General Knowledge - Electricity # 2 - Physics
విద్యుత్ # 2
1. విద్యుత్ ప్రవాహం - ? (అదిశరాశి)
2. ఒక ఆదర్శ అమ్మీటర్ నిరోధం? - (సున్నా)
3. - కు ఓం నియమం అనువర్తించకూడదు? (అర్ధ వాహకాలు)
4. ఒక నిరోధం పొడవును రెట్టింపు చేస్తే నిరోధం - ?(రెట్టింపవుతుంది)
5. ప్రామాణిక నిరోధాలు తయారుచేయడానికి వాడే పదార్ధం? - (కాన్ స్టంటన్)
6. 1 KWH విలువ? - (36 X 105 J)
7. ఒక వాహకం ద్వారా 0. 5 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది. అయితే ఒక నిముషంలో దాని ద్వారా ప్రవహించిన ఆవేశం? - (30C)
8. విద్యుత్ ప్రవహం వల్ల అయస్కాంత ఫలితం కలుగుతుందని కనుగొన్నది? - (ఆయిర్ స్టెడ్)
9. ప్రేరిత విద్యుత్ చాలక బలం దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే నియమం? - (ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన)
10. స్వయం ప్రేరణ గుణకానికి, అన్యోన్య ప్రేరణ గుణకానికి S.I ప్రమాణాలు వరుసగా? - (హెన్రీ, హెన్రీ)
11. ఒక తీగ చుట్ట నుంచి నిలువుగా వదిలిన దండయస్కాంతం తీగచుట్టలో నుంచి కిందకు పడుతోంది. దాని త్వరణం? - (g కంటే తక్కువ)
12. పాస్పర్ - బ్రాంజ్ ధర్మం? - (యంగ్ గుణకం ఎక్కువ, ధృడతా గుణకం తక్కువ)
13. ఫ్యూజ్ వైర్ ముఖ్య ధర్మాలు? - (ఎక్కువ నిరోధం, తక్కువ ద్రవీభవన స్థానం)
14. 'గాస్' కు సమానమైన విలువ? - (104 T)
15. రెండు ఎలక్ట్రానిక్ పుంజాలు సమాంతరంగా ఒకే దిశలో ఉన్నాయి. అవి? - (ఆకర్షించుకుంటాయి)
16. అయస్కాంత అభివాహంలో మార్పు ఆగిపోయినపుడు ప్రేరిత విద్యుత్ చాలక బలం? - (శూన్యం)
17. సమాంతరంగా షంట్ నిరోధాన్ని కలిపిన గాల్వనోమీటర్ ను వలయంలో శ్రేణి లో కలిపితే ఆ అమరిక పేరు? - (అమ్మీటర్)
18. కండెన్సర్ పలకల మధ్య నిరోధకాన్ని ఉంచితే స్థితిశక్తి? - (తగ్గుతుంది)
19. ఒక కండెన్సర్ లో నిలువ ఉండే శక్తి? - (QV)
20. సబ్బు బుడగను ఆవేశ పరిస్తే? - (వ్యాకోచిస్తుంది)
21. ఎలక్ట్రాన్ల శక్తిని పెంచాలంటే వాటిని - ? (విద్యుత్ పొటెన్షియల్ ద్వారా ప్రయాణం చేయించాలి)
22. ఒక వస్తువు ఆవేశానికి, పొటెన్షియల్ కు గల నిష్పత్తి? - (కెపాసిటెన్స్)
23. ఒక సర్పిలాకారపు స్ప్రింగ్ ద్వారా ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని పంపారు. ఆ స్ప్రింగ్ - ? (సంకోచిస్తుంది)
24. 100 w, 200 V బల్బు నిరోధం? - (400Ω)
25. మానవుని నిరోధం సుమారు? - (105 Ω)
26. ఒక అర్థవాహకం ఉష్ణోగ్రతను పెంచినపుడు దాని నిరోధం? - (తగ్గుతుంది)
27. శక్మాంతరాన్ని - తో కొలుస్తారు? (ఓల్టు మీటర్)
28. మేఘాలలోనికి గాలి పటాలను ఎగురవేసి అవి విద్యుత్ ఆవేశంతో ఉంటాయని నిరూపించిన శాస్త్రవేత్త? - (ఫ్రాంక్లిన్)
29. రేడియో, టార్చిలైట్, టేపు రికార్డర్ లలో ఉపయోగించే ప్రాథమిక ఘటం? - (అనార్థ ఘటం)
30. టెలిగ్రాఫ్ లలో ఉపయోగించే కోడ్? - (మోర్స్)
31. ఎలక్ట్రిక్ బల్బుల్లో నింపే వాయువు? - (ఆర్గాన్)
32. కరెంట్ ప్రయాణించడానికి అది ఏ మార్గాన్ని ఎంచుకుంటుంది? - (కనిష్ఠ నిరోధం)
33. షార్ట్ సర్క్యూట్ అయినపుడు వలయంలో కరెంట్? - (పెరుగుతుంది)
34. విశిష్ట నిరోధానికి ప్రమాణం? - (ఓం / మీటర్)
35. బల్బులోని ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు? - (టంగ్ స్టన్)
36. ఇళ్లలోకి సరఫరా చేసే విద్యుత్ పొటెన్షియల్ భేదం? - (240v)
37. నిత్య జీవితంలో విద్యుత్ శక్తిని కొలిచేందుకు ఉపయోగించే పెద్ద ప్రమాణం? - (కిలోవాట్ - గంట)
38. విద్యుత్ ప్రవాహం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని కొలిచే సూత్రం? - (Q = mst)
39. విద్యుత్ రసాయన తుల్యాంకం నకు ప్రమాణం? - (గ్రామ్ / కూలూమ్)
40. విద్యుద్విశ్లేషణం వల్ల కాపర్ సల్ఫేట్ ద్రావణం గాఢత? - (మారదు)
No comments:
Post a Comment