Social Icons

Pages

Tuesday, August 5, 2014

General Knowledge - General Science Bits 4

31. హెపటైటిస్-బి వ్యాధికి ప్రప్రథమంగా భారతదేశంలో ఏ కంపెనీ టీకా మందును ఉత్పత్తి చేస్తోంది?
ఎ) పార్క్ - డేవిస్, ముంబయి          బి) సండోజ్, ముంబయి
సి) డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హైదరాబాద్     డి) శాంతా బయోటెక్, హైదరాబాద్           (డి)

32. భారతదేశంలో పోషకపదార్థాల లోపం వల్ల కలిగే వ్యాధులలో మొదట దేనిని నివారించాల్సి ఉంటుంది?
ఎ) స్కర్వి       బి) రికెట్స్       సి) జిరాఫ్తాల్మియా      డి) పెల్లాగ్రా       (సి)

33. చక్కెర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది?
ఎ) లాక్టోజ్      బి) మాల్టోజ్      సి) గ్లూకోజ్       డి) సుక్రోజ్      (సి)

34. కింద పేర్కొన్న రోగాలు, వాటిని నివారించే వాక్సిన్ లలో తప్పుగా జతపరచినది ఏది?
ఎ) డిఫ్తీరియ - డీపీటీ     బి) క్షయ - బీసీజీ     సి) తట్టు - ఎంఎంఆర్    డి) ధనుర్వాతం - శాబిన్     (డి)

35. పార్కిన్ సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది?
ఎ) మెదడు     బి) చేతులు      సి) కాళ్లు       డి) నడుము        (ఎ)

36. 'వ్యాక్సినేషన్' ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
ఎ) విలియం హార్వే      బి) అలెగ్జాండర్ ఫ్లెమింగ్      సి) క్రిస్టియన్ బెర్నాడ్    డి) ఎడ్వర్డ్ జెన్నర్     (డి)

37. కింది వాటిలో మొదట కనుక్కున్న వ్యాక్సిన్?
ఎ) మశూచి     బి) బీసీజీ    సి) కలరా     డి) టైఫాయిడ్        (ఎ)

38. రూబియోలా అనే వ్యాధికి మరోపేరు?
ఎ) ఆటలమ్మ         బి) పెద్ద అమ్మవారు     సి) గవద బిళ్లలు     డి) తట్టు      (డి)

39. 'శిశు పక్షవాతం' అని పిలిచే వ్యాధి?
ఎ) పోలియో     బి) గవదలు      సి) తట్టు      డి) మశూచి      (ఎ)

40. 'గవద బిళ్లలు' వ్యాధి వల్ల వాపుకు గురయ్యే గ్రంథులు?
ఎ) జఠర గ్రంథులు     బి) పెరోటిడ్ గ్రంథులు    సి) ఆంత్ర గ్రంథులు      డి) కాలేయం     (బి)

No comments:

Post a Comment