Social Icons

Pages

Wednesday, November 29, 2017

General Knowledge - Indian History

ప్రాచీన భారతదేశ చరిత్ర 
(క్రీ. పూ . 2750 - 1750)
1. 'కాళీభంగన్' అనే సింధు నాగరికత పట్టణం ఏ రాష్ట్రానికి చెందింది? - (రాజస్థాన్)

2. కాళీభంగన్ లో బయల్పడిన ఆధారాల్లో ఒంటె ఎముకలు, అగ్నిహోమ గుండాలు, లిపి ఆధారాలు లో సరియైనది ఏది? - (ఒంటె ఎముకలు, అగ్నిహోమ గుండాలు, లిపి ఆధారాలు)

3. సింధు ప్రజలు ఉపయోగించిన ప్రధాన రేవు పట్టణం? - (లోథాల్)

4. స్త్రీ, పురుషుల జంట అస్థికలతో కూడిన శవపేటిక లభ్యమైన సింధు నగరం? - (లోథాల్)

5. సింధు ప్రజలకు గుఱ్ఱము తెలియనప్పటికీ దాని అవశేష ఎముకలు బయటపడిన నగరం? - (సుర్ కొటడా)

6. సింధు నాగరికత ప్రదేశాలు అధికంగా ఏ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి? - (గుజరాత్)

7. సరస్వతి నది ఒడ్డున ఏర్పడి, బార్లీ పంటకు నిలయమైన సింధు నాగరికత నగరం? - (బన్వాలీ)

8. సింధు నాగరికత స్థావరాల్లో హరప్పా పెద్ద నగరం కాగా, భారత దేశంలో పెద్ద నగరం? - (ధోల్ వీర)

9. సింధు నాగరికత పూర్వ సంస్కృతిని, ఆధారాలను కనుగొన్న పట్టణం? - (కోటాడిబి)

10. 'సింధు ప్రజల పాలకులు పురోహితులు' అని అభిప్రాయపడింది? - (డి. డి. కౌశాంబి)

11. సింధు ప్రజలు ఏ వర్గానికి చెందిన వారనే అభిప్రాయం ఎక్కువగా ఉంది? - (మెడిటేరియన్స్)

12. సింధు నాగరికత ఏ యుగానికి చెందింది? - (కాంస్య యుగం)

13. భారత దేశంలో కనుగొన్న తొలి లోహం? - (రాగి)

14. సింధు నాగరికతలో పేర్కొన్న "గ్రిడ్ చతుష్టయం' దేనికి చెందింది? - (నగర వీధుల నిర్మాణం)

15. ఇతర నాగరికతల్లో లేని ఏ అంశం సింధు నాగరికతలో ప్రశంసలు పొందింది?- (డ్రైనేజీ వ్యవస్థ)

16. మురుగునీటి పారుదల వ్యవస్థలేని ఏకైక సింధు నగరం?- (బన్వాలీ)

17. పాచికలు, చదరంగ బల్ల, త్రాసు లభించిన సింధు నాగరికత పట్టణం? - (లోథాల్)

18. సింధు ప్రజల ప్రధాన వృత్తి? - (వ్యవసాయం)

No comments:

Post a Comment