Social Icons

Pages

Featured Posts

Monday, November 4, 2024

అన్ని పోటీపరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - పక్షులు

 అన్ని పోటీపరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - పక్షులు

1. పక్షుల్లో ప్రధాన నత్రజని వ్యర్థ పదార్థం?

a) యూరియా  b) అమోనియా  c) యూరిక్ ఆమ్లం  d) ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్   (c)


2. ఏ దేశ జాతీయ పక్షి అంతరించిపోయింది?

a) శ్రీలంక  b) పెరూ  c) నైజీరియా  d) మారిషస్  (d)


3. కింది వాటిలో పక్షులకు సంబంధించి సరికాని విషయం?

a) పక్షి మెదడులో అనుమస్తిష్కం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.

b) ఆధునిక పక్షుల్లో దంతాలు ఉండవు

c) పక్షుల్లో వాసన గ్రహించే గుణం అధికంగా ఉంటుంది

d) పక్షి తోకపై ఉన్నవి రెట్రిసస్ ఈకలు     (c)


4. నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉన్న జిల్లా?

a) రంగారెడ్డి  b) వరంగల్  c) ఖమ్మం  d) నెల్లూరు  (d)


5. కింది వాటిలో నిల్చుని గుడ్లు పెట్టే ఏకైక పక్షి

a) బాతు  b) రాబందు  c) ఆస్ట్రిచ్  d) పెంగ్విన్  (d)


6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ పక్షి శాస్త్రీయ నామం?

a) కొరేసియస్ బెంగాలెన్సిస్  b) స్ట్రుతియో కామెలస్  

c) కోర్వస్ స్ప్లెండర్స్  d) స్టెర్నా మాక్రూరా  (a)


7. వేగవంతమైన పక్షి?

a) గోల్డెన్ ఫ్లోవర్  b) స్విఫ్ట్  c) ఉడ్ కాక్  d) ఆర్కిటిక్ టెర్న్     (b)


8. ఋతువులకు అనుగుణంగా కొన్ని పక్షులు ప్రదర్శించే ప్రత్యేక వలస ప్రవర్తన అధ్యయనం?

a) ఫ్రైనాలజి  b) ఫెనాలజి  c) అంజియాలజీ  d) ఇథాలజీ      (b)


9. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుని మన రాష్ట్రంలో పెంచుతున్న పక్షి?

a) కివి  b) బట్టమేక పక్షి  c) ఈమూ  d) ఆస్ట్రిచ్  (c)


10. డార్విన్‌కు స్ఫూర్తినిచ్చిన ఫించ్ పక్షులు ఎక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి?

a) జావా  b) మలయాదీవులు  c) నికోబార్ దీవులు  d) గలపగాస్ దీవులు   (d)


11. ఏ దేశానికి చెందిన హమ్మింగ్ పక్షి అన్నింటి కంటే చిన్నది?

a) క్యూబా  b) మెక్సికో  c) అర్జెంటీనా  d) కెనడా       (a)


12. ఏ మాసాల మధ్య నెమలి ప్రజననం చెందుతుంది?

a) డిసెంబరు - ఫిబ్రవరి  b) మార్చి - మే  c) జూన్ - ఆగస్టు  d) సెప్టెంబర్ - నవంబర్    (c)


13. ఏ పక్షిలో రెక్కలు తెడ్లుగా రూపాంతరం చెందాయి?

a) బాతు  b) సీగల్  c) పెంగ్విన్  d) టరామిగన్     (c)


14. కింది వాటిలో “ఎకోలొకేషన్”ను ప్రదర్శించే జీవి?

a) పాములు  b) కుక్కలు  c) గబ్బిలం  d) తొండలు  (c)


15. పక్షుల్లో కెల్లా పెద్దది?

a) దక్షిణ అమెరికా ఆస్ట్రిచ్  b) ఆఫ్రికా ఆస్ట్రిచ్  c) బట్టమేక పక్షి  d) టినామస్    (b)


16. అస్సన్ బ్యారేజి పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

a) అసోం  b) పశ్చిమ బెంగాల్  c) కర్ణాటక   d) ఉత్తరాఖండ్    (d)


17. ఎగిరే పక్షిలో గాలితో నిండిన ఎన్ని వాయుకోశాలు ఉంటాయి?

a) 7  b) 8  c) 9  d) 10     (c)


18. గుడ్లను పెట్టే క్షీరదాలు కింది ప్రాంతంలో మాత్రమే కన్పిస్తాయి?

a) న్యూజిలాండ్  b) శ్రీలంక  c) ఆస్ట్రేలియా  d) నార్వే  (c)


19. రోళ్లపాడు అభయారణ్యంలో ఏ పక్షిని ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు?

a) నెమలి  b) పాల పిట్ట  c) రాబందు  d) బట్టమేక పక్షి    (d)


20. కేవ్ లాదేవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?

a) గుజరాత్  b) రాజస్థాన్  c) ఉత్తరాఖండ్  d) హర్యానా  (b)


21. గుజరాత్ రాష్ట్ర పక్షి?

a) గ్రేటర్ ప్లెమింగో  b) బ్లాక్ - క్రెస్టెడ్ బుల్ బుల్  c) బ్లాక్ ఫ్రాంకోలిన్  d) బ్లాక్ నెక్డ్ క్రేన్   (a)


22. బట్టమేక పక్షి ఏ రాష్ట్రానికి రాష్ట్రీయ పక్షి?

a) రాజస్థాన్  b) కర్ణాటక  c) తమిళనాడు  d) ఉత్తరప్రదేశ్   (a)


23. పశువుల్లో వాడే ఏ వాపు నివారణ మందు రాబందుల గణనీయ తగ్గుదలకు కారణం?

a) ఆస్పిరిన్  b) డైక్లోఫినాక్  c) డిడిటి  d) పైరాజినమైడ్    (b)


24. కింది జీవుల్లో మాత్రమే టెలిస్కోపిక్ 'దృష్టి' ఉంటుంది?

a) చేపలు  b) పాములు  c) పక్షులు  d) కుక్కలు   (c)


25. పాలపిట్ట ఆంధ్రప్రదేశ్ తో  పాటు ఏ రాష్ట్రాల రాష్ట్రీయ పక్షి?

a) హిమాచలప్రదేశ్, గోవా  b) కేరళ, మధ్యప్రదేశ్ 

 c) తమిళనాడు, మహారాష్ట్ర  d) బీహార్, కర్ణాటక   (d)


26. శబ్దిని అభివృద్ధి చెంది ఉన్న ఏకైక ఎగరని పక్షి?

a) ఆఫ్రికా ఆస్ట్రిచ్  b) దక్షిణ అమెరికా ఆస్ట్రిచ్  c) కివి  d) ఈము  (b)


27. అధిక రెక్కల వ్యాసం ఉన్న పక్షి?

a) సీగల్  b) సీ ఆల్బట్రాస్  c) బ్లడ్ ఫిజంట్  d) బ్లాక్ నెక్డ్ క్రేన్   (b)

Sunday, October 27, 2024

భారత అంతరిక్ష కార్యక్రమం... ఇస్రో కేంద్రాలు బహుళైశ్చిక ప్రశ్నలు

  భారత అంతరిక్ష కార్యక్రమం... ఇస్రో కేంద్రాలు బహుళైశ్చిక ప్రశ్నలు

1) చంద్రయాన్‌-1 ప్రయోగంలో భాగంగా ప్రయోగించిన మొత్తం పేలోడ్‌లు ఎన్ని?

1) 11      2) 12          స3) 10          4) 9       (1)


2) భారత కమ్యూనికేషన్‌ సేవల ఉపగ్రహం ఇన్‌శాట్‌-4బిని ఎక్కడ నుంచి ప్రయోగించారు?

1) తుంబ  2) బైకనూర్‌     3) శ్రీహరికోట  4) ఫ్రెంచ్‌ గయానా       (4)


3) ఒకేసారి పది ఉపగ్రహాలను ఇస్రో ఏ ఉపగ్రహ నౌక ద్వారా ప్రయోగించింది?

1) పీఎస్‌ఎల్‌వీ-సీ9            2) పీఎస్‌ఎల్‌వీ-సీ10   3) పీఎస్‌ఎల్‌వీ-సీ11        4) పీఎస్‌ఎల్‌వీ- సీ7     (1)


4) ఏ ఉపగ్రహ నౌక ద్వారా చంద్రయాన్‌-1 ప్రయోగించారు?

1) PSLV-C9            2) PSLV-C10

3) PSLV-C11            4) ఏదీ కాదు          (3)


5) ఇస్రో త్వరలో ప్రయోగించనున్న రిమోట్‌ సెన్ఫింగ్‌ ఉపగ్రహం ?

1) కార్టోశాట్‌-2ఎ         2) ఓషన్‌శాట్‌-2  3) రీశాట్‌ (RISAT)        4) ఏదీ కాదు     (3)


6) పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ఎన్ని దశల అంతరిక్ష నౌక?

1) 4       2) 3           3) 2         4) 5        (1)


7) ఇటీవల పీఎస్‌ఎల్‌వీ-సీ8 తో ప్రయోగించిన ఉపగ్రహం ఏది? 1

1) ఇటాలినో  2) ఇటైలీ       3) అజైల్‌       4) రొమైలీ          (3)


8) విక్రమ్‌ సారాభాయి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన ఏ గట్టి పదార్థాన్ని దంతాల్లో రంధ్రాలను పూడ్చడానికి వినియోగిస్తారు?1

1) కెవ్లార్‌ 2) ఆఫ్లెక్స్‌       3) ఐసోపాలియాల్‌ 4) సెఫెన్‌      (1)


9) పీఎస్‌ఎల్‌వీ మొదటి దశలో వాడే ఘన ఇంధనం?

1) అన్‌సిమెట్రికల్‌ డై మిథైల్‌ హైడ్రోజన్‌

2) హైడ్రాక్సీటెర్మినేటెడ్‌ పాలీ బ్యూటాడైఈన్‌

3) అమోనియం పర్‌క్లోరేట్‌

4) నైట్రోజన్‌ టెట్రాక్సెడ్‌         (2)


10) చంద్రయాన్‌-1,   చంద్రయాన్‌-2,   ఏ స్ట్రోశాట్‌  వంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని గ్రహించేందుకు ఉద్దేశించిన భారీ గ్రౌండ్‌ స్టేషన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (DSN) ఎక్కడ ఏర్పాటు అవుతోంది?

1) బ్యాలాలు, కర్ణాటక         2) నాగ్‌పూర్‌, మహారాష్ట్ర  3) జోధ్‌పూర్‌, రాజస్థాన్‌         4) ఏదీ కాదు   (1)

Sunday, September 29, 2024

Ancient Indian Books and Authors.

 Ancient Indian Books and Authors.

  • Amarkosa - Amarasimha.
  • Abhigyan Shakuntalam - Kalidasa.
  • Aihole Prasasti - Ravi Kriti.
  • Arthasastra - Kautilya.
  • Astadhyayi  - Panini.
  • Buddha Charita - Asvaghosa.
  • Gitagovinda - Jayadev.
  • Indica - Megasthanese.
  • Kamasutra - Vatsayana.
  • Kathasaritsagara - Somdeva.
  • Mahabhasya - Patanjli.
  • Mrichhakatika - Sudraka.
  • Mudrarakshasa - Visakdatta.
  • Nagananda - Harshvardhana.
  • Naishadhacharita - Sri Harsha.
  • Navratna - Virsena.
  • Natyashastra - Bharata.
  • Nitisara - Kamandaka.
  • Panch tantra - Vishnu Sharma.
  • Prashnottarmalika - Amoghavarsha.
  • Rajtarangini - Kalhana.
  • Raghuvansan - Kalidasa.
  • Swapanvasdattam - Bhasa.
  • Surya Sidhanta - Aryabhatta.
  • Vikramorvashi - Kalidasa.

Tuesday, October 31, 2023

ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

 ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా?

జ. 29%, 71%

2. దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. జలభాగం

3. పేంజియాకు మధ్యలో ఉన్న సముద్రం?

జ. టెథిస్

4. ‘ఖండ చలన సిద్ధాంతాన్ని’’ ప్రతిపాదించింది?

జ. ఆల్ఫ్రెడ్ వెజినర్

5. ‘‘లారెన్షియా’’కు మరో పేరు?

జ. అంగారా

6. పూర్వం భూభాగం అంతా ఒకే ఖండ భాగంగా ఉన్నప్పుడు దానిని ఏమనేవారు?

జ. పేంజియా

7. లారెన్షియా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలుగా

8. ఖండాల్లో పెద్దది, చిన్నది?

జ. ఆసియా, ఆస్ట్రేలియా

9. పేంజియాను అన్ని వైపులా ఆవరించి ఉన్న సముద్రం?

జ. పెంథాల్సా

10. మహాసముద్రాల్లో పెద్దది, లోతైనది?

జ. పసిఫిక్ మహాసముద్రం

11. ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. భూభాగం

12. కేప్ యార్‌‌క అనేది?

జ. ద్వీపకల్పం

13. ‘లారెన్షియా’ అంటే?

జ. టెథిస్‌కు ఉత్తరంగా ఉన్నభూభాగం

14. గ్రీన్‌లాండ్ ఓ?

జ. ద్వీపం

15. టెథిస్‌కు దక్షిణంగా ఉన్న భూభాగం?

జ. గోండ్వానా

16. అన్ని వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపం

17. మహా సముద్రాల్లో అతి చిన్నది?

జ. ఆర్కిటిక్ మహాసముద్రం

18. గోండ్వానా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికా

19. మూడు వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపకల్పం

Tuesday, July 26, 2022

మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు

 మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు 

1. భారతదేశం మొదటగా భూకక్ష్యలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం?

1) ఆర్యభట్ట  2) భాస్కర-1  3) ఇన్‌శాట్ - 1బి   4) భాస్కర - 2   (1)

2. అన్నింటికంటే ప్రకాశంగా కనిపించే గ్రహం?

1) శని  2) భూమి  3) శుక్రుడు  4) బుధుడు   (3)

3. పగలు, రాత్రి ఏర్పడడానికి కారణం?

1) భూ పరిభ్రమణం  2) భూ భ్రమణం  3) ఉల్కాపాతం  4) ఏదీకాదు    (2)

4. సూర్య గ్రహణం ఏ సందర్భంలో ఏర్పడుతుంది?

1) భూమి.. చంద్రుడికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు  

2) చంద్రుడు.. భూమికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు

3) సూర్యుడు భూమి, చంద్రుడి మధ్య వచ్చినప్పుడు      4) అన్నీ         (2)

5. రాశుల్లో అన్నింటికంటే పెద్ద తారాగణం?

1) సెరస్  2) ఇంకారస్  3) హైడ్రా  4) హేలీ   (3)

6. రష్యా సహకారంతో భారతదేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పర్చిన ప్రదేశాలు?

1) తుంబా  2) శ్రీహరికోట  3) ఢిల్లీ  4) 1, 2  (4)

7. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం?

1) శని  2) బృహస్పతి  3) బుధుడు  4) శుక్రుడు  (1)

8. ఇప్పటివరకు గుర్తించిన నక్షత్రాల్లో అతిపెద్దది?

1) సెరస్  2) ఎప్సిలాన్ అరిగ  3) హైడ్రా  4) ఇంకారస్  (2)

9. మొట్టమొదటి స్పేస్ షటిల్?

1) అపోలో  2) స్పుత్నిక్  3) కొలంబియా  4) వస్తోక్   (3)

10. స్కైలాబ్ అనే ప్రయోగాత్మక అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏ దేశం ఏర్పాటు చేసింది?

1) రష్యా   2) అమెరికా  3) ఇండియా  4) సింగపూర్   (2)

11. చంద్రుడు తన చుట్టూ తాను, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు? 

1) 30 రోజులు  2) 29 1/2 రోజులు   3) 92 1/2 రోజులు   4) 29 రోజులు  (2)

12. ధ్రువ నక్షత్రం నావికులకు దేన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది? 

1) గెలాక్సీ  2) గాలి  3) దిక్కు  4) వాతావరణం  (3)

13. ఒక కాంతి సంవత్సరం (కి.మీ.లలో)? 

1) 3 ×104 × 60 × 60 ×24 × 365.25  2) 3 × 102 × 60 × 60 × 24 × 365.25  

3) 3 × 105 × 60 × 60 × 24 × 365.25  4) 3 ×103 × 60 × 60 × 24 × 365.25    (4)

14. నక్షత్రాలు కాంతిని నలుదిశలకు వెదజల్లా లంటే వాటిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత? 

1) 10 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  2) 5 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  

3) 5 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  4) 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  (4)

15. 1994లో విజయవంతంగా ప్రయోగించిన భారతీయ ఉపగ్రహ నౌక? 

1) ఇన్‌శాట్-1బి  2) పీఎస్‌ఎల్‌వీడీ-2  3) భాస్కర-2  4) ఆర్యభట్ట   (2)

16. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం?

1) 149,000,000 కి.మీ.  2) 149,598,500 కి.మీ.  3) 149,593,300 కి.మీ  4) 149,895,500 కి.మీ.  (2)

17. ఏ అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు? 

1) స్కాటర్‌‌న - 5, స్కాటర్‌‌న - 6  2) అపోలో - 11, సోయూజ్-టీ-11  

3) వైకింగ్-1, వైకింగ్-2  4) సోయూజ్ -టీ-11, శాల్యూట్  (3)

18. బుధ గ్రహం పరిభ్రమణ కాలం? 

1) 88 రోజులు  2) 248 రోజులు 3) 365 రోజులు  4) 243 రోజులు   (1)

19. స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేసిన రోజు? 

1) 3-6-1984  2) 3-4-1984  3) 3-4-1985  4) 3-6-1985  (2)

20. భూమధ్య రేఖ వద్ద భూమి వ్యాసం కి.మీ.లలో?

1) 12,576  2) 12,657  3) 12,756  4) 12,765   (3)

21. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో ద్రవ్యరాశిలో రెండో స్థానంలో ఉన్న గ్రహం, ఆత్మభ్రమణ కాలం అన్నింటి కంటే ఎక్కువ ఉన్న గ్రహం వరుసగా? 

1) బృహస్పతి, భూమి  2) బుధుడు, అంగారకుడు  3) శని, శుక్రుడు  4) నెప్ట్యూన్, యురేనస్  (3)

22. స్పేస్ ప్రోబ్‌కు ఉదాహరణ? 

1) పయనీర్  2) ఆర్యభట్ట  3) భాస్కర - 2  4) అట్లాంటిస్  (1)

23. ఏ గ్రహం మీద ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడిన వాతావరణం ఉంది? 

1) కుజుడు   2) బుధుడు  3) బృహస్పతి  4) యురేనస్    (1)    


Sunday, July 24, 2022

పోటీ పరీక్షల ప్రత్యేకం - భౌగోళిక శాస్త్రం - ద్వితీయ భూస్వరూపాలు

 పోటీ పరీక్షల ప్రత్యేకం - భౌగోళిక శాస్త్రం - ద్వితీయ భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలోని భూభాగాన్ని ప్రధానంగా ఏ విధంగా విభజించారు?

జ. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు

2. సముద్రమట్టం నుంచి సుమారు 800 మీ. కన్నా ఎత్తుగా ఉండి, వాలు ఎక్కువగా ఉండే భూస్వరూపాన్ని ఏమంటారు?

జ. పర్వతం

3. ఆల్ఫ్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

జ. ఐరోపా

4. అట్లాస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

జ. ఆఫ్రికా

5. భూఅంతర్భాగంలో సంపీడన బలాలు పని చేయడం వల్ల ఏర్పడే పర్వతాలు?

జ. ముడుత పర్వతాలు

6. ముడుత పర్వతాలకు ఉదాహరణ?

జ. ఆసియాలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండిస్, ఉత్తర అమెరికాలో రాకీ

7. భూఅంతర్భాగంలో విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుచించుకుపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?

జ. ఖండ పర్వతాలు

8. ఖండ పర్వతాలపై ఉన్న భూభాగాన్ని ఏమంటారు?

జ. భ్రంశోద్ధి శిలా విన్యాసం

9. ఖండ పర్వతాల్లో లోపలికి కుచించుకుపోయిన భాగాన్ని ఏమంటారు?

జ. గ్రేబెల్

10. భూఅంతర్భాగం నుంచి లావా బయటకు ప్రవహించి భూమి ఉపరితలంపై విస్తరించడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?

జ. అగ్ని పర్వతాలు

11. కిలిమంజారో అగ్ని పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?

జ. మధ్య ఆఫ్రికా

12. ఇటలీలోని ప్రముఖ అగ్ని పర్వతం?

జ. వెసూవియస్

13. ప్యూజియామా అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?

జ. జపాన్

14. పీఠభూమి అంచుల్లో ఏర్పడ్డ అగ్ని పర్వతాలకు ఉదాహరణ?

జ. ఆగ్నేయ ఆఫ్రికాలోని డ్రాకన్‌‌సబర్‌‌గ పర్వతాలు, ఇండియాలోని వింధ్య సాత్పూర పర్వతాలు

15. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం చాలా ఎత్తుగా ఉన్న పర్వతాలు క్రమేణా వికోషీకరణం చెంది ఎత్తును, పరిమాణాన్ని కోల్పోగా మిగిలిన పర్వతభాగాన్ని ఏమంటారు?

జ. అవశిష్ట పర్వతం

16. అవశిష్ట పర్వతానికి మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని ఆరావళి పర్వతాలు

17. సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తులో ఉండి కొద్దిపాటి ఎత్తు పల్లాలతో ఇంచుమించు సమతల ఉపరితలం గల భూస్వరూపం?

జ. పీఠభూమి

18. పర్వతాలతో పరివేష్టితమై ఉన్న పీఠభూముల్ని ఏమంటారు?

జ. పర్వతాంతర పీఠభూములు

19. ఏ రకమైన పీఠభూములు మిగతా వాటి కంటే చాలా ఎత్తులో ఉంటాయి?

జ. పర్వతాంతర పీఠభూములు

20. పర్వతాంతర పీఠభూములకు మంచి ఉదాహరణ?

జ. హిమాలయాలకు ఉత్తరంగా ఉన్న టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి

21. పర్వతాల దిగువున వాటి పాదాల దగ్గర ఏర్పడే పీఠభూములు?

జ. పర్వత పాద పీఠభూములు

22. పర్వత పాద పీఠభూములకు ఓవైపు పర్వతాలుంటే మరోవైపు ఉండేవి?

జ. మైదానాలు (లేక) సముద్రాలు

23. భూమి అంతర్భాగంలో జనించే ఊర్ద్వ బలాల వల్ల పైకి తన్నుకురావడం వల్ల ఏర్పడ్డ పీఠభూములు?

జ. పర్వత పాద పీఠభూములు

24. పర్వత పాద పీఠభూములకు మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి

25. తక్కువ వాలును కలిగి సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండే పీఠభూమి?

జ. ఖండాంతర పీఠభూమి

26. ఖండాంతర పీఠభూమికి మంచి ఉదాహరణ?

జ. ఉత్తర అమెరికాలోని అపలేషియన్ పీఠభూమి

27. సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండి ఉపరితలం సమతలంగా ఉన్న భూభాగం?

జ. మైదానం

28. సముద్రమట్టాన్ని ఆనుకొని ఉన్న మైదానాలు?

జ. తీర మైదానాలు

29. తీర మైదానాలకు మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం

30. గాలి, నీరు, హిమానీ నదాల కోతకు గురై ఎత్తు తగ్గడం వల్ల ఏర్పడ్డ మైదానాలు?

జ. కోత మైదానాలు

31. కోత మైదానాలకు మంచి ఉదాహరణ?

జ. కెనడాలోని షీల్డు, రష్యాలోని పశ్చిమ సైబీరియా

32. గాలి, నదులు, హిమానీ నదాల ద్వారా మోసుకొనిపోయిన ఒండ్రుమట్టి, ఇసుక,గుళక రాళ్లతో ఏర్పడిన మైదానాలు?

జ. నిక్షేపిత మైదానాలు.

33. నిక్షేపిత మైదానానికి మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని గంగా సట్లెజ్ మైదానం

Sunday, July 17, 2022

పోటీపరీక్షల ప్రత్యేకం - సింధు - హరప్పా నాగరికథ

 పోటీపరీక్షల ప్రత్యేకం - సింధు - హరప్పా నాగరికథ 


1. గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?

1) హిందీ 2) మరాఠీ 3) పాళీ 4) మాగధి  (3)

2. కింది వాటిలో బౌద్ధ నిర్మాణం కానిదేది?

1) సంఘం 2) స్థూపం 3) విహారం 4) చైత్యం   (1) 

3. బాక్రియన్‌ రాజు మినాండర్‌ ఏ బౌద్ధ సన్యాసితో జరిపిన చర్చల సారాంశం మిళిందపన్హ గ్రంథంలో ఉంది?

1) నాగభట్టుడు 2) కుమారిలభట్టుడు 3) నాగసేనుడు 4) నాగార్జునుడు  (3) 

4. రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి ప్రస్తావన ఉంది?

1) పార్శ్వనాథుడు 2) మహావీరుడు 3) రుషభనాథుడు 4) దేవదత్తుడు   (1) 

5. ఏ సంవత్సరంలో బుద్ధుడి మహాపరినిర్యాణం జరిగి 2500 ఏళ్లు పూర్తి అయ్యాయి?

1) 1950 2) 1959 3) 1956 4) 1955   (3)

6. దక్షిణ భారతదేశంలో ఉన్న బుద్ధుడి అస్థికలు గల తొలి మహాస్థూపం ఏది?

1) భట్టిప్రోలు 2) అమరావతి 3) నాగార్జున కొండ 4) పైవేవీ కాదు  (1)

7. బుద్ధుడి జీవితంలో జరిగిన నాలుగు ముఖ్య సంఘట నలతో ప్రమేయం లేని ప్రదేశం ఏది?

1) సంఖ్యస 2) రుమిందై 3) కాసియా 4) ఇసిపటాన వద్ద జింకల వనం  (1)

8. నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?

1) వైశాలి 2) పాటలీపుత్రం  3) కశ్మీర్‌ 4) కురుక్షేత్ర    (3)

9. గౌతమబుద్ధుడు కుశినారలో మరణించేటప్పుడు అతడి పక్కన ఉన్న శిష్యుడు ఎవరు?

1) నాగసేన 2) ఆనంద 3) అంబపాలి 4) సారిపుత్ర  (2)

10. యోగాచార లేదా విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపా దించిన తత్వవేత్త ఎవరు?

1) వసుబంధు 2) అసంగ 3) మైత్రేయనాథ 4) వత్తగామిని  (3)

11. మహాయాన బుద్ధిజంలో 'బోధిసత్తియ అవలో కితేశ్వర' కు మరొక పేరు?

1) పద్మపాణి 2) వజ్రపాణి 3) మంజుశ్రీ 4) మైత్రేయ  (1) 

12. జైనతత్వానికి గల మరో పేరు?

1) సమాచారి 2) స్వాదవాద  3) సంఖ్య 4) పుద్గల  (2) 

13. జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపింది?

1) భగవద్గీత 2) ఇతిహాసాలు  3) ఉపనిషత్తులు 4) వేదాలు   (2) 

14. జైనమత సాంప్రదాయ ప్రకారం మొత్తం తీర్థంకరుల సంఖ్య?

1) 23 2) 22 3) 24 4) 21   (3) 

15. జైనమత పవిత్ర గ్రంథాలు?

1) త్రిపీఠకాలు 2) వేదాలు  3) అంగాలు 4) భగవద్గీత  (3)

16. తెలంగాణలో ఏకైక జైన క్షేత్రం?

1) కొలనుపాక 2) బోధన్‌  3) ఉదయగిరి 4) రామతీర్థం   (1) 

17. సింధూ నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాల్లో విస్తరించింది?

1) ఉత్తర ప్రాంతం 2) తూర్పు ప్రాంతం  3) పశ్చిమ ప్రాంతం 4) 1, 3  (4) 

18. మొహంజొదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?

1) పూర్వీకుల దేవాలయం 2) క్రీడా ప్రాంగణం   3) మతుల దిబ్బ 4) ఏవీకాదు   (3) 

19. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది?

1) క్రీ.శ. 1912 2) క్రీ.శ. 1921  3) క్రీ.శ. 1922 4) క్రీ.శ. 1925   (2) 

20. సింధు ప్రజలకు ఇష్టమైన జంతువు?

1) ఎద్దు 2) ఒంటె 3) గుర్రం 4) ఏనుగు   (1)

21. గుజరాత్‌లో జరిగిన తవ్వకాల్లో కొత్తగా బయట పడిన హరప్పా నగరం ఏది?

1) ధోలవీర 2) ఖాండియ   3) కుంటాసి 4) మాండా  (1) 

22. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌ 2) మహారాష్ట్ర   3) పంజాబ్‌ 4) రాజస్థాన్‌  (1) 

23. సింధూ ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేశారు?

1) చెక్క 2) కంచు   3) స్టియటైట్‌ 4) మట్టి   (3) 

24. సింధూ నగరాల్లో గహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?

1) కాల్చిన ఇటుకలు 2) వెదురు  3) చెక్క 4) గ్రానైట్‌ (1) 

25. హరప్పా సంస్కతి నిర్మాతలెవరు?

1) సుమేరియన్లు 2) ఆర్యులు  3) ద్రావిడులు 4) ఆస్ట్రలాయిడ్‌లు  (3)

26. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రం గా ఉన్న ప్రాంతమేది?

1) మెలూహా 2) సుమేరియా 3) చన్హుదారో 4) కాళీభంగన్‌  (1) 

27. సింధూ ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటో మియా నగరంలో కనుగొన్నారు?

1) ఉర్‌ 2) కిష్‌ 3) టెల్‌ 4) ఉమ్మా   (4) 

28. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?

1) మెసపటోమియా 2) చైనా  3) సింధూ 4) పర్షియా   (3) 

29. గుర్రం అవశేషాలు బయటపడిన సింధూ ప్రాంతం?

1) సుర్కోటడా 2) లోథాల్‌  3) చన్హుదారో 4) బన్వాలీ  (1) 

30. ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధూ నగరం ఏది?

1) కాళీభంగన్‌ 2) లోథాల్‌  3) హరప్పా 4) మొహంజొదారో   (1)

31. హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలేవి?

1) రాగి 2) లెడ్‌ 3) టిన్‌ 4) అన్నీ  (4) 

32. అమ్మతల్లి ఆరాధకులైన సింధూ ప్రజలు పూజించిన పురుష దేవుడెవరు?

1) ఇంద్రుడు 2) విష్ణువు  3) బ్రహ్మ 4) పశుపతి   (4) 

33. లోథాల్‌, చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి?

1) నౌకా నిర్మాణం 2) పూసల తయారీ  3) నేత పరిశ్రమ 4) లోహ పరిశ్రమ  (2) 

34. హరప్పా తవ్వకాల్లో బయటపడిన ఆయుధం?

1) ఖడ్గం 2) ఈటె  3) గొడ్డలి 4) బల్లెం  (1) 

35. సింధూ లిపితో పోలికలు గల భారతీయ లిపి?

1) పాళీ 2) బ్రాహ్మి  3) ద్రవిడియన్‌ 4) ఖరోష్టి   (3)

36. సింధూ ప్రజల కళాభివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ లభించింది?

1) మొహంజొదారో 2) హరప్పా  3) చన్హుదారో 4) కాళీభంగన్‌  (1) 

37. సింధూ లోయ నాగరికత ఏ కాలానికి చెందింది?

1) క్రీ.పూ. 3000 2) క్రీ.పూ. 4000  3) క్రీ.పూ. 1000 4) క్రీ.పూ. 4500  (1) 

38. హరప్పా సంస్కృతి కి చెందిన కాళీభంగన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌ 2) రాజస్థాన్‌  3) హర్యానా 4) ఉత్తరప్రదేశ్‌   (2) 

39. మహాస్నాన వాటిక ఏ నగరంలో ఉంది?

1) హరప్పా 2) లోథాల్‌  3) మొహంజొదారో 4) చన్హుదారో   (3) 

40. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ?

1) పశుపోషణ 2) వ్యవసాయం  3) వ్యాపారం 4) మత్స్య గ్రహణం   (2)

41. సింధూ ప్రజలకు తెలియని జంతువు?

1) కుక్క 2) ఆవు 3) ఎద్దు 4) గుర్రం  (4) 

42. అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ ఉంది?

1) హరప్పా 2) లోథాల్‌ 3) ధోల్‌వీర 4) రంగాపూర్‌  (1) 

43. హరప్పా ప్రజలు ఆరాధించింది?

1) అమ్మతల్లి 2) పశుపతి, లింగం  3) జంతువు, సర్పాలు, చెట్లు 4) అన్నీ  (4) 

44. సింధూ ప్రజల లిపి?

1) ప్రాకతం 2) సంస్కతం  3) బొమ్మల 4) ద్రావిడ (3) 

45. వీటిలో తొలి నగరీకరణగా పేరు పొందింది?

1) ఆర్య నాగరికత 2) సింధూ నాగరికత  3) షోడశ జనపదాలు 4) మగధ రాజ్య స్థాపన  (2)