Study Material: భారత వ్యవసాయ రంగం
1. కింది వాటిలో భారతదేశ వ్యవసాయ రంగం లక్షణం ఏది?
1) ప్రచ్ఛన్న నిరుద్యోగిత 2) రుతు సంబంధ నిరుద్యోగిత
3) సంప్రదాయ వ్యవసాయం 4) పైవన్నీ (4)
2. హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు ఎవరు?
1) విలియం. ఎస్. గాండ్ 2) నార్మన్ బోర్లాగ్
3) ఎం. ఎస్. స్వామినాథన్ 4) వర్గీస్ కురియన్ (1)
3. నాణ్యత ఆధారంగా పంటను వేరు చేయడాన్ని ఏమని పిలుస్తారు?
1) అసెంబ్లింగ్ 2) గ్రేడింగ్
3) ప్రామాణీకరణ 4) ప్రోసెసింగ్ (2)
4. అగ్ మార్క్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) పుణె 2) హైదరాబాద్ 3) నాగపూర్ 4) ముంబై (3)
5.ఒక హెక్టారు వరకు భూమిని కలిగి ఉన్న రైతులను ఏమని పిలుస్తారు?
1) ఉపాంత రైతులు 2) చిన్నకారు రైతులు
3) మధ్యతరహా రైతులు 4) పెద్ద రైతులు (1)
6.భారతదేశంలో సగటు కమత పరిమాణం తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్ 2) నాగాలాండ్ 3) కేరళ 4) బీహార్ (3)
7. మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్ 3) మధ్యప్రదేశ్ 4) కర్ణాటక (3)
8. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?
1) భారత్ 2) చైనా 3) బ్రెజిల్ 4) రష్యా (1)
9. 'నేషనల్ హార్టీ కల్చర్ మిషన్' ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2004 - 05 2) 2005 - 06 3) 2006 - 07 4) 2007 - 08 (2)
10.కమతాల విఘటనకు గల కారణాలు ఏవి?
1) జనాభా పెరుగుదల 2) వారసత్వ చట్టాలు
3) కుటీర పరిశ్రమల క్షీణత 4) పైవన్నీ (4)
11.భారతదేశంలో వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడే నీటివనరులు ఏవి?
1) కాలువలు 2) బావులు 3) చెరువులు 4) కుంటలు (2)
12.కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని (కెసిపి) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1996 2) 1997 3) 1998 4) 1999 (3)
13. భారత్ లో మొదటి వ్యవసాయ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు?
1) 1992 2) 1993 3) 1994 4) 1995 (2)
14. రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చిన సంవత్సరం?
1) 2004 2) 2005 3) 2006 4) 2007 (3)
15. ఏ ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగం అత్యధిక వృద్ధి రేటు సాధించింది?
1) 2 వ 2) 3 వ 3) 4 వ 4) 5 వ (4)
16. ఈ కింది వాటిలో రబీలో పండే పంట ఏది?
1) వరి 2) చెరుకు 3) పత్తి 4) గోధుమ (4)
17. ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1) వరి 2) చెరుకు 3) వేరుశనగ 4) జనుము (1)
18.సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం (ఐ ఏ డీ పి) ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1960 2) 1961 3) 1962 4) 1963 (1)
19. ఈ కింది వాటిలో మలేషియా అభివృద్ధి చేసిన వరి వంగడం పేరు?
1) మసూరి 2) ఐఆర్ - 8 3) పద్మ 4) 1001 (1)
20. హరిత విప్లవం వల్ల అధికముగా లబ్ది పొందిన పంట?
1) గోధుమ 2) పప్పుధాన్యాలు 3) జొన్న 4) వేరుశనగ (1)
21. బంగాళా దుంప ఉత్పత్తి పెంచడానికి వచ్చిన విప్లవం ఏది?
1) గ్రే రెవల్యూషన్ 2) గోల్డెన్ రెవల్యూషన్
3) బ్రౌన్ రెవల్యూషన్ 4) రౌండ్ రెవల్యూషన్ (4)
22. లీడ్ బ్యాంక్ స్కిం ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1966 2) 1967 3) 1968 4) 1969 (4)
23. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1974 2) 1975 3) 1976 4) 1977 (3)
24. 'తక్కావి రుణాలు' అందించేది ఎవరు?
1) వాణిజ్య బ్యాంకులు 2) ప్రభుత్వం
3) సహకార బ్యాంకులు 4) నాబార్డ్ (2)
25. జమిందారీ పద్దతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు?
1) కారన్ వాలిస్ 2) థామస్ మన్రో 3) విలియం బెంటింగ్ 4) లార్డ్ కర్జన్ (1)
No comments:
Post a Comment