Social Icons

Pages

Friday, November 10, 2017

General Knowledge - Ancient Indian History

ప్రాచీన భారతదేశ  చరిత్ర 
(క్రీ. పూ. 2750 - 1750)
1. భారతదేశ చరిత్ర అధ్యయనానికి 1784 లో రాయల్ ఏషియాటిక్ సొసైటీని ఏర్పాటు చేసింది ఎవరు? - (విలియం జోన్స్)

2.  హరప్పా వద్ద పురాతన గుట్టలను 1826 లో తొలిసారి కనుగొన్నది ఎవరు? -(చార్లెస్ మాసన్)

3. పురావస్తు శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? - (లార్డ్ కర్జన్)

4. సింధు నాగరికత తవ్వకాలను నిర్వహించిన పురావస్తు శాఖాధిపతి ఎవరు? - (జాన్ మార్షల్)

5. క్రీ. శ 1921  సింధు నాగరికతకు సంబంధించి బయల్పడిన తొలిప్రదేశం - (హరప్పా)

6. సింధు నాగరికతకు "హరప్పా నాగరికత" అని పేరు రావడానికి ప్రధాన కారణం - (తవ్వకాలలో బయల్పడిన తొలినగరం)

7. సింధు నాగరికతకు ఆ పేరు పెట్టిన పురావస్తు శాస్త్రవేత్త - (జాన్ మార్షల్)

8. హరప్పా నగరానికి సంబంధించి కింది వాటిలో వాస్తవం ఏది?
ఎ) ఇది పాకిస్థాన్ మౌంట్ గోమారీ జిల్లాల్లో వర్ధిల్లింది
బి) రావి నది ఒడ్డున బయల్పడింది 
సి) దయారాం సహాని తవ్వకాలు నిర్వహించారు
డి) పైవన్నీ                                  (డి)

9. హరప్పా వద్ద చేపట్టిన తవ్వకాల్లో లభించిన ఆధారాల్లో సరి అయినది ఏది?
ఎ) 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు 
బి) H ఆకారంలో శ్మశాన వాటిక
సి) కార్మికుల నివాస గృహాలు 
డి) పైవన్నీ                                  (డి)

10. ధాన్యాగార వరుసలు కనుగొన్న కారణంగా హరప్పాను ఏ పేరుతో వ్యవహరించారు? - (సిటీ ఆఫ్ గ్రానరీస్ )

11. 1922 లో కనుగొన్న మొహంజదారో నగరాన్ని సింధీ భాషలో ఏమని వ్యవహరిస్తారు? - (మృతుల దిబ్బ)

12. మొహంజదారో నగరాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ? - (ఆర్. డి. బెనర్జీ)

13. మొహంజదారోలో బయల్పడిన అపురూప కట్టడం? - (బృహత్ స్నానవాటిక)

14. మొహంజదారోలో లభించిన జంతువులతో కలిసి ఆశీనుడైన వ్యక్తి ప్రతిమ ముద్రికను మార్షల్ ఎవరుగా భావించారు? - (పశుపతి)

15. 1925 లో మజుందార్, మాకి అనే శాస్త్రవేత్తలు కనుగొన్న సింధు నగరం? - (చన్హు దారో)

No comments:

Post a Comment