Social Icons

Pages

Tuesday, March 13, 2018

General Knowledge - Kushan Empire

కుషాణులు 
1. కుషాణులు ఏ తెగకు చెందినవారు? - (మంగోలులు)

2. కుషాణులు గాంధార దేశానికి చెందిన తురుష్కులు అని అభిప్రాయపడింది? - (ఎఫ్. డబ్ల్యూ. థామస్)

3. భారతదేశాన్ని పాలించిన విదేశీయుల్లో గొప్పవారు? - (కుషాణులు)

4. మహారాజ, రాజాధిరాజ అనే బిరుదులతో భారతదేశంలో కుషాణు రాజ్యం స్థాపించింది? - (కుజులకౌడ్ ఫై షెస్)

5. 'దేవపుత్ర' అనే బిరుదు ధరించే సంప్రదాయం కుషాణులు ఎవరి నుంచి గ్రహించారు? - (చైనీయులు)

6. భారతదేశంలో కుషాణుల రాజధాని? - (పురుషపురం)

7. చైనా పై దండెత్తిన తొలి భారతీయ చక్రవర్తి? - (కనిష్కుడు)

8. అపత్రిహత విజయాలతో కనిష్కుడు ధరించిన బిరుదులు? - (సీజర్, రాజపుత్ర)

9. కుషాణుల పరిపాలన వివరాలను తెలిపే గ్రంథం? - (మిళందసిన్హా)

10. కుషాణుల క్షాత్రపి వ్యవస్థను తెలిపే శాసనం? - (సారనాథ్ శాసనం)

11. కుషాణుల కాలంలో 'మహాపరివార్' అంటే? - (పెద్ద కుటుంబం)

12. కుషాణుల కాలంలో కన్యాశుల్కం ఎక్కువగా ఆచరణలో ఉండేదని ప్రస్తావించిన గ్రంథం? - (బుద్ధ చరిత్ర)

13. భారతదేశ సాంఘిక వ్యవస్థలో కోటు, బూటు, ప్యాంటు, టోపీల వంటి ఆధునిక వస్త్రధారణను ప్రవేశపెట్టింది? - (కుషాణులు)

14. కుషాణుల కాలంలో జూదం, వ్యభిచారం, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉండేవని తెలిపే గ్రంథం? - (మహా వంశం)

15. కుషాణులు ఎవరితో విస్తృతంగా వ్యాపారం చేశారు? - (మధ్య ఆసియా)

16. కనిష్కుడి కాలంలో ప్రాచుర్యం లోకి వచ్చిన 'సిల్క్ రూట్' అంటే? - (చైనా - ఇరాన్ మధ్య వర్తక మార్గం)

17. కుషాణుల వ్యాపార ప్రగతితో రోమ్ నుంచి సంపద భారతదేశానికి వలసపోతోందని మదనపడిన చరిత్ర కారుడు? - (ప్లీని)

18. కుషాణులకు సంబంధించిన ఏ విషయాన్ని మధుర శాసనం తెలుపుతుంది? - (తూనికలు - కొలతలు)

19. కుషాణుల కాలంలో ప్రధాన ఎగుమతి? - (విలాస వస్తువులు)

20. కుషాణుల కాలంలో ప్రముఖ రేవు పట్టణం ఏది? - (భరుకచ్చం)

No comments:

Post a Comment