Social Icons

Pages

Saturday, June 18, 2022

పోటీ పరీక్షల ప్రత్యేకం - మధ్యయుగ ప్రపంచం

 పోటీ పరీక్షల ప్రత్యేకం  - మధ్యయుగ ప్రపంచం

1. క్రూసేడులు ఎవరెవరి మధ్య జరిగాయి?

 జ. మహ్మదీయుల, క్రైస్తవుల మధ్య

2. మధ్యయుగ కాల ముఖ్య లక్షణం? 

జ. భూసామ్య పద్దతి నెలకొని ఉండటం

3. ప్రపంచ చరిత్రలో మధ్యయుగంగా నిర్ణయించిన కాలం? 

జ. క్రీ.శ 5 నుంచి క్రీ.శ 15వ శతాబ్దం వరకు

4. మధ్యయుగాన్ని యూరప్ ఖండంలో ఏమని పిలుస్తారు? 

జ. మలీ యుగం

5. మధ్య యుగంలో గ్రామీణ రైతులను ఎలా పిలిచేవారు?

 జ. సర్వ్ లు

6. క్రూసేడులు అంటే? 

జ. మత యుద్ధాలు

7. ఇస్లాం మత స్థాపకుడు? 

జ. మహ్మద్ ప్రవక్త

8. ఎవరితో ఏర్పడిన సాంస్కృతిక సంబంధాలు యూరప్ లో పునరుజ్జీవనానికి కారణమయ్యాయి?

 జ. అరబ్బులతో

9. బైజాంటైన్ సామ్రాజ్యాన్ని తురుష్కులు ఎప్పుడు ఆక్రమించారు?

 జ. క్రీ.శ 1453

10. మధ్యయుగంలో భూస్వామ్య విధానం వల్ల నూతనంగా ఏర్పడిన సామాజివ వర్గం? 

జ. మధ్యతరగతి ప్రజలు

11. మహ్మద్ ప్రవక్తను 'నీవే భగవంతుని ప్రవక్తవు' అని ప్రవచించిన దేవదూత?

 జ. జిబ్రాయిల్

12. కాన్ స్టాంటినోపిల్ నగరంగా ప్రసిద్ధి చెందింది? 

జ. బైజాంటైన్ (గ్రీకు)

13. బైజాంటైన్ అద్భుత నిర్మాణంగా పేర్కొన్న చర్చ్ ? 

జ. సెయింట్ సోఫియా చర్చ్

14. ఏ సంవత్సరం నుంచి తమ శకం ఆరంభమైందని ముస్లింలు భావిస్తారు?

 జ. క్రీ.శ 622

15. ఏ పర్వత ప్రాంతంలో మహ్మద్ ప్రవక్త నిత్యం ధ్యానం చేసేవాడు?

 జ. హీరా పర్వతం

16. మహ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత విస్తరణకు కృషి చేసిన వారు? 

జ. ఉమయ్యద్ ఖలీఫాలు

17. ఇస్లాం అంటే? 

జ. లొంగి ఉండుట(ఆత్మ సమర్పణం)

18. ప్రతి ముస్లిం తన జీవితంలో ఆచరించాల్సిన ఎన్ని సూత్రాలను ఖురాన్ ప్రస్తావించింది? 

జ. 6

19. 'అల్లా' పేరు మీద పేదలకు దానధర్మాలు చేయడాన్ని ఏమంటారు? 

జ. జకాత్

20. ప్రాచీన భారతదేశ విజ్ఞానాన్ని యూరప్ కు చేరవేసిన వారు?

 జ. అరబ్బులు

21. భారతీయ విద్వాంసులను 'బాగ్దాద్'కు ఆహ్వానించిన ఖలీఫా? 

జ. హరూన్

22. ఆంగ్ల భాషలోకి ప్రవేశించిన అరబ్బీ పదాలు? 

జ. లెమన్, షుగర్, సిరఫ్, బజార్, ఆల్జీబ్రా

23. భారతదేశంలో మధ్యయుగంగా గుర్తించిన కాలం? 

జ. క్రీ.శ 7 నుంచి 18వ శతాబ్దం వరకు

24. అరబ్బులు 'సింధు దండయాత్ర' చేసిన సంవత్సరం? 

జ. క్రీ.శ 712

25. ఏ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది? 

జ. క్రీ.శ 1526

26. మెఘలాయి పాలనా పద్ధతులు ఆరంభించిన వారు? 

జ. షేర్షాసూరి

27. గురునానక్ ఎవరి బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు? 

జ. కబీర్

28. నూతన తర్క శాస్త్రానికి పునాది వేసిన వాడు? 

జ. వాసుదేవ సార్వభౌమ

29. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో రామాయణ, మహాభారతాలను సంస్కృతం నుంచి ఇతర భాషల్లోకి అనువదించారు? 

జ. అక్బర్

30. ఉపనిషత్తులను అనువదించిన 'దారాషుకో' ఎవరి కుమారుడు? 

జ. షాజహాన్

31. అక్బర్ నామాను రచించిన వారు? 

జ. అబుల్ ఫజల్

32. అమర గానాన్ని వర్ణించిన అంధ కవి?

 జ. సూర్ దాస్ 

33. 'అపర వాల్మీకి'గా ప్రసిద్ది చెందిన వాడు? 

జ. తులసీదాస్

34. అమీర్ ఖుస్రూ కనిపెట్టిన నూతన వాద్యం ? 

జ. ఖయి

35. అక్కర్ ఆస్థానంలో ఉన్న ప్రముఖ గాయకుడు?

 జ. తాన్ సేన్

36. అక్బర్ సమాధి ఉన్న ప్రదేశం? 

జ. సికిందరా

37. మొగల్ కాలంనాటి నిర్మాణాల్లో గోడలను అలంకరించేందుకు ఏయే మత పద్ధతులను అనుసరించారు?

 జ. హిందూ, జైన మత పద్ధతులు

38. జహంగీర్ కళాపోషణకు నిదర్శణమైన ఉద్యానవనాలు ఎక్కడ ఉన్నాయి? 

జ. లాహోర్

39. హుమయూన్ ను మనదేశానికి పిలిపించిన ప్రముఖ పర్షియన్ చిత్రకారులు?

 జ. మీర్ సయ్యద్ ఆలీ, ఖ్వాజా అబ్దుల్ సయ్యద్

40. పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి అని అభివర్ణించిన వాడు?

 జ. బెర్నియర్

41. ఏ వంశపు రాజుల కాలంలో చైనాలో ప్రభుత్వద్యోగులను పరీక్షల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది? 

జ. టాంగ్ వంశం

42. మధ్య యుగ జపాన్లో నిజమైన అధికారం ఎవరికుండేది? 

జ. భూస్వాములకు

43. చైనాలో 'సుంగ్' వంశపు పాలనలో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన గొప్ప మార్పు ? 

జ. పేపరు కరెన్సీని ప్రవేశ పెట్టడం

44. చేతి వేళ్ల గోళ్లను పెంచి వాటికి వెండి తొడుగుల్ని పెట్టుకున్న వారు? 

జ. చైనీయులు

45. 'ఉదయించే సూర్యుని భూమి'గా ప్రసిద్ది చెందిన దేశం? 

జ. జపాన్

46. జపాన్ వారి పితృదేవతారాధనను ఏమని పిలుస్తారు? 

జ. షింటోయిజమ్

47. చైనాలో బౌద్ధ మతం క్షీణించడానికి కారణం? 

జ. కన్ఫ్యూషియస్ మత ఆవిర్భావం

Tuesday, May 10, 2022

Telugu GK Bits - యూరోపియన్ల రాక

 Telugu GK Bits - యూరోపియన్ల రాక 

1. తురుష్కులు కాన్ సాంట్  నోఫిల్ భూమార్గాన్ని ఏ సంవత్సరంలో మూసివేశారు? 

జ. క్రీ.శ. 1453 

2. క్రీ.శ. 1498లో భారతదేశ పడమటి తీరాన్ని చేరిన మొదటి పోర్చుగీస్? 

జ. వాస్కోడిగామా 

3. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు? 

జ. పోర్చుగీస్ వారు

4. వాస్కోడిగామా చేరిన భారతీయ రాజ్యం కాలికట్ రాజు ఎవరు?

 జ. జామొరిన్ 

5. పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ? 

జ. డచ్ వారు 

6. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు? 

జ. పోర్చుగీసువారు 

7. ఇండియాకు వచ్చిన చివరి యూరోపియన్లు ?

 జ. ఫ్రెంచ్ వారు 

8. ఫ్రెంచీ ఈస్టిండయా సంఘంను ఏ సంవత్సరంలో స్థాపించారు ? 

జ. క్రీ.శ. 1664లో 

9. భారతదేశంలో ఆధునిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 

జ. 18వ శతాబ్దంలో 

10. 'క్రూసేడులు” అనే మత యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి ? 

జ. క్రైస్తవులకు, మహ్మదీయులకు 

11. భారతీయ స్త్రీలను వివాహం చేసుకొమ్మని పోర్చుగీస్ లను ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్? 

జ. ఆల్బుకర్క్ 

12. యునైటెడ్ ఈస్టిండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండు ను  ఎప్పుడు డచ్ ప్రభుత్వం ఇండియాకు పంపింది? 

జ. క్రీ.శ. 1602

13. ఫ్రెంచి వలసలకు ప్రధాన కేంద్రం? 

జ. పాండిచ్చేరి 

14. సెయింట్ జార్జికోట ఎక్కడ ఉంది? 

జ. మద్రాస్ 1

15. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారికి మధ్య సంఘర్షణలకు కేంద్రమైన పట్టణం? 

జ. ఆర్కాట్ పట్టణం (కర్ణాటక రాజ్య రాజధాని) 

16. మొదటి కర్ణాటక యుద్ధం (1746-48)లో ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్ జార్జికోటపైకి నడిపిన అధికారి? 

జ. డూప్లే 

17. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరికి మధ్య ప్రధానంగా జరిగాయి? 

జ. బ్రిటిష్ వారికి, ఫ్రెంచివారికి 

18. మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం ఎవరిది?

 జ. ఫ్రెంచివారిది 

19. తమ మాతృదేశాల అనుమతి లేకుండానే ఏ యుద్ధంలో ఇంగ్లిష్, ఫ్రెంచివారు తలపడ్డారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

20. రెండో కర్ణాటక యుద్ధంనకు ప్రధాన కారణం? 

జ. హైదరాబాద్ రాజ్యం , కర్ణాటక రాజ్య వారసత్వ సంఘర్షణలు

 21. హైదరాబాద్ వారసత్వ సంఘర్షణలో ఫ్రెంచివారు ఎవరికి మద్దతునిచ్చారు? 

జ. ముజఫర్ జంగ్

22. ముజఫర్ జంగ్ ను హైద్రాబాద్ పాలకుడిగా చేసిన ఫ్రెంచి అధికారి ? 

జ. డూప్లే 

23. డూప్లే వల్ల కర్ణాటక సింహాసనాన్ని అధిష్టించినవారు ? 

జ. చందాసాహెబ్

24. కర్ణాటక వారసత్వ సమస్య ఎవరెవరికి మధ్య వచ్చింది ?

 జ. చందాసాహెబ్, అన్వరుద్దీన్

25. రెండో కర్ణాటక యుద్ధంలో (1748-51) ఇంగ్లిష్ వారు ఎవరిని సమర్థించారు ? 

జ. నాసిర్ జంగ్, మహ్మదాలీ 

26. హైదరాబాద్ రాజ్య సింహాసనానికై పోటీపడ్డవారు ? 

జ. నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ 

27. హైదరాబాద్ నిజాం గోసలాబత్ జంగ్ ను ప్రకటించిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ 

28. చందాసాహెబును చంపి మహ్మదాలీని కర్ణాటక నవాబుగా ప్రకటించిన ఆంగ్లేయ అధికారి? 

జ. రాబర్ట్ క్లైవ్ 

29. భారతదేశంలో ఫ్రెంచివారు తమ పలుకుబడిని మొట్ట మొదటగా ఏ యుద్ధ ఫలితంగా కోల్పోయారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

30. రెండో కర్ణాటక యుద్ధం చివరలో విజయం సాధించిన వారు ? 

జ. ఆంగ్లేయులు 

31. ఉత్తర సర్కార్‌ల్లో ఓ ప్రాంతం తప్ప మిగలిన వాటిని సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఇచ్చారు. ఆ ప్రాంతం ఏది?

 జ. గుంటూరు జిల్లా 

32. రెండో కర్ణాటక యుద్ధం తర్వాత ఫ్రెంచివారికి, ఆంగ్లేయులకు మధ్య జరిగిన సంధి?

 జ. పుదుచ్చేరి సంధి 

33. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం?

 జ. 1757

34. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల విజయానికి కారణమైనవాడు ?

 జ. రాబర్ట్ క్లైవ్

 35. మూడో కర్ణాటక యుద్ధం (1758-63)లో ఫ్రెంచి సేనాని ?

 జ. కౌంట్-డీ లాలీ

36. మూడో కర్ణాటక యుద్ధం తర్వాత ఆంగ్లేయులకు లొంగిపోయిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ

37. మూడో కర్ణాటక యుద్ధం వల్ల అధికంగా నష్టపోయిన వారు?

 జ. ఫ్రెంచివారు 

38. కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణమైనవాడు ? 

జ. బెంగాల్ నవాబు సిరాజుధౌలా

39. కలకత్తా చీకటి గది ఉదంతం జరిగిన ప్రదేశం? 

జ. సెయింట్ విలియం కోట

40. బ్రిటీష్ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాందిపలికిన యుద్ధం? 

జ. ప్లాసీయుద్ధం 

41. ప్లాసీ యుద్ధంలో సిరాజుధౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడినవాడు ? 

జ. మీర్ జాఫర్ 

42. మీర్ జాఫర్ ను బెంగాల్ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవాడు ? 

జ. రాబర్ట్ క్లైవ్ 

43. కస్టమ్స్ పన్నును ఎత్తివేసి భారతీయ వర్తకులూ ఇంగ్లీష్ వారితో సమానంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చినవాడు ? 

జ. బెంగాల్ నవాబు మీర్‌ఖాసీమ్ 

44. బక్సార్ యుద్ధం (1764)లో ఓడినవాడు ? 

జ. మొగల్ చక్రవర్తి షా ఆలం, బెంగాల్ నవాబు మీర్ ఖాసిమ్, అయోధ్య నవాబు షుజా-ఉద్దౌలా 

45. బక్సార్ యుద్ధ ఫలితంగా బ్రిటీష్ వారు పొందింది?

 జ. దివానీ అధికారం 

46. దివానీ అధికారం అంటే ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సాలనుంచి భూమిశిస్తు వసూలు చేసుకునే అధికారం 

47. బెంగాల్ రాష్ట్ర మొదటి ఆంగ్లేయ గవర్నర్? 

జ. రాబర్ట్ క్లైవ్ 

48. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? 

జ. బక్సార్ యుద్ధం

49. ద్వంద్వ ప్రభుత్వం అంటే ?

 జ. ఆంగ్లేయులు భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, బెంగాల్ నవాబు పరిపాలన చేయడం

50. రాబర్ట్ క్లైవ్ భూమిశిస్తు వసూలుకు ఎవరిని ఉద్యోగులుగా నియమించాడు ? 

జ. భారతీయులను

51. మొదటి మైసూరు యుద్ధం(1767-69) ఎవరెవరికి మధ్య జరిగింది? 

జ. హైదరాలీ, ఆంగ్లేయులు

 52. రెండో మైసూరు యుద్ధం(1780-82) ఎవరెవరి మధ్య సంధితో ముగిసింది ?

 జ. టిప్పుసుల్తాన్, ఆంగ్లేయులు 

53. మొదటి మైసూరు యుద్ధం ఎవరి విజయంతో ముగిసింది ?

 జ. హైదరాలీ 

54. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది? 

జ. మంగళూరు సంధి

55. మంగళూరు సంధి ఏ సంవత్సరంలో జరిగింది ? 

జ. క్రీ.శ. 1782లో 

56. హైదరాలీ ఏ యుద్ధంలో చనిపోయాడు ? 

జ. రెండో మైసూరు యుద్ధం 

57. మూడో మైసూరు యుద్ధం తర్వాత సంధి చేసుకున్నవారు ?

 జ. కారన్‌వాలీస్, టిప్పుసుల్తాన్ 

58. టిప్పు సుల్తాన్ మొదటి సారిగా ఓడిపోయిన యుద్ధం ?

జ. మూడో మైసూరు యుద్ధం 

59. నాలుగో మైసూరు యుద్ధంలో (1799) వెల్లస్లీ చేతిలో ఓడిపోయి చనిపోయినవాడు ? 

జ. టిప్పు సుల్తాన్ 

60. ఇంగ్లిష్ వారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు? 

జ. కృష్ణరాజు ఒడయార్ 

61. నానా ఫడ్నవీస్ ఆంగ్లేయులతో చేసుకున్న సంధి? 

జ. సాల్బె సంధి(1776)

62. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన వాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

63. కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేసుకున్నవాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

 64. గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్స్ చేసిన సంస్కరణలు ?

హిందూన్యాయ సూత్రాలను క్రోడీకరించడం 

జిల్లాస్థాయిల్లోనూ కోర్టులు స్థాపించడం

భూమిశిస్తు వసూలు చేసే హక్కును వేలంవేసే పద్ధతి ద్వారా సంస్కరించాడు

 65. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. వారన్ హేస్టింగ్స్ (1793) 

66. గ్రామపంచాయతీ వ్యవస్థను రద్దుచేసిన గవర్నర్ జనరల్ ?

 జ. వారన్ హేస్టింగ్స్ 

67. సైన్యసహకార పద్ధతికి ఆద్యుడు ? 

జ. వెల్లేస్లీ

 68. బ్రిటీష్ వారి సైన్య సహకార పద్ధతికి ముందుగా అంగీకరించిన స్వదేశీ రాజు? 

జ. హైదరాబాద్ నిజాం 

69. ఆంగ్ల విద్యను మన దేశంలో ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. విలియం బెంటింగ్ 

70. సతీసహగమనాన్ని రూపుమాపినవాడు ? 

జ. విలియం బెంటింగ్

11. స్త్రీ విద్యను ప్రోత్సహించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ?

 జ. డ‌ల్హౌసీ

 12. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రారంభించినవాడు ?

 జ. కారన్ వాలీస్ 

78. రైత్వారీ పద్ధతిని బ్రిటీష్ వారు ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. మద్రాసు, బొంబాయి

74. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ల్లో ప్రవేశపెట్టిన భూమిశిస్తు పద్ధతి? 

జ. మహళ్వారీ పద్ధతి 

15. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సా 

76. భారతదేశంలో విద్యాభివృద్ధికోసం మొదటిసారిగా కృషిచేసిన చట్టం?

 జ. 1813 చార్టర్ చట్టం

77. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం?

 జ. 1835 

78. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన మొదటి రైల్వేమార్గాన్ని (1853) ఎక్కడ నుంచి ఎక్కడకి వేశారు ? 

జ. ముంబాయి నుంచి థానే కు 

79. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు? 

జ. భిల్లులు(మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్), సంతాలులు(బెంగాల్, బీహార్), కోలులు(బెంగాల్, బీహార్,ఒరిస్సా) 

80. బిల్లుల నాయకుడు? జ. ఊటిరాట్ సింగ్ 

81. వహబీ ఉద్యమం జరిగిన ప్రాంతం? 

జ. బెంగాల్, బీహార్ 

82. భారత ప్రథమ సంగ్రామంగా పేర్కొన్నది ? 

జ. 1857 సిపాయిల తిరుగుబాటు

 88. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 84. మంగల్ పాండే ఏ పదాతి దళానికి చెందిన వాడు ? 

జ. బెర్హంపూర్ 

85. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఏ మొగల్ చక్రవర్తిని భారత చక్రవర్తిగా తిరుగుబాటుదారులు ప్రకటించారు ? 

జ. రెండో బహదూర్‌షా

86. బీహార్ లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు ? 

జ. కున్వర్ సింగ్ 

87. నానాసాహెబ్ నాయకత్వం వహించిన తిరుగుబాటు దారులు ఏ ప్రాంతం వారు ?

 జ. కాన్పూరు

 88. నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించినవారు ? 

జ. తాంతియాతోపే

 89. 1857 తిరుగుబాటుకాలంలో బ్రిటీష్ సైన్యాలకు ఎదురోడి పోరాడిన మహిళ? 

జ. ఝాన్సీ లక్ష్మీబాయి 

90. సిపాయిల తిరుగుబాటు (1857) కాలంలో లక్నో రెసిడెన్సీని ముట్టడించిన సైన్యానికి నాయకుడు ?

 జ. మౌల్వీ అహ్మదుల్లా 

91. బరేలీలోని సైన్యాలకు నాయకత్వం వహించినవాడు ? 

జ. ఖాన్ బహదూర్ ఖాన్

92. మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షా ఎక్కడ మరణించాడు ? 

జ. రంగూన్ (బర్మా) (1862) 

93. బెంగాల్ లో వార్షిక హిందూమేళాను ప్రారంభించినవారు? 

జ. గోపాల్ మిత్రా

94. మహారాష్ట్రలో గణపతి ఉత్సవాన్ని, శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించినవారు ? 

జ. తిలక్

 95. చికాగోలో జరిగిన ప్రపంచమతాల పార్లమెంటులో పాల్గొన్న భారతీయుడు ? 

జ. స్వామి వివేకానంద

96. బెంగాల్ (1818)లో సెరామ్ మూర్ కళాశాలను నెలకొల్పినవాడు ? 

జ. విలియమ్ కేరీ

97. 1857 సిపాయిల తిరుగుబాటు ఏ తేదీన ప్రారంభమైంది ? 

జ. మే, 10

98. 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? 

జ. మీరట్

99. భారతదేశంలో బ్రిటీష్ కంపెనీ పాలన ఏ చట్టంతో రద్దయింది? 

జ. 1858 చట్టం 

100. 1858 చట్టం తర్వాత భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వాధిపతిని ఎలా పిలిచారు ? 

జ. వైస్రాయ్

101. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైను ఏ సంవత్సరంలో వేశారు ?

 జ. 1870

102. విక్టోరియా మహారాణి పంపిన ప్రకటనను 1858లో లార్డ్ కానింగ్ ఎక్కడ చదివి వినిపించాడు ?

 జ. అలహాబాద్

103. ఇండియా, ఇంగ్లండ్ ల  మధ్య దూరాన్ని తగ్గించిన సూయజ్ కాలువను ఎప్పుడు తెరిచారు ?

 జ. 1869

104. భారతదేశంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో బడ్జెట్ తయారయింది ? 

జ. 1860

105. మనదేశంలో మొదటిసారిగా ఆదాయపన్నును ఏ సంవత్సరం నుంచి వసూలు చేస్తున్నారు ? 

జ. 1860

106. భారతదేశంలో మొత్తం ఎన్ని స్వదేశీ సంస్థానాలుండేవి ? 

జ. 562

107. విక్టోరియా మహారాణి భారతదేశ చక్రవర్తిణిగా ఏ రోజు నుంచి ప్రకటించుకొంది ? 

జ. జనవరి 1, 1877

108. స్వదేశీ రాజుల విదేశీ వ్యాపారాన్ని నిషేధించిన బ్రిటీష్ వైస్రాయ్ ? 

జ. కర్జన్ 

109. మొదటి ఆంగ్లో- అప్లాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 

జ. 1839

110. మొదటి ఆంగ్లో-అప్లాన్ యుద్ధం జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్నవాడు ? 

జ. దోస్త్ మహ్మద్

111. బర్మా స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం? 

జ. 1948 

112. ఇంపీరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థను ఎక్కడ స్థాపించారు ? 

జ. పూసా (బీహార్) 

113. కరువుపీడిత ప్రాంతాలకు సహాయం అందించాలని బ్రిటీష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిశ్చయించింది? 

జ. 1883

114. బెంగాల్ లో చాలా తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో వచ్చింది?

 జ. 1943లో

115. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ను నూతనంగా ఏర్పాటుచేసిన బ్రిటిష్ అధికారి ? 

జ. డ‌ల్హౌసీ

 116. కాలువల తవ్వకాలను ఎక్కువగా చేపట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. రిప్పన్ 

117. 1940లో ఎంత శాతం వ్యవసాయభూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి? 

జ. 13 శాతం 

118. రైల్వేలను అభివృద్ధి చేసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 119. మొదటి నూలు మిల్లు 1853లో ఎక్కడ నెలకొల్పారు ? 

జ. బొంబాయి

120. 1905లో జమ్ షెడ్ పూర్ లో స్థాపించబడిన ఉక్కు కర్మాగారం ? 

జ. ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 

121. బ్రహ్మ సభను (1828) స్థాపించినవారు ? 

జ. రాజారామ్మోహన్ రాయ్

122. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి, సతీసహగమనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించడానికి కృషి చేసిన వారు? 

జ. రాజారామ్మోహన్ రాయ్

123.రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మసమాజం వ్యాప్తికి కృషిచేసిన వారు ? 

జ. కేశవచంద్రసేన్, దేవేంద్రనాథ్ టాగూర్

124. ఆర్యసమాజ(1875) స్థాపకుడు ?

 జ. దయానంద సరస్వతి

125. దయానంద సరస్వతి రచించిన గ్రంథాలు ?

 జ. సత్యార్థ ప్రకాశిక, రుగ్వేద భాష్య భూమిక 

126. రామకృష్ణ మిషన్‌ను స్థాపించినవారు ? 

జ. స్వామి వివేకానంద

Thursday, March 3, 2022

సంస్థలు - వ్యవస్థాపకులు (Organisations - Founders)

 సంస్థలు - వ్యవస్థాపకులు (Organisations - Founders)

  •  బ్రహ్మసమాజం -- రాజారాం మోహన్ రాయ్ 
  •  ఆర్యసమాజం -- దయానంద సరస్వతి 
  •  ప్రార్థనా సమాజం -- ఆత్మారాం పాండురంగ 
  •  దివ్యజ్ఞాన సమాజం -- అనిబీసెంట్ 
  • రామకృష్ణ మిషన్ -- స్వామి వివేకానంద 
  • సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి-- గోపాలకృష్ణ గోఖలే
  • భారత జాతీయ కాంగ్రెస్ -- ఏ.ఓ.హ్యూమ్ 
  • ఫార్వర్డ్ బ్లాక్ -- సుభాష్ చంద్రబోస్ (నేతాజీ)
  • శాంతినికేతన్ -- రవీంద్రనాథ్ ఠాగూర్ 
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ -- సుభాష్ చంద్రబోస్ 
  • అభివన్ భారత్ -- గణేష్ సావర్కార్ 
  • ఆంధ్రమహిళా సభ - దుర్గాబాయి దేశ్ ముఖ్
  • హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ -- నానల్ జీ  
  • సైంటిఫిక్ అసోసియేషన్-- సయ్యద్ అహ్మద్ ఖాన్
  • దేవ్ సమాజ్--సత్యానంద అగ్నిహోత్ర 
  • రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - కేశవరావ్ హెగ్డేవార్ 

Tuesday, January 4, 2022

వాతావరణం - జలావరణం - భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు

 వాతావరణం - జలావరణం - భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు

1. వాతావరణం అంటే?

జ. భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుపొర

2. వాతావరణాన్ని ఏ విధంగా విభజించారు?

జ. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం

3. వాతావరణంలో ఎక్కువ సాంద్రత కలిగిన పొర?

జ. ట్రోపో ఆవరణం

4. ట్రోపో ఆవరణ మందం భూమి ఉపరితలం నుంచి?

జ. 8 నుంచి 18 కి.మీ. ఎత్తు వరకు

5. ట్రోపో ఆవరణం మందం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?

జ. భూమధ్యరేఖా ప్రాంతం

6. వాతావరణంలో జరిగే అనేక రకాల మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి?

జ. ట్రోపో ఆవరణం

7. పగలు సూర్యతాపం నుంచి, రాత్రి భూమి ఉపరితలంపై తగిన వేడిని నిలిపి జీవరాసులని రక్షిస్తున్న పొర?

జ. ట్రోపో ఆవరణం

8. మేఘాలు, అవపాతం ఏ పొరలో ఏర్పడుతున్నాయి?

జ. ట్రోపో ఆవరణం

9. ట్రోపో ఆవరణానికి, ఐనో ఆవరణానికి మధ్య ఉండే పొర?

జ. స్ట్రాటో ఆవరణం

10. స్ట్రాటో ఆవరణం ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

జ. 80 కి.మీ.

11. స్ట్రాటో ఆవరణం ప్రత్యేకత?

జ. విమానాలు ఈ పొరలోనే ప్రయాణం చేస్తాయి

12. వాతావరణంలో అన్నిటికన్నా పైన ఉండే పొర?

జ. ఐనో ఆవరణం

13. ఐనో ఆవరణం ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది?

జ. 1050 కి.మీ.

14. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసే పొర?

జ. ఐనో ఆవరణం

Monday, January 3, 2022

భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు

 భూగోళ శాస్త్రం - ముఖ్యమైన ప్రశ్నలు 

1. భారతదేశానికి దక్షిణ సరిహద్దు?

జ. కన్యాకుమారి అగ్రం

2. రెండు భూభాగాలని కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేసే సన్నని భూభాగం?

జ. భూసంధి

3. భారతదేశంలో పగులు లోయలో ప్రవహించే నదులు?

జ. నర్మద, తపతి

4. భూసంధులకు ఉదాహరణలు?

జ. పనామా, సూయజ్

5. భూ అంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపైన ఉన్న రెండు సమాంతరభ్రంశాల మధ్య ఉన్న భూభాగం కిందికి జారిపోవడంతో ఏర్పడ్డ భూభాగాన్ని ఏమంటారు?

జ. పగులు లోయ

6. ఒక భూభాగపు చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్లు ఉంటే దాన్ని ఏమంటారు?

జ. అగ్రం

7. నయగారా జలపాతం ఏ ఖండంలో ఉంది?

జ. ఉత్తర అమెరికా

8. ఆఫ్రికా ఖండపు దక్షిణపు చివరి కొన?

జ. గుడ్‌హోప్ అగ్రం

9. నదీ ప్రవాహ జలం ఎత్తై ప్రాంతం నుంచి అగాధదరి కిందకు పడే ప్రదేశాన్ని ఏమంటారు?

జ. జలపాతం

10. అట్లాంటిక్ మహాసముద్రంలోని రిడ్జ్?

జ. మిడ్ ఓషనిక్ రిడ్జ్ 

11. అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూస్వరూపం ఏర్పడుతుంది?

జ. ఎడారి

12. సముద్ర అంతర్భాగంలో భూతలంపై ఉండే పర్వత శిఖరాన్ని ఏమంటారు?

జ. రిడ్జ్ 

13. సముద్రానికి ఆనుకొని ఉండే భూభాగం?

జ. తీరం

14. మన్నార్ సింధుశాఖ ఏ దేశాల మధ్య ఉంది?

జ. భారత్, శ్రీలంక

15. సన్నని లోతైన భూతలాన్ని ఏమంటారు?

జ. లోయలు

16. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందిన అర్థచంద్రాకార భూస్వరూపాన్ని ఏమంటారు?

జ. అఖాతం

17. నదీ ప్రవాహం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడ్డ లోతైన లోయను ఏమంటారు?

జ. అగాధదరి

18. నదులు సముద్రంలో కలిసే ప్రాంతం?

జ. నదీ ముఖద్వారం

19. సూయజ్ కాలువ వేటిని కలుపుతుంది?

జ. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం

20. నదీ ముఖద్వారం వద్ద సముద్రాన్ని కలిసే ముందు నది రెండు లేక మూడు పాయలుగా చీలినపుడు ఆ పాయల మధ్య ఉండే ప్రాంతం?

జ. డెల్టా

22. రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ, రెండు విశాల భూభాగాలను వేరు చేసే సన్నని సముద్ర భాగాన్ని ఏమంటారు?

జ. జలసంధి

22. కృష్ణా, గోదావరి డెల్టాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?

జ. ఆంధ్రప్రదేశ్

23. ఖండ అంతర్భాగంలో ఉన్న నదీ జల భాగాన్ని ఏమంటారు?

జ. సరస్సు

24. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన సరస్సు?

జ. కొల్లేటి సరస్సు

25. రవాణా, నీటి పారుదలకు తవ్వి కృత్రిమంగా ఏర్పాటు చేసిన జలమార్గం?

జ. కాలువ

26. ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు?

జ. సింధు శాఖ

27. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అగాధ దరి

జ. అమెరికాలోని కొలరాడో

Sunday, January 2, 2022

పోటీపరీక్షల ప్రత్యేకం - చరిత్ర

పోటీపరీక్షల ప్రత్యేకం - చరిత్ర  

1. గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?

1) హిందీ   2) మరాఠీ    3) పాళీ    4) మాగధి      (3)

2. కింది వాటిలో బౌద్ధ నిర్మాణం కానిదేది?

1) సంఘం  2) స్థూపం  3) విహారం  4) చైత్యం    (1)

3. బాక్రియన్ రాజు మినాండర్ ఏ బౌద్ధ సన్యాసితో జరిపిన చర్చల సారాంశం మిళిందపన్హ గ్రంథంలో ఉంది?

1) నాగభట్టుడు   2) కుమారిలభట్టుడు  3) నాగసేనుడు  4) నాగార్జునుడు     (3)

4. రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి ప్రస్తావన ఉంది?

1) పార్శ్వనాథుడు  2) మహావీరుడు  3) రుషభనాథుడు  4) దేవదత్తుడు      (1)

5.ఏ సంవత్సరంలో బుద్ధుడి మహాపరినిర్యాణం జరిగి 2500 ఏళ్లు పూర్తి అయ్యాయి?

1) 1950  2) 1959  3) 1956  4) 1955     (3)

6.నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?

1) వైశాలి  2) పాటలీపుత్రం  3) కశ్మీర్  4) కురుక్షేత్ర    (3)

7.గౌతమబుద్ధుడు కుశినారలో మరణించేటప్పుడు అతడి పక్కన ఉన్న శిష్యుడు ఎవరు?

1) నాగసేన  2) ఆనంద  3) అంబపాలి  4) సారిపుత్ర         (2)

8.యోగాచార లేదా విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త ఎవరు?

1) వసుబంధు  2) అసంగ  3) మైత్రేయనాథ  4) వత్తగామిని       (3)

9.మహాయాన బుద్ధిజంలో ‘బోధిసత్తియ అవలోకితేశ్వర’ కు మరొక పేరు?

1) పద్మపాణి  2) వజ్రపాణి  3) మంజుశ్రీ  4) మైత్రేయ         (1)

10.జైనతత్వానికి గల మరో పేరు?

1) సమాచారి  2) స్వాదవాద  3) సంఖ్య  4) పుద్గల      (2)

11.జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపింది?

1) భగవద్గీత  2) ఇతిహాసాలు  3) ఉపనిషత్తులు  4) వేదాలు       (2)

12.జైనమత సాంప్రదాయ ప్రకారం మొత్తం తీర్థంకరుల సంఖ్య?

1) 23  2) 22  3) 24  4) 21       (3)

13.జైనమత పవిత్ర గ్రంథాలు?

1) త్రిపీఠకాలు  2) వేదాలు   3) అంగాలు  4) భగవద్గీత       (3)

14.తెలంగాణలో ఏకైక జైన క్షేత్రం?

1) కొలనుపాక  2) బోధన్  3) ఉదయగిరి  4) రామతీర్థం      (1)

Wednesday, November 24, 2021

Competitive Exams Special Bits - Sample Questions in Economics

 మాదిరి ప్రశ్నలు

1) ఏ నిర్వచనం వల్ల అర్థశాస్త్రానికి సార్వజనీనత లభిస్తుంది?

1) కొరత  2) శ్రేయస్సు  3) సంపద 4) అన్నీ           (1)

2) సూక్ష్మ అర్థశాస్త్రానికి మరొక పేరు?

1) క్షీణోపాంత ప్రయోజన సూత్రం  2) ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం  

3) ధరల సిద్ధాంతం                            4) ఏదీకాదు         (3)

3)'Wealth of Nations' గ్రంథాన్ని ఎవరు రాశారు?

1) పిగూ  2) వాల్రస్  3) మార్షల్  4) ఆడం స్మిత్          (4)

4) 1970లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత?

1) రాబిన్స్‌  2) అమర్త్యసేన్  3) మార్షల్  4) పాల్ శామ్యూల్‌సన్         (4)

5) వనరుల కొరత వల్ల ఏర్పడే సమస్య?

1) ఎంపిక  2) కొరత  3) ఆర్థిక  4) శ్రేయస్సు           (1)

6) పూర్తిగా తయారుకాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువులను ఏమంటారు?

1) వినియోగ వస్తువులు  2) మాధ్యమిక వస్తువులు  3) ఆర్థిక వస్తువులు  4) ఉచిత వస్తువులు       (2)

7) ‘ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?

1) కె.ఇ. బోల్డింగ్  2) రాగ్నర్ ఫ్రిష్  3) జె.ఎం. కీన్స్‌  4) స్టిగ్లర్        (3)

8) అర్థశాస్త్రంలో ‘సూక్ష్మ అర్థశాస్త్రం’, ‘స్థూల అర్థశాస్త్రం’ భావనలను 1933లో అభివృద్ధి చేసినవారు?

1) కీన్స్‌  2) ఆడమ్ స్మిత్  3) రాగ్నర్ ఫ్రిష్  4) రాబిన్స్‌      (3)

9) ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని రచించింది?

1) మార్షల్  2) కీన్స్‌  3) ఆడమ్ స్మిత్  4) రాబిన్స్‌         (1)

10) చెక్కతో కుర్చీ తయారు చేసినప్పుడు దానికి ఏ ప్రయోజనం చేకూరుతుంది?

1) రూప ప్రయోజనం  2) స్థల ప్రయోజనం  3) సేవల ప్రయోజనం  4) కాల ప్రయోజనం     (1)

11) అర్థశాస్త్రాన్ని ‘సామాజిక శాస్త్రాల్లో రాణి’ వంటిదని చెప్పినవారు?

1) జాకోబ్ వైనర్  2) మార్షల్  2) ఆడమ్ స్మిత్  4) పాల్ శామ్యూల్ సన్          (4)

12) అర్థశాస్త్రానికి కొరత నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థికవేత్త?

1) రాబిన్స్‌  2) ఆడమ్ స్మిత్  3) మార్షల్  4) జాకోబ్ వైనర్   (1)