శాసనాలు - శాసనకర్తలు
శాసనాలు
|
శాసనకర్తలు
|
నాసిక్ శాసనం | గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ, అతడి తల్లి గౌతమీ బాలశ్రీ వేయించింది. |
నానాఘాట్ శాసనం | మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ, అతడి భార్య నాగనిక వేయించింది. |
ఐహోల్ శాసనం | 2 వ పులకేశి విజయాలను తెలుపుతోంది. ఈ శాసనాన్ని రవికీర్తి రచించారు |
హాతిగుంపు శాసనం | దీన్ని వేయించింది కళింగ చక్రవర్తి ఖారవేలుడు. |
అలహాబాద్ శాసనం | సముద్రగుప్తుని విజయాల గురించి తెలుపుతుంది. ఈ శాసనాన్ని హారసేనుడు రచించారు |
చేజేర్ల శాసనం | కందరుడు వేయించాడు. కందరుని విజయాల గురించి వివరిస్తుంది. |
బయ్యారం చెరువు శాసనం | దీన్ని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది. |
జునాఘడ్ శాసనం | రుద్రదమనుడు వేయించాడు. |
భట్టిప్రోలు శాసనం | కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమ సభల గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. |
ఉత్తర మేరూర్ శాసనం | మొదటి పరాంతకుని గురించి వివరిస్తుంది. ఈ శాసనం దక్షిణ భారతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్ధిల్లాయని తెలుపుతుంది. |
అద్దంకి శాసనం | పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనం. |
No comments:
Post a Comment