బయాలజీ - 2 వ భాగం
1. తేలు జంతు రాజ్యంలోని ఏ వర్గానికి చెందుతుంది? - (ఆర్థోపొడా)
2. ఈల్ అనేది ఒక . ? (చేప)
3. కర్పరాన్ని కలిగి ఉన్న ప్రోటోజోవన్? - (ఎల్ఫీడియం)
4. గాజుపాము, బ్లైండ్ స్నేక్, సముద్ర సర్పం, ట్రీ స్నేక్ లలో నిజమైన సర్పం కానిది ఏది? - (గాజుపాము)
5. వ్యాపనం ద్వారా శ్వాసక్రియను జరుపుకునే జంతువు? - (అమీబా, వానపాము)
6. నత్త, డేవిల్ ఫిష్, జలగ వాటిలో కర్పరం లేని మొలస్కా వర్గపు జీవి? - (డేవిల్ ఫిష్)
7. పురుషుల్లో ఉండే ప్రోస్టేట్ గ్రంథి బరువు సుమారుగా? - (20 గ్రాములు)
8. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువు కనీసం ఎన్ని కిలోగ్రాముల బరువు ఉండాలి? - (3. 3)
9. 'బ్లూ బేబీ సిండ్రోమ్' ఉన్న శిశువులో ఏ అవయవంలో లోపాలు ఉంటాయి? - (గుండె)
10. 'డౌన్స్ సిండ్రోమ్' ఉన్న మానవునిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? - (47)
11. 'కానిబాల్స్' అంటే? -(తమ వంటి జీవులను తినే జంతువులు)
12. డుడాంగ్, డాల్పిన్, తిమింగలం వీటిలో జలచర క్షీరదం? -(డుడాంగ్, డాల్పిన్, తిమింగలం)
13. వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ ? -(కెరాటిన్)
14. జ్ఞానదంతం, రెటీనా, ఫ్లీహం, క్లోమం వాటిలో అవశేష అవయవం? - (జ్ఞానదంతం)
15. 'ముస్కులర్ డిస్ట్రోఫి' దేనికి సంబంధించిన వ్యాధి? - (కండరాలు)
16. చేప ప్రధాన విసర్జక పదార్ధం? - (అమ్మోనియా)
17. కుల్యా వ్యవస్థను కలిగి ఉండటం ఏ జంతువు లక్షణం? - (స్పంజిక)
18. కప్ప, పాము, ఏనుగు, చేప లలో ఏక రక్త ప్రసరణ కలది? - (చేప)
19. చేప గుండెలో ఉండే కర్ణికల సంఖ్య? - (1)
20. చేప, కప్ప, మొసలి వీటిలో గుండెలో మిశ్రమ రక్తం కల జీవి ? - (కప్ప)
21. ఉష్ణ రక్త జీవులు, బంధిత రక్తప్రసరణ, బ్రాంఖియల్ హృదయం, బాహ్య ఫలదీకరణ వీటిలో చేపల లక్షణం కానిది? - (ఉష్ణ రక్త జీవులు)
22. మలంతో పాటు చీము, రక్తం రావడం ఏ వ్యాధి లక్షణం? - (అమీబిక్ డిసెంట్రీ)
23. 'ఎంటరిక్ ఫీవర్' అని ఏ వ్యాధిని పిలుస్తారు? - (టైఫాయిడ్)
24. ఏ రకానికి చెందిన ట్యూమర్ ను శస్త్ర చికిత్స ద్వారా తొలిగించవచ్చు? - (బినైన్)
25. అధిక బరువును కలిగి ఉన్న మానవుని బాడీమాస్ ఇండెక్స్ ఎంత? - (25 నుంచి 29. 9)
26. కీలు చుట్టూ ఉండే ద్రవాన్ని ఏమంటారు? - (సైనోవియల్)
27. చేతి వేలితో ఒక వ్యక్తి కాలు పై నొక్కినప్పుడు గుంతలు ఏర్పడితే అతడు ఏ వ్యాధితో బాధపడుతున్నట్టు? - (ఎడిమా)
28. టార్పిడో, ఎక్సోసిటస్, డాల్ఫిన్, డెవిల్ ఫిష్ లలో ఎగిరే చేప ఏది? - (ఎక్సోసిటస్)
29. పుట్టిన పిల్లల్లో శ్వాసక్రియ రేటు? - (32)
30. మానవుని శరీరంలో యూరియా సంశ్లేషణ జరిగే ప్రదేశం? - (కాలేయం)
31. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే వినాళ గ్రంథి? - (అవటు)
32. టిబియా అనే ఎముక ఏ భాగంలో ఉంటుంది?- (కాలు)
33. 'వెరికోస్' అనేది దేనికి సంబంధించిన వ్యాధి?- (సిరలు)
34. చిన్నపిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచే కొవ్వు ఏది ? - (బ్రౌన్ ఫ్యాట్)
35. పాలలో ఉండే ప్రోటీన్ ఏది? - (కెసిన్)
36. మానవుని రక్త వర్గాలకు సంబంధించి ఎన్ని జన్యు రూపాలు ఉంటాయి? - (6)
37. 'పెప్సిన్' అనేది ఒక -? - (ఎంజైమ్)
38. కణం ప్రొటీన్ల కర్మాగారం అని దేన్ని పిలుస్తారు? - (రైబోజోమ్)
39. ఎగిరే క్షీరదం అని దేన్ని పిలుస్తారు? - (గబ్బిలం)
40. పాలలో లభించని పోషక పదార్ధం? - (ఇనుము)
41. హెర్పిస్ అనే వ్యాధిని కలుగజేసేది? -(వైరస్)
42. వైడాల్ : టైఫాయిడ్ ::బయాప్సి : - ? - (క్యాన్సర్)
43. ఉసరిలో పుష్కలంగా లభించే విటమిన్? - (విటమిన్ - సి)
44. మూత్రంలో విసర్జితమయ్యే విటమిన్? - (విటమిన్ - సి)
45. బటన్, మిల్కి, పాడిస్ట్రా అనేవి? - (పుట్టగొడుగు రకాలు)
46. వానపాము, బొద్దింక, కప్ప లలో రక్త నాళాలు లేని జంతువు? - (బొద్దింక)
47. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? - (సెరికల్చర్)
No comments:
Post a Comment