మహాత్మ్యం ప్రబంధ కృతిపతి ఎవరు?

  1) శ్రీకృష్ణ దేవరాయలు

  2) విరూరి వేదాద్రి

  3) తిమ్మరుసు 

  4) పండరినాథుడు          (2)


24. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య!’ అని పిలిచిన కవి?

  1) విద్వాన్ విశ్వం 

  2) అడవి బాపిరాజు

  3) ఆదిరాజు వీరభద్రరావు

  4) పుట్టపర్తి నారాయణాచార్యులు        (2)


25. ‘పాతకాలం పద్యమైతే, వర్తమానం వచన కవిత’ అని వాఖ్యానించిన వారెవరు?

  1) చేకూరి రామారావు

  2) ఆరుద్ర 

  3) కుందుర్తి

  4) కె.వి. రమణారెడ్డి         (3)


26.తెనాలి కథాత్రయంగా ప్రసిద్ధి చెందినవారెవరు?

  1) చలం 

  2) కొడవటిగంటి

  3) గోపీచంద్ 

  4) పైవారందరూ        (4)

No comments:

Post a Comment