Social Icons

Pages

Showing posts with label Disaster management. Show all posts
Showing posts with label Disaster management. Show all posts

Tuesday, July 3, 2018

Some important questions in Disaster management floods

1. వరదలు రావడానికి కారణం? - (అధిక వర్షపాతం, ఉష్ణమండల చక్రవాతాలు,  ఆనకట్టలు తెగి పోవడం)

2. Rashtriya Barh Ayog(RBA) లేదా "నేషనల్ ఫ్లడ్ కమిషన్ ఆఫ్ ఇండియా" ను ఎప్పుడు ఏర్పాటు చేసారు? - (1976)

3. భారత్ మొత్తం భూభాగంలో ఎంత శాతం వరదలకు గురవుతుంది? - (12%)

4. ఇండియాలో ఏ నది వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తాయి?  - (బ్రహ్మపుత్ర)

5. మజూలీ నదీ ద్వీపం తరచూ వరదలకు గురికావడానికి కారణమవుతున్న నది? - (బ్రహ్మపుత్ర, మానస్)

6. ఆంధ్రప్రదేశ్ లో తరచుగా వరదలకారణంగా ప్రభావితమవుతున్న ప్రాంతం? - (కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతం)

7.  మజూలీ నదీ ద్వీపం ఏ నది కారణంగా ఏర్పడింది? - (బ్రహ్మపుత్ర)

8. భారతదేశంలోని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి? - (25)

9. ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతం?  - (30%)

10. 2013 జూన్ 16న ఏ రాష్ట్రంలో భారీగా వరదలు సంభవించాయి?  -(ఉత్తరాఖండ్)

11.  2013 జూన్ 16న బాగా నష్టపోయిన "కేదారనాథ్" ఆలయం ఏ నది ఒడ్డున ఉంది?  - (మందాకినీ)

12. భారతదేశంలో ఏ నెలల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది? - (జూన్ - సెప్టెంబర్)

13. ఏ సంవత్సరంలో సంభవించిన వరదల  కారణంగా ఇండియాలో 11,316 మంది మరణించారు? - (1977)

14. ఏ నదిని "బెంగాల్ దుఃఖదాయని" అని పిలిచేవారు?  - (దామోదర్)

15. భారతదేశంలో మొట్టమొదటి "నదీ లోయ ప్రాజెక్ట్" (River valley project)......? - (దామోదర నదీ లోయ ప్రాజెక్ట్)

16. వరదల నివారణకు దామోదర నదిపై ఏర్పాటు కాని జల విద్యుత్ ప్రాజెక్ట్? - (మయూరాక్షి ప్రాజెక్ట్)

17. ఇండియాలో ఏటా ఎంత మంది వరదలకు గురవుతున్నారు? - (200 మిలియన్లు)

18.  భారతదేశంలో ఎన్ని మిలియన్ల హెక్టార్ల భూమి వరదలకు గురవుతుంది? - (40 మిలియన్ల హెక్టార్లు)

19. 1970లో అత్యధికంగా వార్షిక మరణాలు దేనివల్ల సంభవించాయి? - (వరదలు)

20. 1980 జూలై 17 - 23 మధ్య భారీ వరదలు ఏ రాష్ట్రంలో సంభవించాయి? - (తూర్పు ఉత్తరప్రదేశ్)

21. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో "దివిసీమ ఉప్పెన" ఎప్పుడు సంభవించింది? - (1977 నవంబర్ 19)

22. ఏ రోజుల్లో వసంత ఋతువు అలలు కనిపించవు?  - (అమావాస్య, పౌర్ణమి)

23. ఇండియాలోని కోస్తా తీరంలో ఎంత భూభాగం తుఫానులకు గురవుతుంది? - (5,700 కి. మీ)

24. సిడర్ తుఫాన్ బంగ్లాదేశ్ లో ఎప్పుడు సంభవించింది? - (1977 నవంబర్ 15)

25. 1970 లో ఏ దేశములో తుఫాన్ సంభవించి 50,000 మంది మరణించారు? - (బంగ్లాదేశ్)

26. Cyclone అనే పదం Cyclos అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఆ మాటకి అర్థం?  - (పాము మెలికల చుట్ట)

27. వరదల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారుచేయాలని ఏ కమిషన్ కు సూచించింది?  - (కేంద్ర జల కమిషన్)

28. ఒడిశా సూపర్ సైక్లోన్ ఎప్పుడు సంభవించింది? - (1999 అక్టోబర్ 29)

29. జాతీయ విపత్తుల దినోత్సవం / జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం.....? - (అక్టోబర్ 29)

30. తుఫానులకు తరచుగా గురయ్యే తీరం? - (కళింగ తీరం)

31. అమెచ్యూర్ రేడియోకి మరోపేరు? - (హమ్ రేడియో)