Social Icons

Pages

Monday, December 11, 2017

General Knowledge - Sound

ధ్వని 
1. గాలిలో ధ్వని వేగం ....... (ఉష్ణోగ్రత తగ్గితే తగ్గుతుంది)

2. ప్రతి 1℃ ఉష్ణోగ్రతలో పెరుగుదలకు ధ్వని వేగంలో పెరుగుదల సుమారు ....... (0.6 m/s)

3. గాలిలో ప్రసరించే ధ్వని తరంగాలు ----- ధర్మాన్ని ప్రదర్శించదు. (ధృవణం)

4. గాలిలో, అతిధ్వనుల తరంగ ధైర్ఘ్యం...... (5 ✖ 10⁻⁵ cm)

5. వాయువుల్లో ధ్వని వేగం పరమ శూన్య ఉష్ణోగ్రత - కు అనులోమానుపాతంలో ఉంటుంది. (వర్గమూలం)

6. స్థిర తరంగంలో అస్పందన బిందువుల వద్ద కణాల గతిజశక్తి - (శూన్యం)

7. విస్పందనాలు అనే దృగ్విషయం వేటిలో కనిపిస్తాయి? (ధ్వని, కాంతిలో)

8. ఒక స్థిర తరంగంలో  ........ (శక్తి బదిలీ జరగదు)

9.  ధ్వని తరంగాలుకు , కాంతి తరంగాలుకు గల సామాన్య లక్షణం? - (వ్యతికరణ ధర్మము పాటిస్తాయి)

10. ఒక శృతి దండం కంపించడం వల్ల ఒక యానకంలో తరంగాలు జనిస్తాయి. యానకం ఉష్ణోగ్రత మారినప్పుడు మారే అభిలక్షణం ? (తరంగ ధైర్ఘ్యం)

11. ధ్వని ప్రసరణ ఒక ......... (స్థిరోష్ణక ప్రక్రియ)

12. రాతిలో ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది? (తిర్యక్ తరంగ)

13. స్థిర తరంగంలో ఏ బిందువు వద్ద పీడనంలో మార్పు గరిష్టం ? (అస్పందన స్థానం వద్ద)

14. ధ్వని తరంగాలు గాలి నుంచి నీటిలోకి ప్రయాణిస్తే (పౌనఃపున్యం మారదు, తరంగ ధైర్ఘ్యం మారుతుంది, తరంగ వేగం మారుతుంది)

15. అనుధైర్ఘ్య తరంగాలలో సంపీడనాల వద్ద ఉష్ణోగ్రత? (పెరుగుతుంది)

16. తరంగ చలనంలో తారంగం చేరవేసే శక్తి - కు సమానం? (స్థితి శక్తి, గతిశక్తుల మొత్తం)

17. ఒక యానకంలో ధ్వని ప్రసరణ ఉండాలంటే దానికి కావలసింది? (స్థితిస్థాపకత, జడత్వం)

18. స్ప్రింగ్ - ద్రవ్యరాశి వ్యవస్థలో ఏర్పడే తరంగాలు? (అనుధైర్ఘ్య తరంగాలు)

19. లఘులోలకం పొడవును పెంచితే పౌనఃపున్యం? (తగ్గుతుంది)

20. కాలంతో తగ్గిపోయే కంపన పరిమితులు ఉన్న ఆవర్తన చలనాన్ని ఏమంటారు? (అపరుద్ద కంపనాలు)

21. శృతి దండం భుజానికి కొద్దిగా మైనాన్ని అంటిస్తే, దాని పౌనఃపున్యం....... (కొద్దిగా తగ్గుతుంది)

22. చంద్రుని ఉపరితలంపై ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే....... (అసలు సంభాషణలు వినిపించవు)

23. శృతి దండం రెండు చివరలా కొద్దిగా అరగదీస్తే తరచుదనం........  (పెరుగుతుంది)

24. హైడ్రోజన్ లో ధ్వని వేగం ....... (1269 m/s)

25. అతిధ్వనులను కనుగొన్న శాస్త్రవేత్త? (గాల్టన్ )

No comments:

Post a Comment