Social Icons

Pages

Monday, March 5, 2018

General Knowledge - Empire of Harshavardhana

హర్షవర్ధనుడు - పాలన 
1. పుష్యభూతి వంశ స్థాపకుడు? - (ప్రభాకర వర్ధనుడు)

2. పుష్యభూతి  వంశస్థుల రాజధాని? - (స్థానేశ్వర్)

3. అప్రతిహత విజయాలు సాధించినందుకు ప్రభాకర వర్ధనుడికి లభించిన బిరుదు? - (మహారాజాధిరాజ & హుణహరిణ కేసరి)

4. హర్షుని సోదరి రాజశ్రీని వివాహం చేసుకొన్న కనోజ్ పాలకుడు? - (గృహవర్మ)

5. కన్యాకుజ్జం పై దాడి చేసి, గృహవర్మను చంపి రాజశ్రీని చెరపట్టినది? - (దేవ గుప్తుడు)

6. గౌడ శశాంకుడు చేసిన ప్రధాన అకృత్యం? - (గయలోని బోధి వృక్షాన్ని ధ్వంసం చేయడం)

7. హర్ష వర్ధనుడి పాలన కాలం ? - (క్రీ. శ. 606 - 647)

8.  గౌడ శశాంకుడిని ఓడించి హర్ష వర్ధనుడు ధరించిన బిరుదు? -(రాజపుత్ర)

9. హర్ష వర్ధనుడు తన రాజధానిని మార్చిన ప్రాంతం ? - (కనోజ్)

10. కంనోజ్ నుంచి పాలన సాగించి హర్ష వర్ధనుడు ధరించిన బిరుదు? - (శీలాదిత్య)

11. హర్షుడు ఓడించిన ధృవ సేనుడు ఏ ప్రాంత పాలకుడు? - (వల్లభి)

12. హర్ష వర్ధనుడిని నర్మదా నదీ తీరంలో ఓడించిన చాళుక్య పాలకుడు? - (రెండో పులకేశి)

13. హర్ష వర్ధనుడిని రెండో పులకేశి ఓడించినట్లు తెలిపే శాసనం? - (ఐహోలు శాసనం)

14. ఐహోలు శాసనంలో 'సకలోత్తరపధాదీశుడు' గా ఎవర్ని వర్ణించారు? - (హర్ష వర్ధనుడు)

15. హర్షుడి పాలనలోని విశిష్ట అంశం? - (అధికార వికేంద్రీకరణ)

16. భారతదేశాన్ని పాలించిన చిట్టచివరి హిందూ చక్రవర్తి? - (హర్ష వర్ధనుడు)

17. మారువేషాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కరించిన చక్రవర్తి? - (హర్ష వర్ధనుడు)

18. హర్షుడు తన పాలనలో నిర్ణయించిన రాష్ట్రాల పేరు? - (భక్తులు)

19. హర్షుని కాలంలో నియమితులైన మంత్రి 'రాజస్థానీయ' ప్రధాన విధి? - (విదేశాంగ మంత్రి)

20. హర్ష వర్ధనుడి ఘనతను తెలిపే శాసనాలు? - (ఐహోలు శాసనం, నౌసాసి తామ్ర శాసనం, బన్షికౌర శాసనం)

21. హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు? - (హుయాన్ త్సాంగ్)

22. హర్షుని  పరిపాలన లోని ప్రధాన లోపం? - (శాంతిభద్రతల లోపం)

23. హర్షుని కాలంలో భూమి శిస్తు? - (1/6)

24. హుయాన్ త్సాంగ్, సోదరి రాజశ్రీ ప్రోత్సాహంతో హర్షుడు అవలంభించిన మతం? - (బౌద్ధ మతం)

25. హర్షుడు ప్రతి అయిదేళ్లకోసారి మహామోక్ష పరిషత్తులు నిర్వహించిన ప్రాంతం? - (దేవప్రయాగ)

26. మహామోక్ష పరిషత్తులో హర్షుడు చేసే ఏ కార్యక్రమం ప్రశంసలు పొందింది? - (దానధర్మాలు)

27. హర్షుని కాలంలో అధికార భాష? - (సంస్కృతం)

28. నలందా విశ్వవిద్యాలయానికి, హర్షుడికి గల సంబంధం?  -(100 గ్రామాల ఆదాయాన్ని విరాళంగా ఇవ్వడం)

No comments:

Post a Comment