Social Icons

Pages

Tuesday, March 20, 2018

General Knowledge - Competitive Exams Special - Indian History

పోటీ పరీక్షల ప్రత్యేకం - ఇండియన్ హిస్టరీ 
1. కనిష్కుడు అవలంభించిన మతం ఏది? - (మహాయాన బౌద్ధం)

2. కనిష్కుడు బౌద్ధ మత దీక్ష ఇవ్వడంలో ముఖ్యపాత్ర వహించినది? - (అశ్వఘోషుడు)

3. కనిష్కుడు వసుమిత్రుని అధ్యక్షతన 4వ బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు? - (కుందలవనం)

4. బౌద్ధ మతం హీనయానం, మహాయానంగా విడిపోయిన బౌద్ధ సంగీతి? - (4)

5. కనిష్కుని ఆస్థానంలోని అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు - (బుద్ధ చరిత్రం, సౌందర్యవనం, శారిపుత్ర ప్రకరణం)

6. చరకుడు రాసిన చరక సంహిత ఏ రకమైన గ్రంథం? - (వైద్య గ్రంథం)

7. శూన్య వాదం, రసాయన వాదాలకు మూల పురుషుడు? - (నాగార్జునుడు)

8. భారతదేశ చరిత్రలో అత్యధిక సంఖ్యలో బంగారు నాణేలను ప్రథమంగా జారీ చేసినవారు? - (కుషాణులు)

9. గ్రీకు, పర్షియన్, భారతీయ దేవతల ప్రతిమలతో నాణేలు వేయించింది? - (కనిష్కుడు)

10. కుషాణులు తమ నాణేలపై ముద్రించిన భాష? - (పారశీకం)

11. కుషాణుల కాలంలో ఎక్కువగా చలామణిలో ఉన్న బంగారు నాణెం? - (దీనారాలు)

12. క్రీ. శ. 78 లో శక సంవత్సరాన్ని ప్రారంభించింది? - (కనిష్కుడు)

13. కుషాణుల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన గాంధార శిల్పకళపై దేని ప్రభావం అధికం? - (గ్రీకు, రోమ్, భారతీయ)

14.  గాంధార శిల్పకళలో ఎవరి విగ్రహాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి? - (గౌతమ బుద్ధుడు)

15.  గాంధార శిల్పకళలో చెక్కిన మొదటి బుద్ధ విగ్రహం లభించిన ప్రదేశం? - (బీమారన్)

16. కనిష్కుడు పెషావర్ వద్ద నిర్మించిన స్థూపం గురించి పేర్కొన్నది? - (హుయాన్ త్సాంగ్)

17. గాంధార శిల్పకళలో అధికంగా ఉపయోగించిన రాయి? - (నల్లరాయి)

18. మధుర శిల్పకళకు ప్రధాన కేంద్రాలుగా నిలిచిన నగరాలు? - (సారనాథ్ - శాలవస్థి)

19. తన బౌద్ధ మత సేవలతో కనిష్కునికి లభించిన బిరుదు? - (రెండో అశోకుడు)

20. కుషాణుల్లో ఆఖరి వాడు? - (వాసుదేవుడు)

No comments:

Post a Comment