Choose the odd one:
1. ఎ) భరతనాట్యం బి) కూచిపూడి
సి) బాంగ్రా డి) యక్షగానం
సమాధానం (సి)
వివరణ : బాంగ్రా మినహా మిగిలినవన్నీ శాస్త్రీయ నృత్యాలు. బాంగ్రా జానపద నృత్యం
2. ఎ) అక్టోబర్ బి) నవంబర్
సి) డిసెంబర్ డి) జనవరి
సమాధానం : (బి)
వివరణ : నవంబర్ మినహా మిగిలిన నెలలకు నెలకు రోజులు 31. కానీ, నవంబర్ నెలలో 30 రోజులు మాత్రమే ఉంటాయి.
3. ఎ) ముఖ్యమంత్రి బి) లోకసభ సభ్యుడు
సి) రాజ్యసభ సభ్యుడు డి) ప్రధానమంత్రి
సమాధానం : (ఎ)వివరణ : ముఖ్యమంత్రి మినహా మిగిలిన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు.
4. ఎ) కోహిమా బి) ఇంఫాల్
సి) అగర్తల డి) పట్నా
సమాధానం : (డి)
వివరణ: పట్నా మినహా మిగిలినవన్నీ వివిధ ఈశాన్య రాష్ట్రాల రాజధానులు.
5. ఎ) పెల్లాగ్రా బి) బెరిబెరి
సి) ఎనీమియా డి) గాయిటర్
సమాధానం : (డి)
వివరణ: గాయిటర్ మినహా మిగిలినవన్నీ విటమిన్ లోపంతో వస్తాయి. కానీ, గాయిటర్ వ్యాధి మాత్రం అయోడిన్ లోపంతో వస్తుంది.
6. ఎ) బ్యాడ్మింటన్ బి) చెస్
సి) క్యారమ్స్ డి) బిలియర్డ్స్
సమాధానం : (ఎ)
వివరణ: బ్యాడ్మింటన్ తప్ప మిగిలినవన్నీ ఇండోర్ గేమ్స్.
7. ఎ) మే బి) జూన్
సి) జూలై డి) ఆగష్టు
సమాధానం : (బి)
వివరణ: జూన్ మినహా మిగిలిన అన్నీ నెలలకు నెలకు 31 రోజులు ఉంటాయి.
8. ఎ) నైల్ బి) ఓల్గా
సి) నయాగరా డి) అమెజాన్
సమాధానం : (సి)
వివరణ: నయాగరా మినహా మిగిలినవన్నీ నదుల పేర్లు. నయాగరా అనేది జలపాతం
9. ఎ) గుండె బి) నేత్రం
సి) చెవి డి) కాలు
సమాధానం : (ఎ)
వివరణ: గుండె తప్ప మిగిలినవన్నీ జతగా ఉంటాయి.
10. ఎ) నియాసిన్ బి) ట్రిప్సిన్
సి) థయామిన్ డి) రైబోఫ్లావిన్
సమాధానం : (బి)
వివరణ: ట్రిప్సిన్ తప్ప మిగిలినవన్నీ విటమిన్ పేర్లు. ట్రిప్సిన్ అనేది ఎంజైము.
11. ఎ) బంతి బి) చేమంతి
సి) తామర డి) గులాబీ
సమాధానం : (సి)
వివరణ: తామర తప్ప మిగిలిన పువ్వులన్నీ భూమి మీద పెరుగుతాయి. తామర నీటిలో పెరుగుతుంది.
12. ఎ)పోలెండ్ బి) గ్రీస్
సి) స్పెయిన్ డి) కొరియా
సమాధానం : (డి)
వివరణ: కొరియా తప్ప మిగిలిన దేశాలు యూరప్ ఖండంలోనివి. కొరియా ఆసియా ఖండానికి సంబంధించిన దేశం.
13. ఎ) చెన్నై బి) హైదరాబాద్
సి) బెంగళూరు డి) లక్నో
సమాధానం : (డి)
వివరణ: లక్నో తప్ప మిగిలినవన్నీ వివిధ దక్షిణ భారత రాష్ట్రాల రాజధానులు. లక్నో మాత్రం ఉత్తర భారతములోని రాష్ట్రానికి సంబంధించిన రాజధాని.
14. ఎ) కివి బి) గద్ద
సి) పెంగ్విన్ డి) ఆస్ట్రిచ్
సమాధానం : (బి)
వివరణ: గద్ద తప్ప మిగిలినవన్నీ జతగా ఉంటాయి.
15. ఎ) గుండె బి) నేత్రం
సి) చెవి డి) కాలు
సమాధానం : (ఎ)
వివరణ: గుండె తప్ప మిగిలినవన్నీ ఎగరలేని పక్షులు.
16. ఎ) బైకాల్ బి) థాల్
సి) చిలక డి) థార్
సమాధానం : (డి)
వివరణ: థార్ తప్ప మిగిలినవన్నీ సరస్సుల పేర్లు. థార్ అనేది ఎడారి.
17. ఎ) కోణార్క్ బి) మధురై
సి) ఎల్లోరా డి) దిల్వారా
సమాధానం : (సి)
వివరణ: ఎల్లోరా తప్ప మిగిలినవన్నీ ప్రసిద్ధ దేవాలయాలు ఉన్న ప్రదేశాలు. ఎల్లోరా ప్రసిద్ధ గుహలు ఉన్న ప్రదేశం.
18. ఎ) ఋగ్వేదం బి) ఆయుర్వేదం
సి) సామవేదం డి)యజుర్వేదం
సమాధానం : (బి )
వివరణ: ఆయుర్వేదం తప్ప మిగిలినవన్నీ వేదాలు. ఆయుర్వేదం అనేది వైద్య శాస్త్రం.
19. ఎ) గ్రానైట్ బి) లిగ్నైట్
సి) ఆంత్రసైట్ డి) బిటూమినస్
సమాధానం : (ఎ)
వివరణ: గ్రానైట్ తప్ప మిగిలినవన్నీ బొగ్గు రూపాంతరాలు. గ్రానైట్ అనేది విలువైన రాయి.
20. ఎ) సంతాల్స్ బి) ఖోండ్స్
సి) అబోర్స్ డి) డోగ్రి
సమాధానం : (డి)
వివరణ: డోగ్రి తప్ప మిగిలినవన్నీ వివిధ గిరిజన జాతులు. డోగ్రి అనేది ఒక భాష.
21. ఎ) కాలువ బి) వంతెన
సి) ప్రవాహం డి) సెలయేరు
సమాధానం : (బి)
వివరణ: వంతెన తప్ప మిగిలినవన్నీ నీటితో ఉంటాయి.
22. ఎ) నేపాల్ బి) టోక్యో
సి) కాబూల్ డి) బీజింగ్
సమాధానం : (ఎ)
వివరణ: నేపాల్ తప్ప మిగిలినవన్నీ వివిధ దేశాల రాజధానులు. నేపాల్ అనేది ఒక దేశం.
23. ఎ) మహావీరుడు బి) గౌతమ బుద్ధుడు
సి) మహాత్మ గాంధీ డి) గురునానక్
సమాధానం : (సి)
వివరణ: మహాత్మ గాంధీ మినహా మిగిలిన వారు ప్రసిద్ధ మతాల స్థాపకులు.
24. ఎ) రాజీవ్ గాంధీ బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) చరణ్ సింగ్ డి) బాబూ రాజేంద్ర ప్రసాద్
సమాధానం : (డి)
వివరణ: బాబూ రాజేంద్ర ప్రసాద్ తప్ప మిగిలిన వారు ప్రధాన మంత్రులు. బాబూ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.
25. ఎ) పాదరసం బి) ఆక్సిజన్
సి) మెగ్నీషియం డి) సోడియం
సమాధానం : (ఎ)
వివరణ: 4 మూలకాలే. కానీ పాదరసం ద్రవరూప మూలకం.
26. ఎ) కలం బి) నల్లబల్ల
సి) కాగితం డి) పలక
సమాధానం : (ఎ)
వివరణ:కలం తప్ప మిగిలిన వాటిపై వివిధ వస్తువులతో రాయవచ్చు. కలం మాత్రం రాయటానికి ఉపయోగించేది.
27. ఎ) గారో బి) ఖాశీ
సి) కాంగ్రా డి) జెంతియా
సమాధానం : (సి)
వివరణ: కాంగ్రా తప్ప మిగిలినవన్నీ కొండలు. కాని, కాంగ్రా లోయ.
28. ఎ) జూన్ బి) సెప్టెంబర్
సి) నవంబర్ డి) ఆగష్టు
సమాధానం : (డి)
వివరణ: ఆగష్టు తప్ప మిగిలిన నెలలకు నెలకు 30 రోజులు ఉంటాయి. ఆగష్టు నెలకు మాత్రం 31 రోజులు ఉంటాయి.
29. ఎ) మార్చి బి) జూలై
సి) ఆగష్టు డి) మే
సమాధానం : (సి)
వివరణ: అన్ని నెలలకు 31 రోజులు ఉన్నాయి. మార్చి 3 వ నెల, జూలై 7 వ నెల, మే 5 వ నెల అంటే మార్చి, జూలై , మే నెలలు బేసి నెలలు. ఆగష్టు అనేది 8 వ నెల అంటే సరి సంఖ్యకు సంబంధించిన నెల.
30. ఎ) నారింజ బి) పసుపు
సి) ఆకుపచ్చ డి) గులాబి
సమాధానం : (డి)
వివరణ: గులాబి మినహా మిగిలినవన్నీ ఇంద్రధనస్సు రంగుల్లో ఉంటాయి.
31. ఎ) న్యూటన్ బి) మార్కోని
సి) బీతావన్ డి) ఫారడే
సమాధానం : (సి)
వివరణ: బీతావన్ మినహా మిగిలినవారు శాస్త్రవేత్తలు.
32. ఎ) క్యారట్ బి) అల్లం
సి) బీట్ రూట్ డి) అనపకాయ
సమాధానం : (డి)
వివరణ: అనపకాయ తప్ప మిగిలినవన్నీ కూరగాయలు. భూమి నుంచి వస్తాయి.
33. ఎ) గుండె బి) చెవి
సి) ముక్కు డి) నేత్రాలు
సమాధానం : (ఎ)
వివరణ: గుండె తప్ప మిగిలినవన్నీ జ్ఞానేంద్రియాలు.
34. ఎ) బిందుసారుడు బి) బింబిసారుడు
సి) అశోకుడు డి) సంప్రాప్తి
సమాధానం : (బి)
వివరణ: బింబిసారుడు మినహా మిగిలిన వ్యక్తులు మౌర్య వంశానికి చెందిన వారు. బింబిసారుడు హర్యంక వంశానికి చెందిన వ్యక్తి.
35. ఎ) దాద్రా నగర్ హవేలి బి) అండమాన్ నికోబార్ దీవులు
సి) పాండిచ్చేరి డి) జార్ఖండ్
సమాధానం : (డి)
వివరణ: జార్ఖండ్ మినహా మిగిలినవి కేంద్ర పాలిత ప్రాంతాలు. జార్ఖండ్ అనేది రాష్ట్రం పేరు.
36. ఎ) బుల్లి బి) కార్నర్
సి) బంకర్ డి) డ్రిబుల్
సమాధానం : (సి)
వివరణ: బంకర్ మినహా మిగిలిన పదాలు హాకీ క్రీడకు సంబంధించినవి.
37. ఎ) బీర్బల్ బి) ఫైజ్ అహ్మద్
సి) అబుల్ ఫజిల్ డి) తాన్ సేన్
సమాధానం : (బి)
వివరణ: ఫైజ్ అహ్మద్ మినహా మిగిలిన వ్యక్తులు అక్బర్ ఆస్థానానికి చెందినవారు.
38. ఎ) ఆసియా బి) అర్జెంటీనా
సి) ఆఫ్రికా డి) ఆస్ట్రేలియా
సమాధానం : (బి)
వివరణ: అర్జెంటీనా మినహా మిగిలినవి ఖండాల పేర్లు.
39. ఎ) మెరీనా బి) జెర్సోప్పా
సి) విక్టోరియా డి) ఏంజెల్
సమాధానం : (ఎ)
వివరణ: మెరీనా మినహా మిగిలినవి జలపాతాలు. మెరీనా అనేది ఒక బీచ్.
No comments:
Post a Comment