Social Icons

Pages

Wednesday, October 30, 2013

General Knowledge in Telugu part 2

General Knowledge in Telugu part 2
1. దేని నుంచి దేనికి మార్చడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు?
1) రోలింగ్ (దోర్లించటం) నుంచి స్లైడింగ్ (జార్చడం) కు మార్చడం
2) స్లైడింగ్ నుంచి రోలింగ్ కు మార్చడం
3) పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనటిక్ ఎనర్జీ కి మార్చటం
4) డైనమిక్ నుంచి స్టాటిక్ కు మార్చటం                                             (2)

2. 1984 లో భోపాల్ దుర్ఘటన దేని ఫలితముగా చోటు చేసుకుంది?
1) అణు ప్రమాదం  2) జీవ సంబంధిత ప్రమాదం 3) రసాయన ప్రమాదం 4) పైవేవి కాదు (3)

3. భూమి పై నుంచి చంద్రుడి దిశగా ప్రయోగించిన రాకెట్ పలాయన వేగం (ఎస్కేప్ వెలాసిటీ) అనేది దేని ఆకర్షణ శక్తిని తప్పించుకొనే శక్తి?
1) భూ ఆకర్షణ శక్తి                                                     2) చంద్రుడి ఆకర్షణ శక్తి
3) భూభ్రమణం కారణంగా ఏర్పడే కేంద్రాభిసరణ శక్తి        4) వాతావరణ పీడనం         (1)

4. కింది వాటిలో భారత దేశ ప్రాథమిక శక్తి వనరు ఏది?
1) జల విద్యుత్ 2) సహజ వాయువు 3) బొగ్గు 4) నాప్తా                           (3)

5. ప్రోటియం, డ్యుటిరియం, ట్రిటియం ఇవన్నీ ఏ మూలకానికి చెందిన రూపాలు?
1) హైడ్రోజెన్  2) హీలియం  3) ఇనుము  4) కార్బన్              (1)

6. తులసీ దాస్ ఎవరి సమకాలికుడు?
1) అక్బర్  2) జహంగీర్  3) షాజహాన్   4) ఔరంగజేబు         (1)

7. కింది నేలల్లో ఏ సమ్మేళనం మొక్కల వృద్దికి మంచిది?
1) బంకమన్ను, ఇసుక, గ్రావెల్
2) హ్యూమస్, బంకమన్ను, గ్రావెల్
3) ఇసుక, హ్యూమస్, గ్రావెల్
4)హ్యూమస్, ఇసుక, బంకమన్ను                    (4)

8. కాంతిపాతం (Equinoxes) మీద కిందివాటిలో ఏమి జరుగుతుంది?
1) పగటి సమయం అధికం, రాత్రి సమయం తక్కువ
2) రాత్రి సమయం అధికం, పగటి సమయం  తక్కువ
3)పగలు , రాత్రి సమయాలు దాదాపు సమానం
4) పైవేవి కాదు                                               (3)

9. నౌకలు లేదా రైల్వేల నిర్మాణం కోసం కింద పేర్కొన్న చెట్లలో వేటిని ఎక్కువగా ఉపయోగిస్తారు?
1) దేవదారు, పైన్ వృక్షాలు                    2) పొదలు, తీగలు
3) టేకు , సాల్                                      4) సీసము, కసింద                 (3)

10. వర్షపాతం విషయంలో కిందివాటిలో ఏది ప్రధానపాత్ర పోషిస్తుంది?
1) ఆవిరి  2) ద్రవీకృతం  3) ఆవిరి, ద్రవీకృతం  4) వడపోత             (3)

No comments:

Post a Comment