భారతదేశ వ్యవసాయరంగం
1. భారతదేశంలో సుమారు ఎంత శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది? - (58)
2. స్థూల జాతీయోత్పత్తి లో వ్యవసాయరంగం వాటా ఎంత శాతం? - (17. 5)
3. భారతదేశంలో ఎంత శాతం జనాభా పేదరికంలో ఉంది? - (26)
4. ఒక దేశ అభివృద్ధికి సరైన నిర్వచనం దేనితో తెలుస్తుంది? - (తలసరి ఆదాయం)
5. భారత ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా దేనిపై ఆధారపడి ఉంది? - (వ్యవసాయ రంగం)
6. 'ఆపరేషన్ ఫ్లడ్' కు పితామహుడు? - (డా. వర్గీస్ కురియన్)
7. భారతదేశంలో నూనె గింజల ఉత్పత్తి పెరగడానికి కారణం? - (ఎల్లో రెవల్యూషన్)
8. భారతదేశంలో అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేసే రాష్ట్రం? - (అసోం)
9. జాతీయ వ్యవసాయ బీమా పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? - (1999 అక్టోబర్)
10. - ఖరీఫ్ పంట కానిది? - (గోధుమ)
11. ఏ పంచ వర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగంలో రుణాత్మక వృద్ధి నమోదయింది? - (మూడో)
12. కేంద్రీయ వారి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? - (కటక్)
13. భారత్ లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కాఫీ రకం? - (అరబిక్)
14. పర్వత ప్రాంతాల్లో దేనిని ఎక్కువగా పండిస్తారు? - (తేయాకు)
15. కేరళలో ఎక్కువగా వినియోగించే వరి వంగడాన్ని ఉప్పు నెలలో కూడా సాగు చేయవచ్చు. అయితే దాని పేరు? - (పొక్కలి)
16. వరి, జొన్న, చెరుకు, గోధుమ లలో వాణిజ్య పంట ఏది? - (చెరుకు)
17. పత్తి, గోధుమ, వేరుశనగ, బంగాళాదుంప వీటిలో ఏ పంటకు నల్ల రేగడి భూమి ఎక్కువగా అనుకూలించదు? - (వేరుశనగ)
18. నేలకు ఎక్కువ నత్రజనిని అందించాలంటే ఏ పంటను పండించాలి? - (చిరుధాన్యాలు)
19. రబీ, ఖరీఫ్ లే కాక వ్యవసాయ రంగంలోని మరో కాలం? - (జమాద్)
20. అత్యధికంగా పత్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం? - (గుజరాత్)
21. - జాతీయ ఆదాయాన్ని మదించే సంస్థ? - (జాతీయ గణాంక సంస్థ)
22. నేషనల్ శాంపుల్ సర్వే సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? - (1950)
23. దేశంలో అత్యధికంగా రబ్బరును ఉత్పత్తి చేసే రాష్ట్రం? - (కేరళ)
24. 'ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా' గ్రంథ రచయిత? - (బిమల్ జలాన్)
25. కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఫీల్డ్ ఏ రాష్ట్రంలో ఉంది? - (కర్ణాటక)
26. కూరగాయల ఉత్పత్తిలో భారతదేశ స్థానం? - (2)
27. పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం? - (1)
28. నాబార్డ్ ను ఎప్పుడు స్థాపించారు? - (1982)
29. హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది? - (1966 - 67)
30. ప్రధాన మంత్రి గ్రామోద్యమ యోజన ఎప్పుడు ప్రారంభమైంది? - (2000)
31. నేషనల్ పుడ్ సెక్యూరిటీ చట్టాన్ని ఎవరు ప్రకటించారు? - (ప్రణబ్ ముఖర్జీ)
32. ప్రభుత్వ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - (1998 ఆగస్టు)
33. కిసాన్ కాల్ సెంటర్ల ను ఎప్పుడు ప్రారంభించారు? - (2004 జనవరి)
34. మైక్రో ఇరిగేషన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - (2006 జనవరి)
35. భారత్ లో అతి పొడవైన సేద్య కాలువ? - (ఇందిరా గాంధీ)
No comments:
Post a Comment