గుప్త సామ్రాజ్యం
1. 2వ చంద్రగుప్తుని ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు? - (పాహియాన్)
2. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలోని కవిపండిత పరిషత్తుకు గల పేరు? - (నవరత్నాలు)
3. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రసిద్ధి చెందిన సంస్కృత కవి? - (కాళిదాసు)
4. కాళిదాసు రచించిన కావ్యాలు? - (రఘువంశం, మేఘదూతం, కుమార సంభవం)
5. కాళిదాసుకి సంబంధించిన నాటకాలు? - (అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికగ్నమిత్రం)
6. సుదీర్ఘ కాలం పాలన సాగించిన గుప్త చక్రవర్తి? - (కుమార గుప్తుడు)
7. హూణుల దండయాత్రలను ఎదుర్కొని మహేంద్రాదిత్య అనే బిరుదు పొందిన చక్రవర్తి? - (కుమార గుప్తుడు)
8. కుమార గుప్తుడు స్థాపించిన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం? - (నలంద)
9. మౌర్యచంద్రగుప్తుడు నిర్మించిన గుజరాత్ సుదర్శన తటాకానికి మరమ్మత్తులు చేయించిన గుప్త చక్రవర్తి? - (స్కంధ గుప్తుడు)
10. అశ్వమేధ యాగం చిహ్నాలతో బంగారు నాణేలు జారీచేసిన గుప్త చక్రవర్తులు? -(సముద్ర గుప్తుడు, కుమార గుప్తుడు)
11. గుప్తుల కాలంలో రాష్ట్రాలకు ఏమని పేరు? - (భుక్తులు)
12. గుప్తుల పాలన ఉద్యోగులు, వారి వృత్తి ధర్మానికి సంబంధించినవి? - (మహాదండనాయక - సైన్యాధికారి, కుమారమాత్య - యువరాజు, మహాప్రతిహారి - ఉన్నతోద్యోగి)
13. ఈరాన్ శాసనం ఏ దురాచారాన్ని తెలియజేస్తుంది? -(సతీసహగమనం)
14. గుప్తుల స్వర్ణయుగానికి మాయని మచ్చగా నిలిచే దురాచారం? - (అంటరానితనం)
15. గుప్తుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి? - (భూదానాలు అధికమయ్యాయి, భూస్వామ్య వ్యవస్థ బలపడింది & చైనా, రోమ్, పర్షియాలతో విదేశీ వ్యాపారం పెరిగింది)
16. గుప్తుల కాలంలోని ప్రధాన రేవు పట్టణాలు? - (తామ్రలిప్తి, బ్రోచ్ & సింధ్)
17. దేవీ చంద్రగుప్తం, ముద్రా రాక్షసం గ్రంథాలను రచించింది? - (విశాఖదత్తుడు)
18. గుప్తుల కాలంలో రచనలు, రచయితలు (కమందకుడు - నీతిసారం, భానుడు - సప్నవాసవ దత్తం & వజ్జికుడు - కౌముది మహోత్సవం)
19. ప్రఖ్యాత ఖగోళ, జ్యోతిష్య పండితుడు వరాహమిహురుడు రాసిన గ్రంథాలు - (పంచ సిద్ధాంతిక, బృహత్ సంహిత, బృహత్ జాతకరత్నావళి)
20. న్యూటన్ కన్నా ముందే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని నిరూపించింది? - (బ్రహ్మ గుప్తుడు)
21. '0' వినియోగాన్ని, p (22/7) విలువను ప్రపంచానికి అందించిన రాజవంశం? - (గుప్తులు)
22. వాగ్భటుడు రచించిన ప్రఖ్యాత వైద్య గ్రంథం? - (అష్టాంగ సంగ్రహణం)
23. పలకాప్యుడు రచించిన 'హస్తాయుర్వేదం' గ్రంథ ప్రధానాంశం? - (పశువైద్య గ్రంథం)
24. గుప్తులు నిర్మించిన ప్రఖ్యాత దేవాలయానికి సంబంధించిన ప్రదేశాలు - (భూమారా - శివాలయం, దేవఘడ్ - దశావతారాలయం, టిగావో - విష్ణు దేవాలయం)
25. గుప్తుల కాలంలో 'మెహరౌలీ' ప్రాంతం ప్రసిద్ధి చెందడానికి కారణం? - (ఇనుప స్తంభం)
26. గుప్తుల కాలం నాటి వర్ణ చిత్రాలు ఉన్న ప్రదేశం? - (భాగ్)
27. అజంతా గుహల్లోని వర్ణ చిత్రాలకు సంబంధించి గుప్తులకు చెందిన గుహలు - (17,18,19)
28. గుప్తుల కాలంలో శస్త్ర చికిత్సలు ప్రారంభించిన తొలి వైద్యుడు - (సుశ్రుతుడు)
No comments:
Post a Comment